- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 1 దినవృత్తాంతములు 15:24సుమారు క్రీ.పూ. 1042
షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.
- 1 దినవృత్తాంతములు 15:25సుమారు క్రీ.పూ. 1042
కాబట్టి యెహోవా నిబంధన మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు వెళ్లారు.
- 1 దినవృత్తాంతములు 15:26సుమారు క్రీ.పూ. 1042
ఎందుకంటే యెహోవా నిబంధన మందసాన్ని మోస్తున్న లేవీయులకు దేవుడు సహాయం చేశారు, వారు ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను బలిగా అర్పించారు.
- 1 దినవృత్తాంతములు 15:27సుమారు క్రీ.పూ. 1042
దావీదు, మందసాన్ని మోసిన లేవీయులందరు, సంగీతకారులు, సంగీత నాయకుడు కెనన్యా సన్నని నారతో నేసిన వస్ర్తాలు ధరించారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును కూడా ధరించాడు.
- 1 దినవృత్తాంతములు 15:28సుమారు క్రీ.పూ. 1042
ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో పొట్టేళ్ల కొమ్ము బూరల ధ్వనితో, తాళాలు వీణలు సితారలు వాయిస్తూ, యెహోవా నిబంధన మందసాన్ని తీసుకువచ్చారు.
- 1 దినవృత్తాంతములు 15:29సుమారు క్రీ.పూ. 1042
యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. రాజైన దావీదు ఆనందోత్సాహాలతో నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.
- 1 దినవృత్తాంతములు 16:1సుమారు క్రీ.పూ. 1042
వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచి వారు దేవుని సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించారు.
- 1 దినవృత్తాంతములు 16:2సుమారు క్రీ.పూ. 1042
దావీదు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, అతడు యెహోవా పేరిట ప్రజలను దీవించాడు.
- 1 దినవృత్తాంతములు 16:3సుమారు క్రీ.పూ. 1042
అప్పుడతడు ఇశ్రాయేలీయులలో ప్రతి పురుషునికి, స్త్రీకి ఒక రొట్టె, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు.
- 1 దినవృత్తాంతములు 16:4సుమారు క్రీ.పూ. 1042
తర్వాత అతడు యెహోవా మందసం దగ్గర సేవ చేయడానికి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కీర్తించడానికి స్తుతించడానికి, కృతజ్ఞతలు అర్పించడానికి లేవీయులలో కొంతమందిని నియమించాడు.
- 1 దినవృత్తాంతములు 16:5సుమారు క్రీ.పూ. 1042
వారిలో ఆసాపు నాయకుడు, అతని తర్వాతి నాయకుడు జెకర్యా, తర్వాత యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేద్-ఎదోము, యెహీయేలు. వారు వీణలు, సితారలు వాయించడానికి నియమించబడ్డారు. ఆసాపు తాళాలను వాయించేవాడు.
- 1 దినవృత్తాంతములు 16:6సుమారు క్రీ.పూ. 1042
యాజకులైన బెనాయా, యహజీయేలు దేవుని నిబంధన మందసం ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు.
- 1 దినవృత్తాంతములు 16:7సుమారు క్రీ.పూ. 1042
ఆ రోజు దావీదు యెహోవాను స్తుతించడానికి మొదటిసారిగా ఆసాపు, అతని తోటివారికి ఇలా పాడమని చెప్పాడు:
- 1 దినవృత్తాంతములు 16:8సుమారు క్రీ.పూ. 1042
యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.
- 1 దినవృత్తాంతములు 16:9సుమారు క్రీ.పూ. 1042
ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.
- 1 దినవృత్తాంతములు 16:10సుమారు క్రీ.పూ. 1042
ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక.
- 1 దినవృత్తాంతములు 16:11సుమారు క్రీ.పూ. 1042
యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.
- 1 దినవృత్తాంతములు 16:12సుమారు క్రీ.పూ. 1042
ఆయన సేవకులైన ఇశ్రాయేలు వారసులారా! ఆయన ఎన్నుకున్న యాకోబు సంతానమా! ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
- 1 దినవృత్తాంతములు 16:13సుమారు క్రీ.పూ. 1042
O ye seed of Israel his servant, ye children of Jacob, his chosen ones.
- 1 దినవృత్తాంతములు 16:14సుమారు క్రీ.పూ. 1042
ఆయన మన దేవుడైన యెహోవా; ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి.
- 1 దినవృత్తాంతములు 16:15సుమారు క్రీ.పూ. 1042
ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు.
- 1 దినవృత్తాంతములు 16:16సుమారు క్రీ.పూ. 1042
అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.
- 1 దినవృత్తాంతములు 16:17సుమారు క్రీ.పూ. 1042
ఆయన దానిని యాకోబుకు శాసనంగా, ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు:
- 1 దినవృత్తాంతములు 16:18సుమారు క్రీ.పూ. 1042
“నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.”
- 1 దినవృత్తాంతములు 16:19సుమారు క్రీ.పూ. 1042
వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు, ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు,