- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 1 దినవృత్తాంతములు 16:20సుమారు క్రీ.పూ. 1042
వారు దేశం నుండి దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.
- 1 దినవృత్తాంతములు 16:21సుమారు క్రీ.పూ. 1042
ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; వారి కోసం ఆయన రాజులను మందలించారు:
- 1 దినవృత్తాంతములు 16:22సుమారు క్రీ.పూ. 1042
“నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”
- 1 దినవృత్తాంతములు 16:23సుమారు క్రీ.పూ. 1042
సమస్త భూలోకమా! యెహోవాకు పాడండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
- 1 దినవృత్తాంతములు 16:24సుమారు క్రీ.పూ. 1042
దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
- 1 దినవృత్తాంతములు 16:25సుమారు క్రీ.పూ. 1042
యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
- 1 దినవృత్తాంతములు 16:26సుమారు క్రీ.పూ. 1042
ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, కాని యెహోవా ఆకాశాలను సృష్టించారు.
- 1 దినవృత్తాంతములు 16:27సుమారు క్రీ.పూ. 1042
వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి. బలం, ఆనందం ఆయన నివాసస్థలంలో ఉన్నాయి.
- 1 దినవృత్తాంతములు 16:28సుమారు క్రీ.పూ. 1042
ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.
- 1 దినవృత్తాంతములు 16:29సుమారు క్రీ.పూ. 1042
యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకు చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి.
- 1 దినవృత్తాంతములు 16:30సుమారు క్రీ.పూ. 1042
సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు.
- 1 దినవృత్తాంతములు 16:31సుమారు క్రీ.పూ. 1042
ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; “యెహోవా పరిపాలిస్తున్నారు!” అని దేశాల్లో ప్రకటించబడాలి.
- 1 దినవృత్తాంతములు 16:32సుమారు క్రీ.పూ. 1042
సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి; పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి!
- 1 దినవృత్తాంతములు 16:33సుమారు క్రీ.పూ. 1042
అడవి చెట్లు పాటలు పాడాలి, అవి యెహోవా ఎదుట ఆనందంతో పాటలు పాడాలి, యెహోవా భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నారు.
- 1 దినవృత్తాంతములు 16:34సుమారు క్రీ.పూ. 1042
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.
- 1 దినవృత్తాంతములు 16:35సుమారు క్రీ.పూ. 1042
ఇలా మొరపెట్టండి: “దేవా, మా రక్షకా! మమ్మల్ని రక్షించండి; ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చి, విడిపించండి, అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాము.”
- 1 దినవృత్తాంతములు 16:36సుమారు క్రీ.పూ. 1042
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! అని అనగానే ప్రజలంతా, “ఆమేన్, యెహోవాకు స్తుతి” అని చెప్పారు.
- 1 దినవృత్తాంతములు 16:37సుమారు క్రీ.పూ. 1042
యెహోవా నిబంధన మందసం ఎదుట ప్రతిరోజు క్రమంగా సేవ చేయడానికి, దావీదు దాని దగ్గర ఆసాపును, అతని తోటి వారిని నియమించాడు.
- 1 దినవృత్తాంతములు 16:38సుమారు క్రీ.పూ. 1042
అలాగే ఓబేద్-ఎదోమును, అతని అరవై ఎనిమిది మంది తోటి వారిని కూడా అక్కడ నియమించాడు. యెదూతూను కుమారుడైన ఓబేద్-ఎదోము, హోసా అనేవారు ద్వారపాలకులు.
- 1 దినవృత్తాంతములు 16:39సుమారు క్రీ.పూ. 1042
దావీదు యాజకుడైన సాదోకును, అతని తోటి యాజకులను గిబియోనులోని ఆరాధన స్థలంలో ఉన్న యెహోవా సమావేశ గుడారం దగ్గర ఉంచాడు.
- 1 దినవృత్తాంతములు 16:40సుమారు క్రీ.పూ. 1042
యెహోవా ఇశ్రాయేలీయులకు ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం, ప్రతిరోజు ఉదయ సాయంత్రాల్లో క్రమంగా బలిపీఠం మీద దహనబలి యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు.
- 1 దినవృత్తాంతములు 16:41సుమారు క్రీ.పూ. 1042
“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అంటూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించడానికి వారితో కూడ హేమాను, యెదూతూను, పేర్లు చెప్పి ఎన్నుకున్న మరి కొంతమందిని అతడు నియమించాడు.
- 1 దినవృత్తాంతములు 16:42సుమారు క్రీ.పూ. 1042
బూరధ్వని చేయడానికి, తాళాలు వాయించడానికి, దేవున్ని స్తుతించడానికి ఇతర వాయిద్యాలను వాయించడానికి హేమాను, యెదూతూనులను నియమించాడు. యెదూతూను కుమారులను ద్వారపాలకులుగా నియమించాడు.
- 1 దినవృత్తాంతములు 16:43సుమారు క్రీ.పూ. 1042
తర్వాత ప్రజలంతా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. దావీదు తన కుటుంబాన్ని దీవించడానికి తన ఇంటికి తిరిగి వెళ్లాడు.
- 1 దినవృత్తాంతములు 17:1సుమారు క్రీ.పూ. 1042
దావీదు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత, అతడు నాతాను ప్రవక్తతో, “ఇదిగో, యెహోవా నిబంధన మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.