- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 1 దినవృత్తాంతములు 17:2సుమారు క్రీ.పూ. 1042
అందుకు నాతాను దావీదుతో, “దేవుడు నీకు తోడుగా ఉన్నారు, కాబట్టి నీ మనస్సులో ఏముందో అది చేయి” అన్నాడు.
- 1 దినవృత్తాంతములు 17:3సుమారు క్రీ.పూ. 1042
అయితే ఆ రాత్రి దేవుని వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది:
- 1 దినవృత్తాంతములు 17:4సుమారు క్రీ.పూ. 1042
“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టించేది నీవు కాదు.
- 1 దినవృత్తాంతములు 17:5సుమారు క్రీ.పూ. 1042
ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. ఒక గుడారం నుండి మరో గుడారానికి, ఒక నివాసస్థలం నుండి మరో స్థలానికి మారుతూ వచ్చాను.
- 1 దినవృత్తాంతములు 17:6సుమారు క్రీ.పూ. 1042
ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి నాయకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’
- 1 దినవృత్తాంతములు 17:7సుమారు క్రీ.పూ. 1042
“కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.
- 1 దినవృత్తాంతములు 17:8సుమారు క్రీ.పూ. 1042
నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి పేరు నీకు ఇస్తాను.
- 1 దినవృత్తాంతములు 17:9సుమారు క్రీ.పూ. 1042
నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలాంటి తొందర లేకుండా వారి స్వస్థలంలో నివసించేలా వారిని అందులో నాటుతాను. గతంలో వారు చేసినట్లుగా దుర్మార్గులు వారిని ఇక బాధించరు,
- 1 దినవృత్తాంతములు 17:10సుమారు క్రీ.పూ. 1042
అంతేకాదు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుండి జరిగినట్టు దుర్మార్గులు ఇక వారిని బాధించరు. నీ శత్రువులందరి నుండి నీకు నెమ్మది కలుగజేస్తాను. “ ‘యెహోవా నీకు రాజవంశాన్ని ఇస్తారని నేను నీకు ప్రకటిస్తున్నాను:
- 1 దినవృత్తాంతములు 17:11సుమారు క్రీ.పూ. 1042
నీ దినాలు ముగిసి నీ పూర్వికుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తుతాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
- 1 దినవృత్తాంతములు 17:12సుమారు క్రీ.పూ. 1042
నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.
- 1 దినవృత్తాంతములు 17:13సుమారు క్రీ.పూ. 1042
నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. నీకంటే ముందున్న వానికి నేను నా ప్రేమను దూరం చేసినట్లుగా అతనికి ఎప్పుడూ దూరం చేయను.
- 1 దినవృత్తాంతములు 17:14సుమారు క్రీ.పూ. 1042
నా ఇంటి మీద, నా రాజ్యం మీద నేను అతన్ని నిత్యం స్థిరపరుస్తాను; అతని సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”
- 1 దినవృత్తాంతములు 17:15సుమారు క్రీ.పూ. 1042
నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు.
- 1 దినవృత్తాంతములు 17:16సుమారు క్రీ.పూ. 1042
అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “దేవా యెహోవా, మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది?
- 1 దినవృత్తాంతములు 17:17సుమారు క్రీ.పూ. 1042
ఇది మీ దృష్టికి చాలదన్నట్టు నా దేవా, మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. దేవా యెహోవా, మీరు నన్ను మనుష్యుల్లో చాలా గొప్పవానిగా చూశారు.
- 1 దినవృత్తాంతములు 17:18సుమారు క్రీ.పూ. 1042
“మీ సేవకుని ఘనపరుస్తున్నందుకు దావీదు మీతో ఇంకేం చెప్పగలడు? మీ సేవకుని గురించి మీకు తెలుసు.
- 1 దినవృత్తాంతములు 17:19సుమారు క్రీ.పూ. 1042
యెహోవా! మీ సేవకుని కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి ఈ గొప్ప వాగ్దానాలన్నిటిని తెలియజేశారు.
- 1 దినవృత్తాంతములు 17:20సుమారు క్రీ.పూ. 1042
“యెహోవా! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.
- 1 దినవృత్తాంతములు 17:21సుమారు క్రీ.పూ. 1042
మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు.
- 1 దినవృత్తాంతములు 17:22సుమారు క్రీ.పూ. 1042
మీ ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు.
- 1 దినవృత్తాంతములు 17:23సుమారు క్రీ.పూ. 1042
“ఇప్పుడు యెహోవా, మీ సేవకుడనైన నా గురించి నా కుటుంబం గురించి మీరు చేసిన వాగ్దానం ఎల్లకాలం స్థిరపరచబడాలి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి,
- 1 దినవృత్తాంతములు 17:24సుమారు క్రీ.పూ. 1042
అప్పుడు అది సుస్థిరమై మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు మీద దేవుడే ఇశ్రాయేలీయుల దేవుడు!’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.
- 1 దినవృత్తాంతములు 17:25సుమారు క్రీ.పూ. 1042
“నా దేవా! నా కోసం రాజవంశాన్ని స్థాపిస్తాను అని మీరు మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది.
- 1 దినవృత్తాంతములు 17:26సుమారు క్రీ.పూ. 1042
యెహోవా, మీరే దేవుడు! మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు.