- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
కాబట్టి దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి తీసుకురావడానికి ఈజిప్టులో ఉన్న షీహోరు నది నుండి లెబో హమాతు వరకు ఉన్న ఇశ్రాయేలీయులందరిని సమకూర్చాడు.
కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు అని పిలువబడే యెహోవా దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయులందరు యూదాలోని కిర్యత్-యారీము అని పిలువబడే బాలాకు వెళ్లారు.
వారు దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి బయలుదేరారు, ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలారు.
దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, సితారలు, వీణలు, తంబురలు, తాళాలు, బూరలు వాయిస్తూ తమ శక్తి అంతటితో దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
వారు కీదోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు దేవుని మందసాన్ని పట్టుకోడానికి ఉజ్జా చేయి చాపాడు.
ఉజ్జా మందసం మీద చేయి వేసినందుకు యెహోవా కోపం అతని మీద రగులుకుని ఆయన అతన్ని మొత్తగా అతడు అక్కడే దేవుని ఎదుట చనిపోయాడు.
యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.
ఆ రోజు దావీదు దేవునికి భయపడి, “దేవుని మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అడిగాడు.
దేవుని మందసాన్ని తన దగ్గర పెట్టుకోడానికి దావీదు పట్టణానికి తీసుకెళ్లకుండా, అతడు దాన్ని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు.
దేవుని మందసం ఓబేద్-ఎదోము ఇంట్లో అతని కుటుంబం దగ్గర మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటివారిని అతనికి కలిగిన సమస్తాన్ని దీవించారు.
- 1 దినవృత్తాంతములు 14:1సుమారు క్రీ.పూ. 1043
తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దావీదుకు రాజభవనం నిర్మించడానికి దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు.
- 1 దినవృత్తాంతములు 14:2సుమారు క్రీ.పూ. 1043
ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచారని, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని ఎంతో గొప్ప చేశారని దావీదు గ్రహించాడు.
- 1 దినవృత్తాంతములు 14:3సుమారు క్రీ.పూ. 1043
దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా చేసుకుని ఇంకా చాలామంది కుమారులకు కుమార్తెలకు తండ్రి అయ్యాడు.
- 1 దినవృత్తాంతములు 14:4సుమారు క్రీ.పూ. 1043
యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
- 1 దినవృత్తాంతములు 14:5సుమారు క్రీ.పూ. 1043
ఇభారు, ఎలీషువ, ఎల్పెలెతు,
- 1 దినవృత్తాంతములు 14:6సుమారు క్రీ.పూ. 1043
నోగహు, నెఫెగు, యాఫీయ,
- 1 దినవృత్తాంతములు 14:7సుమారు క్రీ.పూ. 1043
ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు.
- 1 దినవృత్తాంతములు 14:8సుమారు క్రీ.పూ. 1047
ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కోడానికి వెళ్లాడు.
- 1 దినవృత్తాంతములు 14:9సుమారు క్రీ.పూ. 1047
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దాడి చేశారు.
- 1 దినవృత్తాంతములు 14:10సుమారు క్రీ.పూ. 1047
అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని దేవుని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.
- 1 దినవృత్తాంతములు 14:11సుమారు క్రీ.పూ. 1047
కాబట్టి దావీదు తన మనుష్యులతో బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా దేవుడు నా శత్రువులను నా ఎదుట ఉండకుండ నా చేత నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టారు.
- 1 దినవృత్తాంతములు 14:12సుమారు క్రీ.పూ. 1047
ఫిలిష్తీయులు తమ దేవతల విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు వాటిని అగ్నిలో కాల్చివేయమని ఆజ్ఞాపించాడు.
- 1 దినవృత్తాంతములు 14:13సుమారు క్రీ.పూ. 1047
మరోసారి ఫిలిష్తీయులు అదే లోయలో దాడి చేశారు.
- 1 దినవృత్తాంతములు 14:14సుమారు క్రీ.పూ. 1047
కాబట్టి దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు, “నీవు నేరుగా వారి వెనుక వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి, కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి.
- 1 దినవృత్తాంతములు 14:15సుమారు క్రీ.పూ. 1047
కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే, యుద్ధానికి బయలుదేరు. ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి దేవుడు నీ ముందుగా వెళ్లారని దాని అర్థం” అని జవాబిచ్చారు.