కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 దినవృత్తాంతములు 10:6సుమారు క్రీ.పూ. 1056

    సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని ఇంటివారందరు ఒకేసారి చనిపోయారు.

  2. 1 దినవృత్తాంతములు 10:7సుమారు క్రీ.పూ. 1056

    సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులందరు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.

  3. 1 దినవృత్తాంతములు 10:8సుమారు క్రీ.పూ. 1056

    మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని కుమారులను చూశారు.

  4. 1 దినవృత్తాంతములు 10:9సుమారు క్రీ.పూ. 1056

    వారు అతన్ని దోచుకుని అతని తలను, అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాల మధ్య, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు.

  5. 1 దినవృత్తాంతములు 10:10సుమారు క్రీ.పూ. 1056

    వారు అతని ఆయుధాలను తమ దేవుళ్ళ గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో వ్రేలాడదీశారు.

  6. 1 దినవృత్తాంతములు 10:11సుమారు క్రీ.పూ. 1056

    ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,

  7. 1 దినవృత్తాంతములు 10:12సుమారు క్రీ.పూ. 1056

    వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.

  8. 1 దినవృత్తాంతములు 10:13సుమారు క్రీ.పూ. 1056

    యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు.

  9. 1 దినవృత్తాంతములు 10:14సుమారు క్రీ.పూ. 1056

    యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.

  10. 1 దినవృత్తాంతములు 11:1సుమారు క్రీ.పూ. 1048

    ఇశ్రాయేలీయులందరు హెబ్రోనులో దావీదు దగ్గరకు వచ్చి, “మేము నీ రక్తసంబంధులము.

  11. 1 దినవృత్తాంతములు 11:2సుమారు క్రీ.పూ. 1048

    గతంలో సౌలు రాజుగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు సైన్యాన్ని నీవే నడిపించావు. నీ దేవుడైన యెహోవా నీతో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు, వారిని పరిపాలిస్తావు’ అని చెప్పారు” అని అన్నారు.

  12. 1 దినవృత్తాంతములు 11:3సుమారు క్రీ.పూ. 1048

    ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు. యెహోవా సమూయేలు ద్వారా వాగ్దానం చేసినట్టే వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.

  13. 1 దినవృత్తాంతములు 11:4సుమారు క్రీ.పూ. 1048

    దావీదు ఇశ్రాయేలీయులందరు యెబూసు అని కూడా పిలువబడే యెరూషలేముకు వెళ్లారు. యెబూసీయులు అక్కడ నివసిస్తున్నారు.

  14. 1 దినవృత్తాంతములు 11:5సుమారు క్రీ.పూ. 1048

    అప్పుడు యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు” అన్నారు. అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.

  15. 1 దినవృత్తాంతములు 11:6సుమారు క్రీ.పూ. 1048

    దావీదు, “ఎవడు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో వాడు ప్రముఖ సైన్యాధిపతి అవుతాడు” అని అన్నప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా దాడి చేసి అధిపతి అయ్యాడు.

  16. 1 దినవృత్తాంతములు 11:7సుమారు క్రీ.పూ. 1048

    దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి దానికి దావీదు పట్టణం అని పేరు వచ్చింది.

  17. 1 దినవృత్తాంతములు 11:8సుమారు క్రీ.పూ. 1048

    అతడు మిద్దె నుండి దాని చుట్టూ పట్టణాన్ని కట్టించగా యోవాబు మిగతా పట్టణ భాగాలను బాగుచేయించాడు.

  18. 1 దినవృత్తాంతములు 11:9సుమారు క్రీ.పూ. 1048

    సైన్యాల యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.

  19. 1 దినవృత్తాంతములు 11:10సుమారు క్రీ.పూ. 1055

    ఇశ్రాయేలుకు యెహోవా వాగ్దానం చేసిన ప్రకారం దావీదును ఆ ప్రాంతమంతటికి రాజుగా చేయడానికి అతనికి ఇశ్రాయేలు వారందరితో కలిసి సహాయం చేసిన వీరులలో ప్రధానులు వీరు.

  20. 1 దినవృత్తాంతములు 11:11సుమారు క్రీ.పూ. 1055

    ఇది దావీదు యొక్క పరాక్రమశాలుల జాబితా: అధికారులలో ముఖ్యుడు, హక్మోనీయుడైన కుమారుడైన యషోబీము; అతడు తన ఈటెతో ఒకే యుద్ధంలో మూడువందల మందిని చంపాడు.

  21. 1 దినవృత్తాంతములు 11:12సుమారు క్రీ.పూ. 1055

    అతని తర్వాత శ్రేణిలో అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు ముగ్గురు యోధులలో ఒకడు.

  22. 1 దినవృత్తాంతములు 11:13సుమారు క్రీ.పూ. 1055

    ఒకసారి ఫిలిష్తీయులు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చినప్పుడు అతడు దావీదుతో పాటు ఉన్నాడు. యవలు నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు దళాలు పారిపోయారు.

  23. 1 దినవృత్తాంతములు 11:14సుమారు క్రీ.పూ. 1055

    కాని వీరు పొలం మధ్యలో నిలబడి, దానిని కాపాడి ఫిలిష్తీయులను చంపారు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు.

  24. 1 దినవృత్తాంతములు 11:15సుమారు క్రీ.పూ. 1055

    ముప్పైమంది ప్రముఖులలో ముగ్గురు అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది.

  25. 1 దినవృత్తాంతములు 11:16సుమారు క్రీ.పూ. 1055

    ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు. ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది.