circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 23:20సుమారు క్రీ.పూ. 1055
గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు.
- 2 సమూయేలు 23:21సుమారు క్రీ.పూ. 1055
అతడు ఒక భారీ ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఈటె ఉన్నప్పటికీ బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు.
- 2 సమూయేలు 23:22సుమారు క్రీ.పూ. 1055
యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు.
- 2 సమూయేలు 23:23సుమారు క్రీ.పూ. 1055
ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.
- 2 సమూయేలు 23:24సుమారు క్రీ.పూ. 1055
ఆ ముప్పైమంది వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను.
- 2 సమూయేలు 23:25సుమారు క్రీ.పూ. 1055
హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
- 2 సమూయేలు 23:26సుమారు క్రీ.పూ. 1055
పత్తీయుడైన హేలెస్సు, తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా.
- 2 సమూయేలు 23:27సుమారు క్రీ.పూ. 1055
అనాతోతుకు చెందిన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై
- 2 సమూయేలు 23:28సుమారు క్రీ.పూ. 1055
అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై.
- 2 సమూయేలు 23:29సుమారు క్రీ.పూ. 1055
నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు, బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి.
- 2 సమూయేలు 23:30సుమారు క్రీ.పూ. 1055
పిరాతోనీయుడైన బెనాయా, గాయషు కనుమలకు చెందిన హిద్దయి
- 2 సమూయేలు 23:31సుమారు క్రీ.పూ. 1055
అర్బాతీయుడైన అబీ-అల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
- 2 సమూయేలు 23:32సుమారు క్రీ.పూ. 1055
షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కుమారులలో యోనాతాను,
- 2 సమూయేలు 23:33సుమారు క్రీ.పూ. 1055
హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు కుమారుడు అహీయాము,
- 2 సమూయేలు 23:34సుమారు క్రీ.పూ. 1055
మయకాతీయుడైన అహస్బయి కుమారుడు ఎలీఫెలెతు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడు ఎలీయాము,
- 2 సమూయేలు 23:35సుమారు క్రీ.పూ. 1055
కర్మెలీయుడైన హెజ్రో, అర్బీయుడైన పయరై,
- 2 సమూయేలు 23:36సుమారు క్రీ.పూ. 1055
సోబావాడైన నాతాను కుమారుడు ఇగాలు, గాదీయుడైన బానీ,
- 2 సమూయేలు 23:37సుమారు క్రీ.పూ. 1055
అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు.
- 2 సమూయేలు 23:38సుమారు క్రీ.పూ. 1055
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు.
- 2 సమూయేలు 23:39సుమారు క్రీ.పూ. 1055
హిత్తీయుడైన ఊరియా.
- 2 సమూయేలు 24:1సుమారు క్రీ.పూ. 1017
యెహోవాకు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీద కోపం రాగా ఆయన, “వెళ్లి ఇశ్రాయేలువారి యూదావారి జనాభాను లెక్కించు” అని దావీదును వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు.
- 2 సమూయేలు 24:2సుమారు క్రీ.పూ. 1017
కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు.
- 2 సమూయేలు 24:3సుమారు క్రీ.పూ. 1017
కాని యోవాబు రాజుతో, “మీ దేవుడైన యెహోవా సైన్యాన్ని వందరెట్లు ఎక్కువ చేయడం నా ప్రభువైన రాజా మీరే చూస్తారు. కానీ నా ప్రభువు రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు?” అని అన్నాడు.
- 2 సమూయేలు 24:4సుమారు క్రీ.పూ. 1017
అయితే రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి వారు రాజు ఎదుట నుండి ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించడానికి బయలుదేరి వెళ్లారు.
- 2 సమూయేలు 24:5సుమారు క్రీ.పూ. 1017
యొర్దాను దాటి గాదు లోయ పట్టణానికి దక్షిణంగా అరోయేరులో శిబిరం ఏర్పరచుకున్నారు. అక్కడినుండి గాదు ప్రాంతం గుండా యాజెరుకు వెళ్లారు.