కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 22:21సుమారు క్రీ.పూ. 1018

    “నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.

  2. 2 సమూయేలు 22:22సుమారు క్రీ.పూ. 1018

    నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.

  3. 2 సమూయేలు 22:23సుమారు క్రీ.పూ. 1018

    ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.

  4. 2 సమూయేలు 22:24సుమారు క్రీ.పూ. 1018

    ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను.

  5. 2 సమూయేలు 22:25సుమారు క్రీ.పూ. 1018

    నా నీతిని బట్టి ఆయన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.

  6. 2 సమూయేలు 22:26సుమారు క్రీ.పూ. 1018

    “నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు, యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,

  7. 2 సమూయేలు 22:27సుమారు క్రీ.పూ. 1018

    నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.

  8. 2 సమూయేలు 22:28సుమారు క్రీ.పూ. 1018

    మీరు దీనులను రక్షిస్తారు, అహంకారులపై మీ దృష్టి ఉంచి వారిని అణచివేస్తారు.

  9. 2 సమూయేలు 22:29సుమారు క్రీ.పూ. 1018

    యెహోవా! మీరు నాకు దీపము; యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తారు.

  10. 2 సమూయేలు 22:30సుమారు క్రీ.పూ. 1018

    మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.

  11. 2 సమూయేలు 22:31సుమారు క్రీ.పూ. 1018

    “దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.

  12. 2 సమూయేలు 22:32సుమారు క్రీ.పూ. 1018

    యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు?

  13. 2 సమూయేలు 22:33సుమారు క్రీ.పూ. 1018

    బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.

  14. 2 సమూయేలు 22:34సుమారు క్రీ.పూ. 1018

    నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.

  15. 2 సమూయేలు 22:35సుమారు క్రీ.పూ. 1018

    నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.

  16. 2 సమూయేలు 22:36సుమారు క్రీ.పూ. 1018

    మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.

  17. 2 సమూయేలు 22:37సుమారు క్రీ.పూ. 1018

    నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.

  18. 2 సమూయేలు 22:38సుమారు క్రీ.పూ. 1018

    “నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.

  19. 2 సమూయేలు 22:39సుమారు క్రీ.పూ. 1018

    వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు.

  20. 2 సమూయేలు 22:40సుమారు క్రీ.పూ. 1018

    మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.

  21. 2 సమూయేలు 22:41సుమారు క్రీ.పూ. 1018

    మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను.

  22. 2 సమూయేలు 22:42సుమారు క్రీ.పూ. 1018

    వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.

  23. 2 సమూయేలు 22:43సుమారు క్రీ.పూ. 1018

    భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను.

  24. 2 సమూయేలు 22:44సుమారు క్రీ.పూ. 1018

    “జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.

  25. 2 సమూయేలు 22:45సుమారు క్రీ.పూ. 1018

    విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.