కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 21:18సుమారు క్రీ.పూ. 1018

    కొంతకాలం తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై రాఫా వారసులలో ఒకడైన సఫును చంపాడు.

  2. 2 సమూయేలు 21:19సుమారు క్రీ.పూ. 1018

    గోబు దగ్గర ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో బేత్లెహేమీయుడైన యాయీరు కుమారుడు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సోదరున్ని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.

  3. 2 సమూయేలు 21:20సుమారు క్రీ.పూ. 1018

    గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.

  4. 2 సమూయేలు 21:21సుమారు క్రీ.పూ. 1018

    అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.

  5. 2 సమూయేలు 21:22సుమారు క్రీ.పూ. 1018

    ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.

  6. 2 సమూయేలు 22:1సుమారు క్రీ.పూ. 1018

    యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు.

  7. 2 సమూయేలు 22:2సుమారు క్రీ.పూ. 1018

    అతడు ఇలా పాడాడు: “యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;

  8. 2 సమూయేలు 22:3సుమారు క్రీ.పూ. 1018

    నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు, నా రక్షణ కొమ్ము. ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు.

  9. 2 సమూయేలు 22:4సుమారు క్రీ.పూ. 1018

    “స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.

  10. 2 సమూయేలు 22:5సుమారు క్రీ.పూ. 1018

    మరణపు అలలు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదల్లా నన్ను ముంచెత్తుతారు.

  11. 2 సమూయేలు 22:6సుమారు క్రీ.పూ. 1018

    సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.

  12. 2 సమూయేలు 22:7సుమారు క్రీ.పూ. 1018

    “నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన చెవులకు చేరింది.

  13. 2 సమూయేలు 22:8సుమారు క్రీ.పూ. 1018

    అప్పుడు భూమి కంపించి అదిరింది, పరలోకపు పునాదులు కదిలాయి. ఆయన కోపానికి అవి వణికాయి.

  14. 2 సమూయేలు 22:9సుమారు క్రీ.పూ. 1018

    ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.

  15. 2 సమూయేలు 22:10సుమారు క్రీ.పూ. 1018

    ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.

  16. 2 సమూయేలు 22:11సుమారు క్రీ.పూ. 1018

    ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు. ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.

  17. 2 సమూయేలు 22:12సుమారు క్రీ.పూ. 1018

    ఆయన చీకటిని తన చుట్టూ పందిరిగా, కారు మేఘాలను పందిరిగా చేసుకున్నారు.

  18. 2 సమూయేలు 22:13సుమారు క్రీ.పూ. 1018

    ఆయన సన్నిధి కాంతి నుండి పిడుగులు వచ్చాయి.

  19. 2 సమూయేలు 22:14సుమారు క్రీ.పూ. 1018

    యెహోవా పరలోకం నుండి ఉరిమారు. మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.

  20. 2 సమూయేలు 22:15సుమారు క్రీ.పూ. 1018

    ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.

  21. 2 సమూయేలు 22:16సుమారు క్రీ.పూ. 1018

    యెహోవా గద్దింపుకు, ఆయన నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి సముద్రపు అగాధాలు కనబడ్డాయి, భూమి పునాదులు బయటపడ్డాయి.

  22. 2 సమూయేలు 22:17సుమారు క్రీ.పూ. 1018

    “ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.

  23. 2 సమూయేలు 22:18సుమారు క్రీ.పూ. 1018

    శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.

  24. 2 సమూయేలు 22:19సుమారు క్రీ.పూ. 1018

    నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.

  25. 2 సమూయేలు 22:20సుమారు క్రీ.పూ. 1018

    ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.