- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 19:37సుమారు క్రీ.పూ. 1023
నేను నా ఊరిలో నా తలిదండ్రుల సమాధి దగ్గరే చనిపోవడానికి మీ సేవకుడనైన నన్ను తిరిగి వెళ్లనివ్వండి. అయితే ఇక్కడ నా సేవకుడైన కింహాము ఉన్నాడు. అతన్ని నా ప్రభువైన రాజుతో కలిసి నది దాటనివ్వండి. మీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చెయ్యండి” అని అన్నాడు.
- 2 సమూయేలు 19:38సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు రాజు, “కింహాము నాతో పాటు రావచ్చు. నీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చేస్తాను. అంతేకాక, నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావో అదంతా నేను నీకు చేస్తాను” అని హామీ ఇచ్చాడు.
- 2 సమూయేలు 19:39సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు ప్రజలందరు, రాజు యొర్దాను నది దాటారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత బర్జిల్లయి తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.
- 2 సమూయేలు 19:40సుమారు క్రీ.పూ. 1023
రాజు గిల్గాలు వెళ్లినప్పుడు రాజుతో పాటు కింహాము కూడా వెళ్లాడు. యూదా సైన్యమంతా ఇశ్రాయేలు సైన్యంలో సగం మంది రాజుతో పాటు వచ్చారు.
- 2 సమూయేలు 19:41సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు ఇశ్రాయేలు వారందరూ రాజైన దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “మా సహోదరులైన యూదా వారు రాజును ఎత్తుకెళ్లి, నిన్ను నీ ఇంటివారిని నీ సేవకులను యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకువచ్చారు?” అని అడిగారు.
- 2 సమూయేలు 19:42సుమారు క్రీ.పూ. 1023
అందుకు యూదా వారు, “రాజు మీకు చాలా దగ్గరి బంధువు కాబట్టి మేమిలా చేశాము. మీకు కోపమెందుకు? మేము రాజు ఆహారంలో ఏమైనా తిన్నామా? మేము మాకోసం ఏమైనా తీసుకున్నామా?” అని ఇశ్రాయేలువారితో అన్నారు.
- 2 సమూయేలు 19:43సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు ఇశ్రాయేలీయులు, “రాజులో మాకు పది భాగాలు ఉన్నాయి. కాబట్టి దావీదు మీద మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. రాజును తిరిగి తీసుకురావడం గురించి మొదట మాట్లాడింది మేమే గదా! మరి మమ్మల్నెందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని యూదా వారితో అన్నారు. అయితే యూదా వారి మాటలు ఇశ్రాయేలువారి మాటలకంటే కఠినంగా ఉన్నాయి.
- 2 సమూయేలు 20:1సుమారు క్రీ.పూ. 1022
బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కుమారుడైన షేబ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతడు బూర ఊది, “దావీదుతో మనకు ఏ భాగం లేదు, యెష్షయి కుమారునిలో ఏ వాటా లేదు, ఇశ్రాయేలీయులారా! ప్రతిఒక్కరు మీ గుడారానికి వెళ్లండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.
- 2 సమూయేలు 20:2సుమారు క్రీ.పూ. 1022
కాబట్టి ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రి కుమారుడైన షేబను వెంబడించారు. కాని యూదావారైతే యొర్దాను నుండి యెరూషలేము వరకు తమ రాజు దగ్గరే ఉండిపోయారు.
- 2 సమూయేలు 20:3సుమారు క్రీ.పూ. 1022
రాజైన దావీదు యెరూషలేములో తన భవనానికి వచ్చి ఆ భవనాన్ని చూసుకోవడానికి ఉంచిన పదిమంది ఉంపుడుగత్తెలను తీసుకెళ్లి కాపలా ఉన్న ఇంట్లో పెట్టి వారిని పోషించాడు కాని వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు చచ్చే వరకు విధవరాండ్రుగా జీవించారు.
- 2 సమూయేలు 20:4సుమారు క్రీ.పూ. 1022
తర్వాత రాజు అమాశాతో, “మూడు రోజుల్లో యూదావారందరిని పిలిపించి వారితో పాటు నీవు కూడా ఇక్కడకు రావాలి” అని చెప్పాడు.
- 2 సమూయేలు 20:5సుమారు క్రీ.పూ. 1022
అమాశా యూదా వారిని పిలిపించడానికి వెళ్లాడు గాని, రాజు అతనికిచ్చిన సమయానికి రాలేదు.
- 2 సమూయేలు 20:6సుమారు క్రీ.పూ. 1022
దావీదు అబీషైని పిలిచి, “అబ్షాలోము కంటే ఈ బిక్రి కుమారుడైన షేబ మనకు ఎక్కువ కీడు చేస్తాడు. నీవు నీ రాజు సేవకులను తీసుకెళ్లి అతన్ని వెంటాడి పట్టుకో లేకపోతే కోటగోడలున్న పట్టణాల్లో దాక్కుని మన నుండి తప్పించుకుంటాడు” అని చెప్పాడు.
- 2 సమూయేలు 20:7సుమారు క్రీ.పూ. 1022
కాబట్టి యోవాబు మనుష్యులు కెరేతీయులు పెలేతీయులు యుద్ధ వీరులందరు అబీషై నాయకత్వంలో యెరూషలేము నుండి బయలుదేరి బిక్రి కుమారుడైన షేబను వెంటాడటానికి వెళ్లారు.
- 2 సమూయేలు 20:8సుమారు క్రీ.పూ. 1022
వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు చేరుకున్నపుడు, అమాశా వారిని కలుసుకోడానికి అక్కడికి వచ్చాడు. యోవాబు యుద్ధ వస్త్రాలు ధరించాడు దానిపైన ఉన్న నడికట్టుకు వ్రేలాడుతున్న ఒరలో కత్తి ఉంది. అతడు ముందుకు అడుగు వేసినప్పుడు ఒరలో నుండి కత్తి జారిపడింది.
- 2 సమూయేలు 20:9సుమారు క్రీ.పూ. 1022
యోవాబు, “నా సోదరుడా! క్షేమమా?” అని అమాశాను అడిగి అతన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లు కుడిచేతితో అతని గడ్డం పట్టుకున్నాడు.
- 2 సమూయేలు 20:10సుమారు క్రీ.పూ. 1022
యోవాబు ఎడమ చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కాబట్టి అజాగ్రత్తగా ఉన్నాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో పొడవగానే అమాశా ప్రేగులు బయటకు వచ్చి నేల మీద పడి అక్కడే అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు అతని తమ్ముడైన అబీషైలు బిక్రి కుమారుడైన షేబను వెంటాడుతూ వెళ్లారు.
- 2 సమూయేలు 20:11సుమారు క్రీ.పూ. 1022
యోవాబు మనుష్యుల్లో ఒకడు అమాశా మృతదేహం దగ్గర నిలబడి, “యోవాబును ఇష్టపడేవారు, దావీదు వైపు ఉన్నవారందరు యోవాబును వెంబడించండి” అన్నాడు.
- 2 సమూయేలు 20:12సుమారు క్రీ.పూ. 1022
అమాశా మార్గం మధ్యలో రక్తంతో కొట్టుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సైనికులందరూ అక్కడే ఆగిపోవడం ఆ వ్యక్తి చూసి, అమాశా శవాన్ని దారిలో నుండి పొలంలోకి లాక్కెళ్లి ఆ దారిన వచ్చినవారు నిలబడి చూడకుండ ఆ శవం మీద బట్ట కప్పాడు.
- 2 సమూయేలు 20:13సుమారు క్రీ.పూ. 1022
అమాశా శవాన్ని దారిలో నుండి తీసిన తర్వాత అందరు బిక్రి కుమారుడైన షేబను వెంటాడడానికి యోవాబు వెంట వెళ్లారు.
- 2 సమూయేలు 20:14సుమారు క్రీ.పూ. 1022
షేబ ఇశ్రాయేలు గోత్రాల వారందరి దగ్గరకు, ఆబేల్ బేత్ మయకా వారి దగ్గరకు బెరీయుల దగ్గరకు వెళ్లగా వారంతా కలిసికట్టుగా వచ్చి అతన్ని వెంబడించారు.
- 2 సమూయేలు 20:15సుమారు క్రీ.పూ. 1022
యోవాబుతో ఉన్న సైన్యమంత వచ్చి, ఆబేల్-బేత్-మయకాలో షేబను ముట్టడించి పట్టణ గోడలకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టారు. యోవాబు సైన్యమంతా గోడ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే,
- 2 సమూయేలు 20:16సుమారు క్రీ.పూ. 1022
ఆ పట్టణంలో ఉన్న ఒక తెలివైన స్త్రీ బిగ్గరగా, “వినండి! వినండి! నేను యోవాబుతో మాట్లాడాలి. అతన్ని ఇక్కడకు రమ్మనండి” అని చెప్పింది.
- 2 సమూయేలు 20:17సుమారు క్రీ.పూ. 1022
యోవాబు ఆమె దగ్గరకు వెళ్లగా ఆమె, “యోవాబు నీవేనా?” అని అడిగింది. అతడు, “నేనే” అన్నాడు. ఆమె, “నీ సేవకురాలు నీతో చెప్పేది వినండి” అని అన్నది. అతడు, “చెప్పు వింటాను” అన్నాడు.
- 2 సమూయేలు 20:18సుమారు క్రీ.పూ. 1022
అప్పుడు ఆమె, “పూర్వం ప్రజలు ‘ఏదైనా సమస్య ఉంటే ఆబేలులో పరిష్కరించుకోండి’ అనేవారు. అలా వారు పరిష్కారం పొందేవారు.