కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 19:12సుమారు క్రీ.పూ. 1023

    మీరు నా సోదరులు నా రక్త సంబంధులు! రాజును తిరిగి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అని యూదా పెద్దలను అడగండి.

  2. 2 సమూయేలు 19:13సుమారు క్రీ.పూ. 1023

    తర్వాత అమాశాతో, ‘నీవు నాకు రక్త సంబంధివి కదా! యోవాబు స్థానంలో నిన్ను నా సేనాధిపతిగా నేను చేయకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు’ అని చెప్పండి” అన్నాడు.

  3. 2 సమూయేలు 19:14సుమారు క్రీ.పూ. 1023

    అతడు వెళ్లి యూదావారందరు ఒక్క మాట మీద ఉండేలా వారందరి హృదయాలను గెలుచుకున్నాడు. అప్పుడు వారు, “మీరు మీ సైన్యం తిరిగి రండి” అని రాజుకు కబురు పంపించారు.

  4. 2 సమూయేలు 19:15సుమారు క్రీ.పూ. 1023

    రాజు తిరిగి రావడానికి బయలుదేరి యొర్దాను ఒడ్డుకు చేరుకున్నాడు. యూదా వారు రాజును కలవడానికి, రాజును నది ఇవతలికి తీసుకురావడానికి గిల్గాలుకు వచ్చారు.

  5. 2 సమూయేలు 19:16సుమారు క్రీ.పూ. 1023

    బహూరీముకు చెందిన బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన షిమీ త్వరత్వరగా రాజైన దావీదును కలుసుకోడానికి యూదా వారితో పాటు వచ్చాడు.

  6. 2 సమూయేలు 19:17సుమారు క్రీ.పూ. 1023

    అతనితో వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. అంతేకాక సౌలు కుటుంబ సేవకుడైన సీబా, అతని పదిహేను మంది కుమారులు, అతని ఇరవైమంది సేవకులు కూడా వచ్చారు. వారు యొర్దాను ఒడ్డున ఉన్న రాజు దగ్గరకు త్వరగా వెళ్లారు.

  7. 2 సమూయేలు 19:18సుమారు క్రీ.పూ. 1023

    రాజు కుటుంబీకులను ఇవతలకు దాటించడానికి, రాజు కోరినట్లు చేయడానికి రేవు పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను దాటిన తర్వాత గెరా కుమారుడైన షిమీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి,

  8. 2 సమూయేలు 19:19సుమారు క్రీ.పూ. 1023

    “నా రాజా! నేను చేసిన దాని బట్టి నా మీద నేరం మోపవద్దు. నా ప్రభువు రాజువైన నీవు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోవద్దు. దానిని మనస్సులో ఉంచుకోవద్దు.

  9. 2 సమూయేలు 19:20సుమారు క్రీ.పూ. 1023

    ఎందుకంటే నేను పాపం చేశానని నీ సేవకుడైన నాకు తెలుసు, కానీ ఈ రోజు నేను యోసేపు గోత్రాల నుండి మొదటివానిగా వచ్చి నా ప్రభువైన రాజును కలుసుకున్నాను” అని చెప్పాడు.

  10. 2 సమూయేలు 19:21సుమారు క్రీ.పూ. 1023

    అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై, “యెహోవా అభిషేకించినవాన్ని శపించిన ఈ షిమీకి మరణశిక్ష విధించాలి?” అన్నాడు.

  11. 2 సమూయేలు 19:22సుమారు క్రీ.పూ. 1023

    అందుకు దావీదు, “సెరూయా కుమారులారా! దీనితో మీకు ఉన్న సంబంధం ఏమిటి? దీనిలో కల్పించుకోడానికి మీకు ఏమి హక్కు? ఇలాంటి సమయంలో మీరు నాకు శత్రువులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలులో ఎవరికైనా మరణశిక్ష విధించడం సరియైనదేనా? ఈ రోజే నేను ఇశ్రాయేలుకు రాజును అని మీకు తెలియదా?” అని చెప్పి,

  12. 2 సమూయేలు 19:23సుమారు క్రీ.పూ. 1023

    “నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు.

  13. 2 సమూయేలు 19:24సుమారు క్రీ.పూ. 1023

    సౌలు మనుమడు మెఫీబోషెతు కూడా రాజును కలుసుకోడానికి వచ్చాడు. రాజు వెళ్లిన రోజు నుండి అతడు క్షేమంగా తిరిగివచ్చిన రోజు వరకు మెఫీబోషెతు తన కాళ్లు కడుక్కోలేదు. గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు.

  14. 2 సమూయేలు 19:25సుమారు క్రీ.పూ. 1023

    దావీదును కలుసుకోవటానికి అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు రాజు, “మెఫీబోషెతూ, నీవు నాతో కూడా ఎందుకు వెళ్లలేదు?” అని అతన్ని అడిగాడు.

  15. 2 సమూయేలు 19:26సుమారు క్రీ.పూ. 1023

    అందుకతడు, “నా ప్రభువైన నా రాజా! మీ సేవకుడనైన నేను కుంటివాన్ని కాబట్టి గాడిద మీద జీను వేయించుకుని ఎక్కి రాజుతో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నాను. కాని నా సేవకుడైన సీబా నన్ను మోసం చేశాడు.

  16. 2 సమూయేలు 19:27సుమారు క్రీ.పూ. 1023

    అంతేకాక సీబా నీ సేవకుడనైన నా విషయంలో కూడా నీకు అబద్ధాలు చెప్పాడు. నా ప్రభువైన నా రాజు దేవదూత వంటివాడు. కాబట్టి నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయి.

  17. 2 సమూయేలు 19:28సుమారు క్రీ.పూ. 1023

    నా తాతగారి వారసులందరూ నా ప్రభువైన రాజు నుండి మరణానికి మాత్రమే పాత్రులు, కానీ మీరు మీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో మీ సేవకునికి స్థానం ఇచ్చారు. అలాంటప్పుడు రాజుగారికి మనవి చేయడానికి నాకు ఏ హక్కు ఉంది?” అన్నాడు.

  18. 2 సమూయేలు 19:29సుమారు క్రీ.పూ. 1023

    అప్పుడు రాజు, “నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవు, సీబా ఆ భూమిని చెరిసగం పంచుకోమని చెప్పాను గదా” అన్నాడు.

  19. 2 సమూయేలు 19:30సుమారు క్రీ.పూ. 1023

    అందుకు మెఫీబోషెతు, “నా ప్రభువైన రాజు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి అతడే అంతా తీసుకోవచ్చు” అన్నాడు.

  20. 2 సమూయేలు 19:31సుమారు క్రీ.పూ. 1023

    గిలాదీయుడైన బర్జిల్లయి కూడా రాజుతో పాటు యొర్దాను దాటి, నది అవతలి నుండి అతన్ని సాగనంపడానికి రోగెలీము నుండి వచ్చాడు.

  21. 2 సమూయేలు 19:32సుమారు క్రీ.పూ. 1023

    బర్జిల్లయి ఎనభై సంవత్సరాల ముసలివాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి భోజన పదార్ధాలు సరఫరా చేసేవాడు.

  22. 2 సమూయేలు 19:33సుమారు క్రీ.పూ. 1023

    రాజు, “నాతో పాటు నది దాటి యెరూషలేములో నా దగ్గరే ఉండిపో, నేను నిన్ను పోషిస్తాను” అని బర్జిల్లయితో చెప్పాడు.

  23. 2 సమూయేలు 19:34సుమారు క్రీ.పూ. 1023

    అందుకు బర్జిల్లయి రాజుతో, “రాజైన నీతో కూడా యెరూషలేము వచ్చి అక్కడ ఉండడానికి నేనెంతకాలం బ్రతుకుతాను.

  24. 2 సమూయేలు 19:35సుమారు క్రీ.పూ. 1023

    నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు. సుఖదుఃఖాల మధ్య తేడాను నేను చెప్పగలనా? మీ సేవకుడు భోజన పదార్ధాల రుచి చూడగలడా? నేను ఇంకా గాయనీగాయకుల స్వరాలను వినగలనా? నా ప్రభువును రాజువునైన మీకు మీ సేవకుడు ఎందుకు అధనపు భారం కావాలి?

  25. 2 సమూయేలు 19:36సుమారు క్రీ.పూ. 1023

    నీ సేవకుడనైన నేను యొర్దాను నది దాటి రాజుతో కలిసి కొంత దూరం వస్తాను. కానీ నా ప్రభువైన రాజుకు నీ సేవకుడనైన నేనెందుకు భారమవ్వాలి?