circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 18:20సుమారు క్రీ.పూ. 1023
అందుకు యోవాబు, “ఈ వార్తను ఈ రోజు నీవు మోసుకెళ్లవద్దు ఎందుకంటే తన కుమారుడు చనిపోవడం రాజుకు శుభవార్త కాదు కదా! నీవు మరోసారి నా దూతగా వార్తను మోసుకెళ్దువులే” అని అతనితో చెప్పాడు.
- 2 సమూయేలు 18:21సుమారు క్రీ.పూ. 1023
తర్వాత యోవాబు కూషీయున్ని పిలిచి, “నీవు వెళ్లి, నీవు చూసిన దానిని రాజుకు చెప్పు” అని చెప్పాడు. ఆ కూషీయుడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని వెళ్లాడు.
- 2 సమూయేలు 18:22సుమారు క్రీ.పూ. 1023
అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబును, “ఏమైనా కానివ్వండి, నేను కూషీయుని వెంట పరుగెడతాను; నన్ను వెళ్లనివ్వండి” అని మరోసారి వేడుకున్నాడు. కాని యోవాబు, “నా కుమారుడా, నీవెందుకు వెళ్లాలనుకుంటున్నావు? నీకు బహుమతిని తెచ్చే వార్తేమి నీ దగ్గర లేదు” అన్నాడు.
- 2 సమూయేలు 18:23సుమారు క్రీ.పూ. 1023
అయితే అతడు, “ఏది ఏమైనా సరే, నేను వెళ్తాను” అన్నాడు. కాబట్టి యోవాబు, “సరే పరుగెత్తు” అన్నాడు. అహిమయస్సు మైదానం మీదుగా పరుగెత్తుకొని వెళ్లి కూషీయుని కంటే ముందుగా చేరుకున్నాడు.
- 2 సమూయేలు 18:24సుమారు క్రీ.పూ. 1023
దావీదు రెండు గుమ్మాల మధ్యలో కూర్చుని ఉన్నాడు. కావలివాడు గుమ్మం పైనున్న గోడ మీదికి ఎక్కి చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఒంటరిగా పరుగెత్తుకొని రావడం కనిపించింది.
- 2 సమూయేలు 18:25సుమారు క్రీ.పూ. 1023
కావలివాడు గట్టిగా అరిచి రాజుకు ఆ సంగతి చెప్పాడు. రాజు, “అతడు ఒంటరిగా వస్తున్నాడంటే ఒకవేళ మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు. పరుగెడుతూ వస్తున్నవాడు మరింత దగ్గరకు వచ్చాడు.
- 2 సమూయేలు 18:26సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు కావలివాడు మరొక వ్యక్తి పరిగెత్తుకు రావడం చూసి ద్వారపాలకునితో, “అదిగో, మరొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు” అని గట్టిగా చెప్పాడు. రాజు, “అతడు కూడా మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు.
- 2 సమూయేలు 18:27సుమారు క్రీ.పూ. 1023
కావలివాడు, “మొదట పరుగెత్తుకొని వస్తున్నవాడు సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెడుతున్నట్టుంది” అని అన్నాడు. అందుకు రాజు, “అతడు మంచివాడు, మంచివార్తనే తెస్తున్నాడేమో” అని అన్నాడు.
- 2 సమూయేలు 18:28సుమారు క్రీ.పూ. 1023
అహిమయస్సు, “అంతా క్షేమమే” అని అరుస్తూ, రాజు నేలకు తలవంచి నమస్కారం చేసి, “మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం! నా ప్రభువైన రాజుకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఆయన మనకు అప్పగించారు” అన్నాడు.
- 2 సమూయేలు 18:29సుమారు క్రీ.పూ. 1023
అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.
- 2 సమూయేలు 18:30సుమారు క్రీ.పూ. 1023
రాజు, “ప్రక్కకు జరిగి, అక్కడే ఉండు” అన్నాడు. కాబట్టి అతడు ప్రక్కకు జరిగి అక్కడే నిలబడ్డాడు.
- 2 సమూయేలు 18:31సుమారు క్రీ.పూ. 1023
అంతలో కూషీయుడు వచ్చి, “నా ప్రభువా రాజా! శుభవార్త వినండి! ఈ రోజు యెహోవా మీ మీదికి లేచిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి నీకు న్యాయం చేశారు” అని చెప్పాడు.
- 2 సమూయేలు 18:32సుమారు క్రీ.పూ. 1023
రాజు కూషీయున్ని, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు కూషీయుడు, “నా ప్రభువైన రాజు యొక్క శత్రువులకు, రాజుకు హాని చేయాలనుకున్న వారందరికి ఆ యువకునికి పట్టిన గతే పట్టాలి” అన్నాడు.
- 2 సమూయేలు 18:33సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు రాజు చాలా కలత చెంది గుమ్మానికి పైన ఉన్న గది లోనికి వెళ్లి, “నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది. అబ్షాలోమా! నా కుమారుడా! నా కుమారుడా” అని అంటూ ఏడ్చాడు.
- 2 సమూయేలు 19:1సుమారు క్రీ.పూ. 1023
“రాజు అబ్షాలోము గురించి ఏడుస్తూ దుఃఖిస్తున్నాడు” అని ఎవరో యోవాబుకు చెప్పారు.
- 2 సమూయేలు 19:2సుమారు క్రీ.పూ. 1023
“రాజు తన కుమారుని గురించి దుఃఖిస్తున్నాడు” అని సైనికులు విన్నారు కాబట్టి ఆ రోజు విజయం సైన్యమంతటికి దుఃఖంగా మారింది.
- 2 సమూయేలు 19:3సుమారు క్రీ.పూ. 1023
యుద్ధం నుండి పారిపోయినందుకు సిగ్గుపడుతున్న సైనికులు ఆ రోజు దొంగల్లా పట్టణంలోకి ప్రవేశించారు.
- 2 సమూయేలు 19:4సుమారు క్రీ.పూ. 1023
రాజు ముఖం కప్పుకుని, “నా కుమారుడా అబ్షాలోమా! అబ్షాలోమా నా కుమారుడా! నా కుమారుడా!” అని గట్టిగా ఏడ్చాడు.
- 2 సమూయేలు 19:5సుమారు క్రీ.పూ. 1023
యోవాబు రాజభవనానికి వెళ్లి, “ఈ రోజు మీరు మీ ప్రాణాలను మీ కుమారుల కుమార్తెల ప్రాణాలను మీ భార్యల, ఉంపుడుగత్తెల ప్రాణాలను రక్షించిన మీ సైన్యమంతటిని అవమానపరిచారు.
- 2 సమూయేలు 19:6సుమారు క్రీ.పూ. 1023
మిమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తున్నారు. మీ సేనాధిపతులు వారి సైన్యం మీకు ముఖ్యం కాదని ఈ రోజు మీరు స్పష్టం చేశారు. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతికి ఉంటే మీ దృష్టికి సరియైనదిగా ఉండేది, మీరు సంతోషించేవారని నాకర్థమయ్యింది.
- 2 సమూయేలు 19:7సుమారు క్రీ.పూ. 1023
ఇప్పుడు మీరు లేచి బయటకు వచ్చి మీ సైన్యాన్ని ప్రోత్సహించండి. మీరు ఇప్పుడు బయటకు రాకపోతే ఈ రాత్రి వారిలో ఒక్కడూ మీ దగ్గర ఉండరని యెహోవా పేరిట ఒట్టు పెట్టి చెప్తున్నాను. అది మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీకు వచ్చిన కష్టాల కన్నా తీవ్రంగా ఉంటుంది” అని అన్నాడు.
- 2 సమూయేలు 19:8సుమారు క్రీ.పూ. 1023
కాబట్టి రాజు లేచి వచ్చి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడని విన్న ప్రజలందరూ రాజును కలవడానికి వచ్చారు. ఇంతలో ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళకు పారిపోయారు.
- 2 సమూయేలు 19:9సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రజలందరు తమలో తాము వాదించుకుంటూ, “మనలను శత్రువుల చేతిలో నుండి విడిపించింది రాజు; మనలను ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడింది కూడా అతడే. కాని ఇప్పుడు అతడు అబ్షాలోము కారణంగా దేశం విడిచి పారిపోయాడు.
- 2 సమూయేలు 19:10సుమారు క్రీ.పూ. 1023
అయితే మనం మనమీద రాజుగా అభిషేకించిన అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. కాబట్టి మన రాజును తిరిగి ఎందుకు తీసుకురాకూడదు?” అని చెప్పుకున్నారు.
- 2 సమూయేలు 19:11సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు ఆ సంగతి విన్న రాజైన దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులకు ఇలా కబురు పంపించాడు: “ ‘ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటున్న విషయం రాజభవనంలో ఉన్న రాజుకు చేరింది. మరి రాజును తన భవనానికి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?