- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 17:24సుమారు క్రీ.పూ. 1023
దావీదు మహనయీముకు చేరుకున్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలీయులతో కలిసి యొర్దాను నది దాటి వెళ్లిపోయారు.
- 2 సమూయేలు 17:25సుమారు క్రీ.పూ. 1023
అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన యెతెరు. అతని తల్లి అబీగయీలు యోవాబు తల్లియైన సెరూయాకు సోదరియైన నాహాషు కుమార్తె.
- 2 సమూయేలు 17:26సుమారు క్రీ.పూ. 1023
అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు ప్రాంతంలో శిబిరం ఏర్పరచుకున్నారు.
- 2 సమూయేలు 17:27సుమారు క్రీ.పూ. 1023
దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల పట్టణమైన రబ్బాకు చెందిన నాహాషు కుమారుడైన షోబీ, లోదెబారుకు చెందిన అమ్మీయేలు కుమారుడైన మాకీరు, రోగెలీముకు చెందిన గిలాదీయుడైన బర్జిల్లయిలు,
- 2 సమూయేలు 17:28సుమారు క్రీ.పూ. 1023
పరుపులు, వంట పాత్రలు, కుండలు తీసుకువచ్చారు. ఆహారంగా గోధుమలు, యవలు, పిండి, వేయించిన ధాన్యం, చిక్కుడు కాయలు, పప్పులు,
- 2 సమూయేలు 17:29సుమారు క్రీ.పూ. 1023
తేనె, పెరుగు, గొర్రెలు, ఆవు పాల జున్ను దావీదు, అతనితో ఉన్న ప్రజల కోసం తెచ్చారు. ఎందుకంటే, “అరణ్యంలో ప్రజలు అలసిపోయి, ఆకలితో దాహంతో ఉన్నారు” అని వారు గ్రహించారు.
- 2 సమూయేలు 18:1సుమారు క్రీ.పూ. 1023
దావీదు తనతో ఉన్న సైన్యాన్ని సమకూర్చి, వారిలో ప్రతి వేయిమందికి సహస్రాధిపతులను, ప్రతి వందమందికి శతాధిపతులను నియమించాడు.
- 2 సమూయేలు 18:2సుమారు క్రీ.పూ. 1023
దావీదు తన సైన్యాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని యోవాబు ఆధీనంలో, మరొక భాగాన్ని యోవాబు సోదరుడు, సెరూయా కుమారుడైన అబీషై ఆధీనంలో, ఇంకొక భాగాన్ని గిత్తీయుడైన ఇత్తయి ఆధీనంలో ఉంచాడు. రాజు తన సేనలను పంపుతూ వారితో, “నేనే స్వయంగా మీతో వస్తున్నా” అని చెప్పాడు.
- 2 సమూయేలు 18:3సుమారు క్రీ.పూ. 1023
అయితే వారు, “మీరు రాకూడదు. ఒకవేళ మేము పారిపోవలసి వస్తే, ప్రజలు మా గురించి పట్టించుకోరు. మాలో సగం మంది చనిపోయినా ప్రజలు పట్టించుకోరు. కాని మీరు మాలాంటి పదివేలమందితో సమానము. కాబట్టి మీరు పట్టణంలో ఉండి మాకు సహాయం అందిస్తే మేలు” అన్నారు.
- 2 సమూయేలు 18:4సుమారు క్రీ.పూ. 1023
అందుకు రాజు, “మీకు ఏది మంచిదో నేను అదే చేస్తాను” అని చెప్పాడు. రాజు గుమ్మం దగ్గర నిలబడి ఉండగా వారందరూ వందల గుంపులుగా వేల గుంపులుగా బయలుదేరి వెళ్లారు.
- 2 సమూయేలు 18:5సుమారు క్రీ.పూ. 1023
రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను, “నన్ను బట్టి యువకుడైన అబ్షాలోముపై దయ చూపించండి” అని ఆదేశించాడు. అబ్షాలోము గురించి రాజు దళాధిపతులందరికి ఆజ్ఞ ఇవ్వడం సైన్యమంతా విన్నారు.
- 2 సమూయేలు 18:6సుమారు క్రీ.పూ. 1023
దావీదు సైన్యం ఇశ్రాయేలీయులతో పోరాడడానికి యుద్ధ స్థలానికి వెళ్లింది. యుద్ధం ఎఫ్రాయిం అడవిలో జరిగింది.
- 2 సమూయేలు 18:7సుమారు క్రీ.పూ. 1023
అక్కడ ఇశ్రాయేలీయుల సైన్యం దావీదు సైన్యం చేతిలో ఓడిపోయారు. ఆ రోజు చాలా ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది అంటే ఇరవై వేలమంది సైనికులు చంపబడ్డారు.
- 2 సమూయేలు 18:8సుమారు క్రీ.పూ. 1023
యుద్ధం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆ రోజున ఖడ్గం వలన కంటే అడవిలో చిక్కుకుని చనిపోయినవారే ఎక్కువ.
- 2 సమూయేలు 18:9సుమారు క్రీ.పూ. 1023
అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వెళ్తూ దావీదు సైన్యానికి ఎదురయ్యాడు. ఆ కంచరగాడిద గుబురైన కొమ్మలు ఉన్న ఒక సింధూర వృక్షం క్రింది నుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము జుట్టు చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. అయితే ఆ కంచరగాడిద అలాగే ముందుకు వెళ్లిపోవడంతో అతడు గాలిలో వ్రేలాడుతూ ఉండిపోయాడు.
- 2 సమూయేలు 18:10సుమారు క్రీ.పూ. 1023
అది చూసిన ఒకడు యోవాబు దగ్గరకు వెళ్లి, “అబ్షాలోము సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.
- 2 సమూయేలు 18:11సుమారు క్రీ.పూ. 1023
యోవాబు ఆ విషయం చెప్పిన వానితో, “ఏంటి! నీవతన్ని చూశావా? మరి వెంటనే అతన్ని నేలమీద పడేలా ఎందుకు కొట్టలేదు? నీవలా చేసి ఉంటే పది షెకెళ్ళ వెండిని ఒక యోధుల నడికట్టును నీకు ఇచ్చి ఉండేవాన్ని” అన్నాడు.
- 2 సమూయేలు 18:12సుమారు క్రీ.పూ. 1023
కాని అతడు యోవాబుతో, “నా చేతిలో వెయ్యి షెకెళ్ళ వెండి పెట్టినా, రాజు కుమారునిపై నేను చేయి వేయను. యువకుడైన అబ్షాలోముకు ఎవరూ హాని చేయకుండా కాపాడమని మాకందరికి వినిపించేలా రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇచ్చాడు.
- 2 సమూయేలు 18:13సుమారు క్రీ.పూ. 1023
ఒకవేళ నేను మోసం చేసి అతని ప్రాణానికి హాని చేస్తే రాజు తప్పనిసరిగా తెలుసుకుంటాడు. అప్పుడు నీవే నాకు వ్యతిరేకంగా మారతావు” అన్నాడు.
- 2 సమూయేలు 18:14సుమారు క్రీ.పూ. 1023
అందుకు యోవాబు, “నీవు చేసే వరకు నేను ఇలా ఎదురుచూస్తూ ఉండను” అని చెప్పి, మూడు ఈటెలు పట్టుకుని వెళ్లి, ఇంకా ప్రాణాలతో ఆ సింధూర వృక్షానికి వ్రేలాడుతున్న అబ్షాలోము గుండెల్లోకి దిగేలా కొట్టాడు.
- 2 సమూయేలు 18:15సుమారు క్రీ.పూ. 1023
అలాగే యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది అబ్షాలోమును చుట్టుముట్టి, అతన్ని కొట్టి చంపారు.
- 2 సమూయేలు 18:16సుమారు క్రీ.పూ. 1023
తర్వాత ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమని యోవాబు బూరధ్వని చేయగానే, సైన్యం తరమడం ఆపి తిరిగి వచ్చింది.
- 2 సమూయేలు 18:17సుమారు క్రీ.పూ. 1023
వారు అబ్షాలోము మృతదేహాన్ని తీసుకెళ్లి అడవిలో లోతైన గోతిలో పడవేసి దానిలో పెద్ద రాళ్లకుప్ప పేర్చి, ఇశ్రాయేలీయులందరు తమ ఇళ్ళకు పారిపోయారు.
- 2 సమూయేలు 18:18సుమారు క్రీ.పూ. 1023
“నా పేరును కొనసాగించడానికి నాకు కుమారుడు లేడు” అని ఆలోచించిన అబ్షాలోము తాను బ్రతికి ఉన్నప్పుడే ఒక స్తంభం తీసుకెళ్లి తన పేరిట రాజుల లోయలో నిలబెట్టి, ఆ స్తంభానికి తన పేరు పెట్టుకున్నాడు, అది నేటి వరకు అబ్షాలోము స్థూపం అని పిలువబడుతుంది.
- 2 సమూయేలు 18:19సుమారు క్రీ.పూ. 1023
తర్వాత సాదోకు కుమారుడైన అహిమయస్సు, “నేను రాజు దగ్గరకు పరుగెత్తి వెళ్లి, యెహోవా రాజును తన శత్రువుల చేతిలో నుండి విడిపించి రాజుకు న్యాయం చేశారని చెప్పనివ్వండి” అని అడిగాడు.