- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 15:34సుమారు క్రీ.పూ. 1021
నీవు పట్టణానికి తిరిగివెళ్లి అబ్షాలోముతో, ‘రాజా! నేను నీకు సేవకునిగా ఉంటాను. గతంలో మీ తండ్రికి సేవకునిగా ఉన్నాను కాని ఇకపై నీకు సేవకునిగా సేవ చేస్తాను’ అని చెప్పు, అప్పుడు నీవు నా తరుపున అక్కడ ఉండి అహీతోపెలు చేసే సలహాలను చెడగొట్టగలవు.
- 2 సమూయేలు 15:35సుమారు క్రీ.పూ. 1021
యాజకులైన సాదోకు అబ్యాతారులు నీతో అక్కడ ఉంటారు. రాజభవనంలో నీవు విన్నవాటినన్ని వారికి చెప్పు.
- 2 సమూయేలు 15:36సుమారు క్రీ.పూ. 1021
వారి ఇద్దరు కుమారులు, సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అక్కడ వారితో పాటు ఉన్నారు. నీవు ఏది విన్నా, వారి ద్వారా నాకు తెలియజేయి” అని చెప్పాడు.
- 2 సమూయేలు 15:37సుమారు క్రీ.పూ. 1021
కాబట్టి అబ్షాలోము యెరూషలేముకు వస్తున్నప్పుడే దావీదు స్నేహితుడైన హూషై పట్టణానికి తిరిగి వెళ్లాడు.
- 2 సమూయేలు 16:1సుమారు క్రీ.పూ. 1023
దావీదు కొండమీద కొంత దూరం వెళ్లినప్పుడు, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతన్ని కలవడానికి వేచి ఉన్నాడు. అతడు కళ్లకు గంతలు కట్టివున్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్ష గెలలు, 100 అంజూర పండ్లు ఉన్న కొమ్మలు, ఒక ద్రాక్షరసపు తిత్తి ఉన్నాయి.
- 2 సమూయేలు 16:2సుమారు క్రీ.పూ. 1023
రాజు సీబాను చూసి, “వీటిని ఎందుకు తెచ్చావు?” అని అడిగాడు. అందుకు సీబా, “గాడిదలు రాజు ఇంటివారు ఎక్కి వెళ్లడానికి, రొట్టె పండ్లు మీతో ఉన్నవారు తినడానికి, ద్రాక్షరసం అరణ్యంలో అలసిపోయిన వారు త్రాగడానికి” అని జవాబిచ్చాడు.
- 2 సమూయేలు 16:3సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు రాజు, “నీ యజమాని మనుమడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “ఈ రోజు ఇశ్రాయేలీయులు మా తాత రాజ్యాన్ని నాకు తిరిగి ఇస్తారనుకుని అతడు యెరూషలేములోనే ఉన్నాడు” అని జవాబిచ్చాడు.
- 2 సమూయేలు 16:4సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు రాజు సీబాతో, “మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నీది” అని అన్నాడు. అందుకు సీబా, “నా ప్రభువా రాజా, మీ దయ నాపై ఉండును గాక, మీకు నా దండాలు” అన్నాడు.
- 2 సమూయేలు 16:5సుమారు క్రీ.పూ. 1023
రాజైన దావీదు బహూరీముకు వచ్చినప్పుడు, సౌలు కుటుంబ వంశానికి చెందిన ఒక వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చాడు. అతడు గెరా కుమారుడైన షిమీ. అతడు బయటకు వస్తూ దావీదును శపిస్తున్నాడు.
- 2 సమూయేలు 16:6సుమారు క్రీ.పూ. 1023
సైనికులు బలాఢ్యులు దావీదుకు ఇరువైపులా ఉన్నప్పటికీ అతడు రాజైన దావీదు మీదికి అతని అధికారులందరి మీదికి రాళ్లు విసిరాడు.
- 2 సమూయేలు 16:7సుమారు క్రీ.పూ. 1023
అంతేకాక షిమీ అతన్ని శపిస్తూనే, “వెళ్లిపో, వెళ్లిపో, హంతకుడా, దుర్మార్గుడా!
- 2 సమూయేలు 16:8సుమారు క్రీ.పూ. 1023
నీవు ఎవరి స్థానంలో పరిపాలించావో, ఆ సౌలు ఇంటివారి రక్తాన్ని నీవు చిందించినందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించారు. నీవు హంతకుడివి కాబట్టే నీవు పతనానికి దగ్గరలో ఉన్నావు” అని దూషించాడు.
- 2 సమూయేలు 16:9సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “ఈ చచ్చిన కుక్క రాజైన నా ప్రభువును ఎందుకు శపించాలి? నేను వెళ్లి అతని తల నరికివేయనివ్వండి” అన్నాడు.
- 2 సమూయేలు 16:10సుమారు క్రీ.పూ. 1023
అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు.
- 2 సమూయేలు 16:11సుమారు క్రీ.పూ. 1023
తర్వాత దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి.
- 2 సమూయేలు 16:12సుమారు క్రీ.పూ. 1023
యెహోవా నా బాధ చూసి, ఈ రోజు ఇతడు పలికిన శాపాలకు బదులుగా నాకు మంచి చేస్తాడేమో!” అని అన్నాడు.
- 2 సమూయేలు 16:13సుమారు క్రీ.పూ. 1023
దావీదు, అతని మనుష్యులు తమ దారిన ముందుకు వెళ్తుండగా, షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్క నుండి వెళ్తూ, దావీదును శపిస్తూ, అతని మీదికి రాళ్లు విసురుతూ, అతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.
- 2 సమూయేలు 16:14సుమారు క్రీ.పూ. 1023
రాజు, అతనితో ఉన్నవారందరు తమ గమ్యాన్ని చేరుకునే సరికి అలసిపోయారు కాబట్టి అక్కడ వారు అలసట తీర్చుకున్నారు.
- 2 సమూయేలు 16:15సుమారు క్రీ.పూ. 1023
ఇంతలో అబ్షాలోము ఇశ్రాయేలు వారందరు యెరూషలేముకు వచ్చారు. అహీతోపెలు కూడా అతనితో ఉన్నాడు.
- 2 సమూయేలు 16:16సుమారు క్రీ.పూ. 1023
అప్పుడు దావీదు స్నేహితుడు అర్కీయుడైన హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చి అతనితో, “రాజు చిరకాలం జీవించు గాక! రాజు చిరకాలం జీవించు గాక!” అన్నాడు.
- 2 సమూయేలు 16:17సుమారు క్రీ.పూ. 1023
అబ్షాలోము, “నీ స్నేహితుడైన దావీదుకు నీవు చూపించే ప్రేమ ఇదేనా? అతడు నీ స్నేహితుడే కదా, అతనితో పాటు నీవెందుకు వెళ్లలేదు?” అని హూషైను అడిగాడు.
- 2 సమూయేలు 16:18సుమారు క్రీ.పూ. 1023
అందుకు హూషై అబ్షాలోముతో, “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులందరు కలిసి ఎవరిని ఎంచుకుంటారో అతనికి చెందిన వాడనై అతనితోనే నేను ఉంటాను.
- 2 సమూయేలు 16:19సుమారు క్రీ.పూ. 1023
అంతేకాదు నేను ఎవరికి సేవ చేయాలి? అతని కుమారునికి నేను సేవ చేయకూడదా? మీ తండ్రికి సేవ చేసినట్లే నీకు కూడా నేను సేవ చేస్తాను” అన్నాడు.
- 2 సమూయేలు 16:20సుమారు క్రీ.పూ. 1023
తర్వాత అబ్షాలోము అహీతోపెలుతో, “మనమేమి చేద్దాం? సలహా ఇవ్వు” అన్నాడు.
- 2 సమూయేలు 16:21సుమారు క్రీ.పూ. 1023
అందుకు అహీతోపెలు అబ్షాలోముతో, “రాజభవనానికి కాపలాగా మీ తండ్రి ఉంచిన అతని ఉంపుడుగత్తెలతో పడుకోండి. అప్పుడు మీ తండ్రికి మీరు మరింత అసహ్యులు అయ్యారని ఇశ్రాయేలీయులందరు తెలుసుకుంటారు. మీ పక్షాన ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా శక్తిమంతులవుతారు” అన్నాడు.