కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 15:9సుమారు క్రీ.పూ. 1021

    రాజు అతనితో, “సమాధానంగా వెళ్లు” అని చెప్పి అనుమతి ఇచ్చాడు. కాబట్టి అతడు హెబ్రోనుకు వెళ్లాడు.

  2. 2 సమూయేలు 15:10సుమారు క్రీ.పూ. 1021

    అబ్షాలోము, “మీరు బూరల ధ్వని వినగానే, ‘హెబ్రోనులో అబ్షాలోము రాజు’ అని కేకలు వేయండి” అని చెప్పడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి రహస్యంగా దూతలను పంపాడు.

  3. 2 సమూయేలు 15:11సుమారు క్రీ.పూ. 1021

    యెరూషలేము నుండి 200 మంది పురుషులు అబ్షాలోముతో పాటు వచ్చారు. అతడు వారిని అతిథులుగా రమ్మని పిలిచినప్పుడు, వారు విషయం తెలియక అమాయకంగా వెళ్లారు.

  4. 2 సమూయేలు 15:12సుమారు క్రీ.పూ. 1021

    అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోపెలును తన స్వగ్రామమైన గిలోహు నుండి రమ్మని పిలిపించాడు. అబ్షాలోము అనుచరులు పెరుగుతూనే ఉండడంతో కుట్ర మరింత బలపడింది.

  5. 2 సమూయేలు 15:13సుమారు క్రీ.పూ. 1021

    ఒక దూత వచ్చి దావీదుతో, “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోము పక్షంగా ఉన్నారు” అనే వార్త చెప్పాడు.

  6. 2 సమూయేలు 15:14సుమారు క్రీ.పూ. 1021

    దావీదు తనతో పాటు యెరూషలేములో ఉన్న తన అధికారులందరితో, “రండి, మనం పారిపోవాలి, లేకపోతే అబ్షాలోము నుండి మనలో ఎవరమూ తప్పించుకోలేము. మనం వెంటనే వెళ్లిపోవాలి లేదంటే అతడు త్వరగా వచ్చి మనలను పట్టుకుని మనలను మన పట్టణాన్ని ఖడ్గంతో నాశనం చేస్తాడు” అని చెప్పాడు.

  7. 2 సమూయేలు 15:15సుమారు క్రీ.పూ. 1021

    అందుకు రాజు అధికారులు, “మా ప్రభువైన రాజు ఏం చెప్పినా చేయడానికి మీ సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాం” అని జవాబిచ్చారు.

  8. 2 సమూయేలు 15:16సుమారు క్రీ.పూ. 1021

    అప్పుడు రాజు రాజభవనాన్ని కనిపెట్టుకుని ఉండడానికి పదిమంది ఉంపుడుగత్తెలను ఉంచి, తన పరివారమంతటితో కలిసి బయలుదేరి వెళ్లాడు.

  9. 2 సమూయేలు 15:17సుమారు క్రీ.పూ. 1021

    రాజు తన పరివారమంతటితో కాలినడకను బయలుదేరి వెళ్లి పట్టణం చివరి ఉన్న ఇంట్లో బసచేశాడు.

  10. 2 సమూయేలు 15:18సుమారు క్రీ.పూ. 1021

    రాజు సేవకులందరూ రాజుకు ఇరువైపులా నడిచారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి అతనితో వచ్చిన ఆరువందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు.

  11. 2 సమూయేలు 15:19సుమారు క్రీ.పూ. 1021

    రాజు గిత్తీయుడైన ఇత్తయితో, “నీవు మాతో పాటు రావడం ఎందుకు? తిరిగివెళ్లి అబ్షాలోము రాజుతో పాటు ఉండు. నీవు బందీగా ఉన్న విదేశీయుడవు.

  12. 2 సమూయేలు 15:20సుమారు క్రీ.పూ. 1021

    నీవు నిన్ననే వచ్చావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియనప్పుడు నీవు మాతో తిరగడం ఎందుకు? నీ ప్రజలను తీసుకుని నీవు తిరిగి వెళ్లిపో. యెహోవా నీ మీద దయను నమ్మకత్వాన్ని చూపిస్తారు” అన్నాడు.

  13. 2 సమూయేలు 15:21సుమారు క్రీ.పూ. 1021

    అందుకు ఇత్తయి రాజుతో, “నా ప్రభువైన రాజు ఎక్కడ ఉంటాడో నీ సేవకుడైన నేను మరణించినా బ్రతికినా అక్కడే ఉంటానని సజీవుడైన యెహోవా మీద, నా ప్రభువైన రాజు జీవం మీద ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు.

  14. 2 సమూయేలు 15:22సుమారు క్రీ.పూ. 1021

    దావీదు ఇత్తయితో, “సరే, నీవు మాతో రావచ్చు” అన్నాడు. కాబట్టి గిత్తీయుడైన ఇత్తయి అతనితో ఉన్న మనుష్యులు, కుటుంబాలు ముందుకు నడిచారు.

  15. 2 సమూయేలు 15:23సుమారు క్రీ.పూ. 1021

    వారందరూ వెళ్లి పోతుంటే ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. ఇలా వారందరూ రాజుతో కలిసి కిద్రోనువాగు దాటి అరణ్యమార్గంలో కదిలారు.

  16. 2 సమూయేలు 15:24సుమారు క్రీ.పూ. 1021

    సాదోకు అతనితో ఉన్న లేవీయులందరు దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చారు. తర్వాత వారు మందసాన్ని క్రిందికి దించినప్పుడు ప్రజలందరూ పట్టణాన్ని దాటి వచ్చేవరకు అబ్యాతారు బలులు అర్పించాడు.

  17. 2 సమూయేలు 15:25సుమారు క్రీ.పూ. 1021

    అప్పుడు రాజు సాదోకును పిలిచి, “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకెళ్లు. యెహోవా నా పట్ల దయ చూపిస్తే ఆయన నన్ను మరలా తీసుకువచ్చి ఆయన మందసాన్ని, ఆయన నివాస స్థలాన్ని నేను మళ్ళీ చూసేలా చేస్తారు.

  18. 2 సమూయేలు 15:26సుమారు క్రీ.పూ. 1021

    ఒకవేళ ఆయన, ‘నీపై నాకు దయలేదు’ అని చెప్పినా సరే నేను అందుకు సిద్ధమే; ఆయనకు ఏది న్యాయం అనిపిస్తే నా పట్ల అదే చేస్తారు” అని చెప్పాడు.

  19. 2 సమూయేలు 15:27సుమారు క్రీ.పూ. 1021

    రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి.

  20. 2 సమూయేలు 15:28సుమారు క్రీ.పూ. 1021

    నీ దగ్గర నుండి నాకు కబురు వచ్చేవరకు నేను అరణ్యంలో ఉన్న రేవుల దగ్గర ఎదురుచూస్తూ ఉంటాను” అన్నాడు.

  21. 2 సమూయేలు 15:29సుమారు క్రీ.పూ. 1021

    కాబట్టి సాదోకు అబ్యాతారులు దేవుని మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకెళ్లి అక్కడే ఉండిపోయారు.

  22. 2 సమూయేలు 15:30సుమారు క్రీ.పూ. 1021

    దావీదు ఒలీవల కొండ ఎక్కుతూ ఏడ్చాడు. తన తల కప్పుకుని, చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్లాడు. అతనితో ఉన్నవారందరు తల కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.

  23. 2 సమూయేలు 15:31సుమారు క్రీ.పూ. 1021

    ఇంతలో ఒకడు వచ్చి, “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా భాగం ఉంది” అని దావీదుతో చెప్పాడు. కాబట్టి దావీదు, “యెహోవా! అహీతోపెలు ఆలోచనలను అవివేకంగా మార్చండి” అని ప్రార్థించాడు.

  24. 2 సమూయేలు 15:32సుమారు క్రీ.పూ. 1021

    ప్రజలు దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండమీద ఉండేది. దావీదు అక్కడికి చేరుకున్నప్పుడు అర్కీయుడైన హూషై తన పైవస్త్రాన్ని చింపుకుని తలమీద బూడిద పోసుకున్నాడు.

  25. 2 సమూయేలు 15:33సుమారు క్రీ.పూ. 1021

    దావీదు అతన్ని చూసి, “నీవు నాతో పాటు వస్తే నాకు భారంగా ఉంటుంది.