- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 13:31సుమారు క్రీ.పూ. 1030
రాజు లేచి నిలబడి తన బట్టలు చింపుకుని నేల మీద పడుకున్నాడు. అతని సేవకులందరు తమ బట్టలు చింపుకుని దగ్గర నిలబడ్డారు.
- 2 సమూయేలు 13:32సుమారు క్రీ.పూ. 1030
కానీ దావీదు అన్న షిమ్యా కుమారుడైన యెహోనాదాబు, “నా ప్రభువా, వారు రాజకుమారులందరినీ చంపేశారని అనుకోవద్దు; అమ్నోను మాత్రమే చనిపోయాడు. అతడు అబ్షాలోము చెల్లి తామారును అత్యాచారం చేసిన రోజు నుండే అతన్ని చంపాలనే పగతో అబ్షాలోము ఉన్నాడని అతని మాటలు చెప్తున్నాయి.
- 2 సమూయేలు 13:33సుమారు క్రీ.పూ. 1030
కాబట్టి రాజకుమారులందరూ చనిపోయారని భావించి నా ప్రభువైన రాజు బాధపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు” అని చెప్పాడు.
- 2 సమూయేలు 13:34సుమారు క్రీ.పూ. 1030
ఈలోగా, అబ్షాలోము పారిపోయాడు. కాపలాగా నిలబడి ఉన్న వ్యక్తి పైకి చూసేటప్పటికి అతనికి పశ్చిమాన ఉన్న రహదారిపై చాలామంది ప్రజలు కొండ వైపుకు రావడం కనిపించింది. కావలివాడు వెళ్లి రాజుతో, “హొరొనయీము దిశలో, కొండ వైపున మనుష్యులు కనబడుతున్నారు” అని చెప్పాడు.
- 2 సమూయేలు 13:35సుమారు క్రీ.పూ. 1030
యెహోనాదాబు, “అదిగో రాజకుమారులు వస్తున్నారు; మీ సేవకుడనైన నేను చెప్పినట్టే జరిగింది” అని రాజుతో చెప్పాడు.
- 2 సమూయేలు 13:36సుమారు క్రీ.పూ. 1030
అతడు చెప్పడం ముగిస్తూ ఉండగానే, రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. అది చూసి రాజు అతని సేవకులందరూ చాలా బిగ్గరగా ఏడ్చారు.
- 2 సమూయేలు 13:37సుమారు క్రీ.పూ. 1030
అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడు, గెషూరు రాజైన తల్మయి దగ్గరకు చేరాడు. రాజైన దావీదు చాలా రోజుల వరకు తన కుమారుని కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు.
- 2 సమూయేలు 13:38సుమారు క్రీ.పూ. 1030
అబ్షాలోము పారిపోయి గెషూరుకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు.
- 2 సమూయేలు 13:39సుమారు క్రీ.పూ. 1030
అమ్నోను మరణం విషయంలో ఓదార్పు పొందిన రాజైన దావీదు, అబ్షాలోము దగ్గరకు వెళ్లాలని కోరాడు.
- 2 సమూయేలు 14:1సుమారు క్రీ.పూ. 1027
రాజు అబ్షాలోము మీద మనస్సు పెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.
- 2 సమూయేలు 14:2సుమారు క్రీ.పూ. 1027
కాబట్టి యోవాబు తెకోవాకు ఒకరిని పంపించి అక్కడినుండి ఒక తెలివైన స్త్రీని తెప్పించాడు. అతడు ఆమెతో, “నీవు దుఃఖంలో ఉన్నట్లు నటించు, దుఃఖ వస్త్రాలను ధరించు, ఎలాంటి సౌందర్య అలంకరణలను ఉపయోగించవద్దు. చనిపోయినవారి కోసం దుఃఖిస్తూ చాలా రోజులు గడిపిన స్త్రీలా నటించు.
- 2 సమూయేలు 14:3సుమారు క్రీ.పూ. 1027
రాజు దగ్గరకు వెళ్లి అతనితో ఈ మాటలు చెప్పు” అని చెప్పి ఏమి మాట్లాడాలో యోవాబు ఆమెకు నేర్పాడు.
- 2 సమూయేలు 14:4సుమారు క్రీ.పూ. 1027
ఆ తెకోవా స్త్రీ రాజు దగ్గరకు వెళ్లి తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి, “ఓ రాజా! నాకు సహాయం చేయండి!” అని వేడుకొంది.
- 2 సమూయేలు 14:5సుమారు క్రీ.పూ. 1027
“నీకు వచ్చిన కష్టం ఏంటి?” అని రాజు ఆమెను అడిగాడు. అందుకామె, “నేను విధవరాలిని; నా భర్త చనిపోయాడు.
- 2 సమూయేలు 14:6సుమారు క్రీ.పూ. 1027
నీ సేవకురాలినైన నాకు ఇద్దరు కుమారులు. వారు పొలంలో ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. వారిని వేరు చేయడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒకడు ఇంకొకడిని కొట్టి చంపేశాడు.
- 2 సమూయేలు 14:7సుమారు క్రీ.పూ. 1027
ఇప్పుడు నా కుటుంబమంతా నీ సేవకురాలినైన నా మీదికి లేచి, ‘తన సోదరుని కొట్టి చంపినవాన్ని మాకు అప్పగించు. వాడు తన సోదరుని చంపాడు కాబట్టి మేము వాన్ని చంపాలి: అప్పుడు వారసుడే లేకుండ పోతాడు’ అని వారు అంటున్నారు. వారు నా భర్త పేరును గాని వారసులను గాని భూమి మీద మిగలకుండా, నా దగ్గర మిగిలి ఉన్న ఏకైక మండే బొగ్గును చల్లార్చాలని చూస్తున్నారు” అని చెప్పింది.
- 2 సమూయేలు 14:8సుమారు క్రీ.పూ. 1027
అందుకు రాజు, “నీవు ఇంటికి వెళ్లు, నీ గురించి నేను ఆజ్ఞ ఇస్తాను” అని ఆమెతో చెప్పాడు.
- 2 సమూయేలు 14:9సుమారు క్రీ.పూ. 1027
అప్పుడు తెకోవా స్త్రీ, “నా ప్రభువైన రాజు నన్ను నా కుటుంబాన్ని క్షమించును గాక, రాజు, వారి సింహాసనం నిర్దోషంగా ఉండును గాక” అని రాజుతో చెప్పింది.
- 2 సమూయేలు 14:10సుమారు క్రీ.పూ. 1027
అందుకు రాజు, “ఎవరైనా దీని గురించి నిన్ను ఏమైనా అంటే వారిని నా దగ్గరకు తీసుకురా, వారు మరలా నిన్ను ఇబ్బంది పెట్టరు” అన్నాడు.
- 2 సమూయేలు 14:11సుమారు క్రీ.పూ. 1027
ఆమె, “అయితే, రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు ఇంకెక్కువ నాశనం చేయకుండా నిరోధించడానికి రాజు తన దేవున్ని ప్రార్థించాలి, తద్వార నా కుమారుడు నాశనానికి గురి కాకుండా ఉంటాడు” అని చెప్పింది. అందుకు రాజు, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీ కుమారుని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అన్నాడు.
- 2 సమూయేలు 14:12సుమారు క్రీ.పూ. 1027
అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజుతో మీ సేవకురాలినైన నన్ను ఒక మాట చెప్పనివ్వండి” అన్నాడు. అప్పుడు రాజు, “చెప్పు” అన్నాడు.
- 2 సమూయేలు 14:13సుమారు క్రీ.పూ. 1027
ఆ స్త్రీ ఇలా చెప్పింది, “మీరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి పని ఎందుకు చేశారు? రాజు ఇలా చెప్పినప్పుడు, బహిష్కరించబడిన తన కుమారున్ని రాజు తిరిగి తీసుకురాలేదు కాబట్టి తాను దోషి కావడం లేదా?
- 2 సమూయేలు 14:14సుమారు క్రీ.పూ. 1027
మనమందరం చనిపోతాం గదా. ఒకసారి నేల మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్లలా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునేది ఇది కాదు; వెలివేయబడినవారు తన దగ్గరకు తిరిగి రావడానికి ఆయన మార్గాలు ఏర్పరుస్తారు.
- 2 సమూయేలు 14:15సుమారు క్రీ.పూ. 1027
“నా ప్రజలు నన్ను భయపెట్టారు కాబట్టి నేను నా ప్రభువైన రాజుకు దీని గురించి చెప్పడానికి వచ్చాను. నీ సేవకురాలు ఏమనుకుందంటే, ‘నేను రాజుతో మాట్లాడతాను. ఆయన తన సేవకురాలి మనవిని వింటారు.
- 2 సమూయేలు 14:16సుమారు క్రీ.పూ. 1027
రాజు నా మనవి అంగీకరించి, దేవుడిచ్చిన వారసత్వాన్ని నేను, నా ఇద్దరు కుమారులు అనుభవించకుండ మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవారి చేతిలో నుండి నన్ను విడిపించడానికి ఒప్పుకుంటాడు.’