కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 12:12సుమారు క్రీ.పూ. 1034

    నీవు రహస్యంగా చేశావు గాని, నేనైతే దీన్ని పట్టపగలు ఇశ్రాయేలీయులందరి ముందే జరిగేలా చేస్తాను’ ” అని చెప్పాడు.

  2. 2 సమూయేలు 12:13సుమారు క్రీ.పూ. 1034

    అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు. అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.

  3. 2 సమూయేలు 12:14సుమారు క్రీ.పూ. 1034

    కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.

  4. 2 సమూయేలు 12:15సుమారు క్రీ.పూ. 1034

    తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు, యెహోవా ఊరియా భార్య ద్వార దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తగా ఆ బిడ్డకు జబ్బుచేసింది.

  5. 2 సమూయేలు 12:16సుమారు క్రీ.పూ. 1034

    దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో నేలపై పడుకున్నాడు.

  6. 2 సమూయేలు 12:17సుమారు క్రీ.పూ. 1034

    అతని ఇంట్లోని పెద్దలు అతని ప్రక్కన నిలబడి నేలపై నుండి అతన్ని లేపడానికి ప్రయత్నించారు కాని అతడు ఒప్పుకోలేదు, వారితో కలిసి భోజనం చేయలేదు.

  7. 2 సమూయేలు 12:18సుమారు క్రీ.పూ. 1034

    ఏడవ రోజు ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు సలహాదారులు, “బిడ్డ బ్రతికి ఉన్నప్పుడే అతడు మనం చెప్పిన ఏ మాట వినలేదు. బిడ్డ చనిపోయిన విషయం అతనికి ఎలా చెప్పగలం? చెప్తే తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో” అనుకుని బిడ్డ చనిపోయిన విషయం అతనికి చెప్పడానికి భయపడ్డారు.

  8. 2 సమూయేలు 12:19సుమారు క్రీ.పూ. 1034

    తన సలహాదారులు తమలో తాము గుసగుసలాడుకోవడం దావీదు చూసి, బిడ్డ చనిపోయాడని గ్రహించి, “బిడ్డ చనిపోయాడా?” అని అడిగాడు. వారు, “అవును చనిపోయాడు” అని జవాబిచ్చారు.

  9. 2 సమూయేలు 12:20సుమారు క్రీ.పూ. 1034

    వెంటనే దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యెహోవా మందిరంలోనికి వెళ్లి ఆరాధించాడు. తర్వాత అతడు తన ఇంటికి తిరిగివచ్చి భోజనం తెమ్మని చెప్పాడు. వారు భోజనం వడ్డించగానే అతడు తిన్నాడు.

  10. 2 సమూయేలు 12:21సుమారు క్రీ.పూ. 1034

    అతని సలహాదారులు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ఏడ్చారు. కాని ఇప్పుడేమో ఆ బిడ్డ చనిపోయాక లేచి భోజనం చేస్తున్నారు. మీరు ఎందుకిలా చేస్తున్నారు?” అని అతన్ని అడిగారు.

  11. 2 సమూయేలు 12:22సుమారు క్రీ.పూ. 1034

    అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను.

  12. 2 సమూయేలు 12:23సుమారు క్రీ.పూ. 1034

    ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. నేనెందుకు ఉపవాసముండాలి? నేను అతన్ని మళ్ళీ బ్రతికించగలనా? నేనే వాని దగ్గరకు వెళ్లాలి తప్ప, వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా!” అని జవాబిచ్చాడు.

  13. 2 సమూయేలు 12:24సుమారు క్రీ.పూ. 1033

    తర్వాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడు ఆమెతో కలువగా ఆమె కుమారుని కన్నది. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించారు;

  14. 2 సమూయేలు 12:25సుమారు క్రీ.పూ. 1033

    యెహోవా అతన్ని ప్రేమించారు కాబట్టి అతనికి యెదీద్యా అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపారు.

  15. 2 సమూయేలు 12:26సుమారు క్రీ.పూ. 1033

    ఇంతలో యోవాబు అమ్మోనీయుల పట్టణమైన రబ్బామీద యుద్ధం చేసి రాజభవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

  16. 2 సమూయేలు 12:27సుమారు క్రీ.పూ. 1033

    యోవాబు దూతల ద్వార ఈ వార్త దావీదుకు పంపిస్తూ, “నేను రబ్బామీద యుద్ధం చేసి ఆ పట్టణపు నీళ్ల సరఫరాను స్వాధీనం చేసుకున్నాను.

  17. 2 సమూయేలు 12:28సుమారు క్రీ.పూ. 1033

    ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని పంపి పట్టణాన్ని ముట్టడించి దానిని స్వాధీనం చేసుకో. లేకపోతే నేను ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాను అప్పుడు దానికి నా పేరు పెట్టబడుతుంది” అని కబురు పంపాడు.

  18. 2 సమూయేలు 12:29సుమారు క్రీ.పూ. 1033

    కాబట్టి దావీదు సైన్యాన్నంతా తీసుకుని రబ్బాకు వెళ్లి దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు.

  19. 2 సమూయేలు 12:30సుమారు క్రీ.పూ. 1033

    దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసి తన తలమీద పెట్టుకున్నాడు. అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దావీదు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.

  20. 2 సమూయేలు 12:31సుమారు క్రీ.పూ. 1033

    అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. ఇటుక బట్టీలలో వారితో పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత అతడు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.

  21. 2 సమూయేలు 13:1సుమారు క్రీ.పూ. 1032

    దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అనే అందమైన చెల్లి ఉండగా దావీదు కుమారుడైన అమ్నోను తామారును గాఢంగా ప్రేమించాడు.

  22. 2 సమూయేలు 13:2సుమారు క్రీ.పూ. 1032

    అమ్నోనుకు తన చెల్లి తామారుపై ఉన్న వ్యామోహంతో అతడు అనారోగ్యం పాలయ్యాడు. ఆమె కన్య కాబట్టి ఆమెను ఏమైన చేయడం సాధ్యం కాదని అతనికి అనిపించింది.

  23. 2 సమూయేలు 13:3సుమారు క్రీ.పూ. 1032

    అమ్నోనుకు యెహోనాదాబు అనే ఒక సలహాదారుడు ఉన్నాడు. అతడు దావీదు అన్న షిమ్యా కుమారుడు. యెహోనాదాబు చాలా యుక్తిపరుడు.

  24. 2 సమూయేలు 13:4సుమారు క్రీ.పూ. 1032

    అతడు అమ్నోనును చూసి, “రాజకుమారుడవైన నీవు రోజు రోజుకు ఎందుకు చిక్కిపోతున్నావు? విషయమేంటో నాకు చెప్పవా?” అని అడిగాడు. అమ్నోను అతనితో, “నేను నా సోదరుడైన అబ్షాలోము చెల్లి తామారును ప్రేమిస్తున్నాను” అన్నాడు.

  25. 2 సమూయేలు 13:5సుమారు క్రీ.పూ. 1032

    అందుకు యెహోనాదాబు, “నీకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ మంచం మీద పడుకో. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు, ‘నా చెల్లి తామారు వచ్చి నాకు తినడానికి ఏదైనా ఇస్తే బాగుండేది. నా కళ్లముందు ఆమె భోజనం సిద్ధం చేసి, తన చేతితో నాకు తినిపించనివ్వండి’ అని నీ తండ్రితో చెప్పు” అన్నాడు.