- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 13:6సుమారు క్రీ.పూ. 1032
కాబట్టి తనకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ అమ్నోను పడుకున్నాడు. రాజు అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అమ్నోను, “నేను నా చెల్లి తామారు చేతితో తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం ప్రత్యేకంగా రెండు రొట్టెలు చేయమని చెప్పండి” అని అడిగాడు.
- 2 సమూయేలు 13:7సుమారు క్రీ.పూ. 1032
కాబట్టి దావీదు తామారుకు, “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్లి, అతని కోసం భోజనం సిద్ధం చేయి” అని ఇంట్లో ఉన్న తామారుకు కబురు పంపాడు.
- 2 సమూయేలు 13:8సుమారు క్రీ.పూ. 1032
తామారు తన అన్న అమ్నోను ఇంటికి వెళ్లింది. అతడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఆమె కొంత పిండి తీసుకుని కలిపి అతడు చూస్తుండగా రొట్టెలు చేసి కాల్చింది.
- 2 సమూయేలు 13:9సుమారు క్రీ.పూ. 1032
ఆమె ఆ రొట్టెలు వడ్డిస్తూ ఉంటే అతడు తినడానికి ఒప్పుకోలేదు. అమ్నోను, “అందరు బయటకు వెళ్లండి” అని చెప్పగానే అక్కడున్న వారందరు బయటకు వెళ్లిపోయారు.
- 2 సమూయేలు 13:10సుమారు క్రీ.పూ. 1032
అప్పుడు అమ్నోను తామారుతో, “భోజనం నా పడకగదిలోనికి తెచ్చి నీ చేతితో తినిపించు” అన్నాడు. తామారు తాను తయారుచేసిన రొట్టెలు తీసుకుని పడకగదిలో ఉన్న తన అన్న అమ్నోను దగ్గరకు వచ్చింది.
- 2 సమూయేలు 13:11సుమారు క్రీ.పూ. 1032
ఆమె అతనికి తినడానికి భోజనం తీసుకువచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, “నా చెల్లి, వచ్చి నాతో పడుకో” అన్నాడు.
- 2 సమూయేలు 13:12సుమారు క్రీ.పూ. 1032
ఆమె, “అన్నా, వద్దు నన్ను బలవంతం చేయవద్దు! ఇశ్రాయేలులో ఇలాంటిది చేయకూడదు! ఈ దుర్మార్గపు పని చేయవద్దు.
- 2 సమూయేలు 13:13సుమారు క్రీ.పూ. 1032
నేను ఏమైపోతాను? ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? ఇశ్రాయేలీయులలో నీవు ఒక దుర్మార్గుడివి అవుతావు. రాజుతో మాట్లాడు. ఆయన నీకు నాతో పెళ్ళి చేయకుండా ఉండడు” అని చెప్పింది.
- 2 సమూయేలు 13:14సుమారు క్రీ.పూ. 1032
కాని అతడు ఆమె మాట వినకుండా ఆమెను బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేశాడు.
- 2 సమూయేలు 13:15సుమారు క్రీ.పూ. 1032
తర్వాత అమ్నోనుకు ఆమె పట్ల విపరీతమైన ద్వేషం కలిగింది. ఇంతకుముందు ఆమెను ఎంత ప్రేమించాడో దానికన్నా ఎక్కువగా అతడు ఆమెను ద్వేషించాడు. అమ్నోను ఆమెతో, “లేచి వెళ్లిపో!” అన్నాడు.
- 2 సమూయేలు 13:16సుమారు క్రీ.పూ. 1032
అందుకు ఆమె, “వద్దు, నీవు నన్ను బయటకు త్రోసివేస్తే అది నీవు నాకిప్పుడు చేసిన దానికన్నా పెద్ద తప్పు అవుతుంది” అని అన్నది. కాని అతడు ఆమె మాట వినలేదు.
- 2 సమూయేలు 13:17సుమారు క్రీ.పూ. 1032
అతడు తన వ్యక్తిగత సేవకుని పిలిచి, “ఈమెను నా దగ్గర నుండి వెళ్లగొట్టి, తలుపు గడియ వేయి” అని ఆజ్ఞాపించాడు.
- 2 సమూయేలు 13:18సుమారు క్రీ.పూ. 1032
ఆ సేవకుడు ఆమెను బయటకు గెంటి తలుపు గడియ వేశాడు. కన్యలైన రాజకుమార్తెలు ధరించే ఒక అందమైన వస్త్రాన్ని తామారు ధరించి ఉంది.
- 2 సమూయేలు 13:19సుమారు క్రీ.పూ. 1032
తామారు తన తలపై బూడిద వేసుకుని తాను వేసుకున్న వస్త్రాన్ని చింపుకుని తలమీద చేతులు పెట్టుకుని గట్టిగా ఏడుస్తూ వెళ్లిపోయింది.
- 2 సమూయేలు 13:20సుమారు క్రీ.పూ. 1032
ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి, “నీ అన్న అమ్నోను కదా నీతో ఉన్నది? నా చెల్లీ, నెమ్మదిగా ఉండు; అతడు నీ అన్న. బాధపడకు” అన్నాడు. తామారు తన అన్న అబ్షాలోము ఇంట్లో ఒంటరిగానే ఉండిపోయింది.
- 2 సమూయేలు 13:21సుమారు క్రీ.పూ. 1032
ఇదంతా రాజైన దావీదు విన్నప్పుడు అతడు చాలా కోపంతో మండిపడ్డాడు.
- 2 సమూయేలు 13:22సుమారు క్రీ.పూ. 1032
అబ్షాలోము తన అన్న అమ్నోనుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడలేదు; తన చెల్లియైన తామారును అవమానపరిచాడు కాబట్టి అతడు అమ్నోనును ద్వేషించాడు.
- 2 సమూయేలు 13:23సుమారు క్రీ.పూ. 1030
రెండు సంవత్సరాల తర్వాత, అబ్షాలోము యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించేవారు ఎఫ్రాయిం సరిహద్దు దగ్గర ఉన్న బయల్-హసోరులో ఉన్నప్పుడు, అతడు రాజకుమారులందరినీ అక్కడికి విందుకు పిలిచాడు.
- 2 సమూయేలు 13:24సుమారు క్రీ.పూ. 1030
అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి, “మీ సేవకుని యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజు రాజ సేవకులు నాతో పాటు వస్తారా?” అన్నాడు.
- 2 సమూయేలు 13:25సుమారు క్రీ.పూ. 1030
“లేదు, నా కుమారుడా, మేమందరం రావద్దు; మేము నీకు ఎక్కువ భారం అవుతాం” అని రాజు అన్నాడు. అబ్షాలోము రాజును బ్రతిమాలినా అతడు వెళ్లడానికి నిరాకరించి అతన్ని దీవించాడు.
- 2 సమూయేలు 13:26సుమారు క్రీ.పూ. 1030
అప్పుడు అబ్షాలోము, “నీవు రాకపోతే నా అన్నయైన అమ్నోనును మాతో పంపించు” అన్నాడు. అందుకు రాజు, “అతడు మీతో ఎందుకు వెళ్లాలి?” అని అడిగాడు.
- 2 సమూయేలు 13:27సుమారు క్రీ.పూ. 1030
అయితే అబ్షాలోము అతన్ని చాలా బ్రతిమిలాడాడు, కాబట్టి రాజు అమ్నోనును, మిగిలిన రాజకుమారులను అతనితో పంపాడు.
- 2 సమూయేలు 13:28సుమారు క్రీ.పూ. 1030
తర్వాత అబ్షాలోము తన సేవకులను పిలిచి, “వినండి, అమ్నోను బాగా త్రాగి మత్తు ఎక్కినప్పుడు నేను మీతో, ‘అమ్నోనును కొట్టి చంపండి’ అని చెప్తాను. అప్పుడు మీరు అతన్ని చంపండి. భయపడకండి! మీకు ఆజ్ఞ ఇచ్చింది నేను కాదా? కాబట్టి ధైర్యంగా ఉండండి” అని ఆదేశించాడు.
- 2 సమూయేలు 13:29సుమారు క్రీ.పూ. 1030
అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతని సేవకులు అమ్నోనును చంపేశారు. అప్పుడు రాజకుమారులంతా లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయారు.
- 2 సమూయేలు 13:30సుమారు క్రీ.పూ. 1030
వారు ఇంకా దారిలో ఉండగానే, “అబ్షాలోము రాజకుమారుల్లో ఒక్కరు మిగులకుండా అందరిని చంపేశాడు” అనే వార్త దావీదుకు చేరింది.