కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 14:17సుమారు క్రీ.పూ. 1027

    “నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.

  2. 2 సమూయేలు 14:18సుమారు క్రీ.పూ. 1027

    అప్పుడు రాజు ఆమెతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. ఏదీ దాచకుండా చెప్పాలి” అన్నాడు. అందుకు ఆమె, “నా ప్రభువైన రాజా ఏమిటో అడగండి” అన్నది.

  3. 2 సమూయేలు 14:19సుమారు క్రీ.పూ. 1027

    రాజు, “దీనంతటి వెనకాల యోవాబు హస్తమేమైన ఉందా?” అని అడిగాడు. అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజు జీవం తోడు, నా ప్రభువైన రాజు చెప్పినదాని నుండి ఎవరూ కుడికి గాని ఎడమకు గాని తిరుగరు. నిజమే, ఇలా చేయమని నీ సేవకుడైన యోవాబు నాకు చెప్పాడు. నేను చెప్పిన మాటలన్నీ అతడు చెప్పినవే.

  4. 2 సమూయేలు 14:20సుమారు క్రీ.పూ. 1027

    ప్రస్తుత పరిస్థితులను మార్చడానికి మీ సేవకుడైన యోవాబు ఇలా చేశాడు. దేశంలో జరుగుతున్నదంతా తెలుసుకోవడానికి నా ప్రభువుకు దేవుని దూతవంటి జ్ఞానం ఉన్నది” అన్నది.

  5. 2 సమూయేలు 14:21సుమారు క్రీ.పూ. 1027

    అప్పుడు రాజు యోవాబుతో, “సరే, నీ విన్నపం ప్రకారం నేను చేస్తాను. నీవు వెళ్లి, యువకుడైన అబ్షాలోమును తీసుకురా” అన్నాడు.

  6. 2 సమూయేలు 14:22సుమారు క్రీ.పూ. 1027

    యోవాబు తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి రాజును దీవిస్తూ ఇలా అన్నాడు, “నా ప్రభువైన రాజా! నీవు నీ సేవకుడైన నా మనవి అంగీకరించావు కాబట్టి నా ప్రభువైన రాజు దృష్టిలో నీ సేవకుడనైన నేను దయ పొందానని ఈ రోజు నాకు తెలిసింది.”

  7. 2 సమూయేలు 14:23సుమారు క్రీ.పూ. 1027

    అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు.

  8. 2 సమూయేలు 14:24సుమారు క్రీ.పూ. 1027

    అయితే రాజు, “అతడు తన ఇంటికి వెళ్లాలి; అతడు నా ముఖాన్ని చూడకూడదు” అన్నాడు కాబట్టి అబ్షాలోము రాజు ముఖాన్ని చూడకుండ తన సొంత ఇంటికి వెళ్లాడు.

  9. 2 సమూయేలు 14:25సుమారు క్రీ.పూ. 1027

    ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము వంటి అందమైనవారు ఇంకెవరు లేరు. అరికాలు నుండి నడినెత్తి వరకు అతనిలో ఏ లోపం లేదు.

  10. 2 సమూయేలు 14:26సుమారు క్రీ.పూ. 1027

    అతని తలవెంట్రుకలు చాలా భారంగా ఉండడంతో సంవత్సరానికి ఒకసారి తన తలవెంట్రుకలు కత్తిరించేవాడు. వాటి తూకం రాజు ఆమోదించిన తూనిక ప్రకారం రెండువందల షెకెళ్ళు ఉండేది.

  11. 2 సమూయేలు 14:27సుమారు క్రీ.పూ. 1027

    అబ్షాలోముకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె పుట్టారు. అతని కుమార్తె పేరు తామారు. ఆమె చాలా అందమైనది.

  12. 2 సమూయేలు 14:28సుమారు క్రీ.పూ. 1027

    రాజు ముఖాన్ని చూడకుండ అబ్షాలోము రెండు సంవత్సరాలు యెరూషలేములో నివసించాడు.

  13. 2 సమూయేలు 14:29సుమారు క్రీ.పూ. 1027

    అప్పుడు యోవాబును రాజు దగ్గరకు పంపించాలని అబ్షాలోము అతన్ని పిలిచాడు కాని యోవాబు అతని దగ్గరకు రావడానికి ఒప్పుకోలేదు. అతన్ని రెండవసారి పిలిచినా సరే యోవాబు రావడానికి ఒప్పుకోలేదు.

  14. 2 సమూయేలు 14:30సుమారు క్రీ.పూ. 1027

    అప్పుడు అబ్షాలోము తన సేవకులతో, “చూడండి, యోవాబు పొలం నా పొలం ప్రక్కనే ఉంది, అతని పొలంలో యవల పంట ఉంది. మీరు వెళ్లి దానిని తగలబెట్టండి” అన్నాడు. కాబట్టి అబ్షాలోము పనివారు ఆ పొలాన్ని తగలబెట్టారు.

  15. 2 సమూయేలు 14:31సుమారు క్రీ.పూ. 1027

    అప్పుడు యోవాబు అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ పనివారు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.

  16. 2 సమూయేలు 14:32సుమారు క్రీ.పూ. 1027

    అందుకు అబ్షాలోము యోవాబుతో, “నీవు రావాలని నేను కబురు పంపాను. ‘గెషూరు నుండి నేను ఎందుకు వచ్చాను? నేనక్కడే ఉండడం నాకు మంచిది గదా!’ అని నీ చేత రాజుతో చెప్పించడానికి నిన్ను రాజు దగ్గరకు పంపాలని నిన్ను పిలిచాను. నేను రాజు ముఖాన్ని చూడాలి. నేను దోషినైతే రాజు నన్ను చంపించవచ్చు” అన్నాడు.

  17. 2 సమూయేలు 14:33సుమారు క్రీ.పూ. 1025

    కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి ఆ సంగతి చెప్పాడు. అప్పుడు రాజు అబ్షాలోమును పిలిపించగా అతడు రాజు దగ్గరకు వచ్చి తన తల నేలకు ఆనించి రాజుకు నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.

  18. 2 సమూయేలు 15:1సుమారు క్రీ.పూ. 1024

    కొంతకాలం తర్వాత అబ్షాలోము ఒక రథాన్ని, గుర్రాలను తన ముందు పరుగెత్తడానికి యాభైమంది పురుషులను అంగరక్షకులుగా సమకూర్చుకున్నాడు.

  19. 2 సమూయేలు 15:2సుమారు క్రీ.పూ. 1024

    అతడు ఉదయాన్నే లేచి పట్టణ ద్వారానికి వెళ్లే దారి ప్రక్కన నిలబడేవాడు. రాజు తీర్పు పొందడానికి ఎవరైనా ఫిర్యాదులతో వస్తే అబ్షాలోము వారిని పిలిచి, “మీది ఏ ఊరు?” అని అడిగేవాడు. “నీ సేవకుడైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలాన దానికి చెందిన వాడినని” ఆ వ్యక్తి చెప్పినప్పుడు,

  20. 2 సమూయేలు 15:3సుమారు క్రీ.పూ. 1024

    అప్పుడు అబ్షాలోము, “చూడు, నీ ఫిర్యాదులు విలువైనవి, సరియైనవే కాని, వాటిని వినడానికి రాజు ప్రతినిధులెవరు లేరు” అని అనేవాడు.

  21. 2 సమూయేలు 15:4సుమారు క్రీ.పూ. 1024

    ఇంకా అబ్షాలోము, “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడి ఉంటే బాగుండేది! అప్పుడు ఎవరైనా ఫిర్యాదులతో వివాదాలతో నా దగ్గరకు వస్తే, వారికి న్యాయం జరిగేలా చూసేవాన్ని” అని చెప్పేవాడు.

  22. 2 సమూయేలు 15:5సుమారు క్రీ.పూ. 1024

    అలాగే, ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు అబ్షాలోము తన చేయి చాచి, అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు.

  23. 2 సమూయేలు 15:6సుమారు క్రీ.పూ. 1024

    తీర్పు కోసం రాజు దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులందరితో అబ్షాలోము ఇలానే మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.

  24. 2 సమూయేలు 15:7సుమారు క్రీ.పూ. 1021

    ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము రాజు దగ్గరకు వెళ్లి, “నేను హెబ్రోనుకు వెళ్లి యెహోవాకు నేను చేసిన మ్రొక్కుబడిని తీర్చుకోనివ్వండి.

  25. 2 సమూయేలు 15:8సుమారు క్రీ.పూ. 1021

    నీ సేవకుడు అరాములోని గెషూరులో ఉన్నప్పుడు, ‘ఒకవేళ యెహోవా నన్ను తిరిగి యెరూషలేముకు తీసుకెళ్తే నేను హెబ్రోనులో యెహోవాను ఆరాధిస్తాను’ అని మ్రొక్కుబడి చేశాను” అని మనవి చేశాడు.