కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 10:8సుమారు క్రీ.పూ. 1037

    అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. సోబా, రెహోబు నుండి వచ్చిన అరామీయులు, అలాగే టోబు, మయకా నుండి వచ్చినవారు విడివిడిగా పొలాల్లో ఉన్నారు.

  2. 2 సమూయేలు 10:9సుమారు క్రీ.పూ. 1037

    యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు.

  3. 2 సమూయేలు 10:10సుమారు క్రీ.పూ. 1037

    మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచి వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు.

  4. 2 సమూయేలు 10:11సుమారు క్రీ.పూ. 1037

    యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి. అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను రక్షించడానికి నేను వస్తాను.

  5. 2 సమూయేలు 10:12సుమారు క్రీ.పూ. 1037

    ధైర్యంగా ఉండు. మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.

  6. 2 సమూయేలు 10:13సుమారు క్రీ.పూ. 1037

    అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు.

  7. 2 సమూయేలు 10:14సుమారు క్రీ.పూ. 1037

    అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అమ్మోనీయులతో పోరాటం మాని యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.

  8. 2 సమూయేలు 10:15సుమారు క్రీ.పూ. 1036

    తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు మళ్ళీ గుంపుగా కలిశారు.

  9. 2 సమూయేలు 10:16సుమారు క్రీ.పూ. 1036

    హదదెజరు యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించాడు; వారు హేలాముకు వెళ్లారు. హదదెజెరు సేనాధిపతియైన షోబకు వారిని నడిపించాడు.

  10. 2 సమూయేలు 10:17సుమారు క్రీ.పూ. 1036

    దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వెళ్లాడు. దావీదును ఎదుర్కొని యుద్ధం చేయడానికి అరామీయులు యుద్ధరంగంలోనికి దిగి అతనితో యుద్ధం చేశారు.

  11. 2 సమూయేలు 10:18సుమారు క్రీ.పూ. 1036

    అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేక పారిపోయారు. దావీదు వారిలో 700 మంది రథసారధులను 40,000 మంది సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోబకును కూడా చంపాడు.

  12. 2 సమూయేలు 10:19సుమారు క్రీ.పూ. 1036

    హదదెజెరు సేవకులైన సామంత రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి వారితో సమాధానపడి లొంగిపోయారు. అప్పటినుండి అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి భయపడ్డారు.

  13. 2 సమూయేలు 11:1సుమారు క్రీ.పూ. 1035

    వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, దావీదు యోవాబును తన మనుష్యులతో ఇశ్రాయేలు సైన్యమంతటితో పంపించగా, వారు అమ్మోనీయులను నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించారు. కాని దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.

  14. 2 సమూయేలు 11:2సుమారు క్రీ.పూ. 1035

    ఒక రోజు సాయంత్రం దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, అక్కడినుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది.

  15. 2 సమూయేలు 11:3సుమారు క్రీ.పూ. 1035

    ఆమె గురించి వివరాలు తెలుసుకొని రమ్మని దావీదు ఒక వ్యక్తిని పంపించాడు. అతడు వచ్చి, “ఆమె ఎలీయాము కుమార్తెయైన బత్షెబ, హిత్తీయుడైన ఊరియాకు భార్య” అని చెప్పాడు.

  16. 2 సమూయేలు 11:4సుమారు క్రీ.పూ. 1035

    ఆమెను తీసుకురావడానికి దావీదు తన మనుష్యులను పంపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఆమెతో పడుకున్నాడు. ఆమె తనకు కలిగిన అపవిత్రతను శుద్ధి చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది.

  17. 2 సమూయేలు 11:5సుమారు క్రీ.పూ. 1035

    ఆ స్త్రీ గర్భం ధరించగా, “నేను గర్భవతినయ్యాను” అని దావీదుకు కబురు పంపింది.

  18. 2 సమూయేలు 11:6సుమారు క్రీ.పూ. 1035

    అప్పుడు దావీదు, “హిత్తీయుడైన ఊరియాను నా దగ్గరకు పంపించు” అని యోవాబుకు కబురు చేయగా యోవాబు అతన్ని దావీదు దగ్గరకు పంపాడు.

  19. 2 సమూయేలు 11:7సుమారు క్రీ.పూ. 1035

    ఊరియా తన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు అతన్ని, యోవాబు ఎలా ఉన్నాడో సైనికులు ఎలా ఉన్నారో యుద్ధం ఎలా జరుగుతుందో అడిగాడు.

  20. 2 సమూయేలు 11:8సుమారు క్రీ.పూ. 1035

    తర్వాత దావీదు ఊరియాతో, “నీవు ఇంటికి వెళ్లి పాదాలు కడుక్కో” అని చెప్పాడు. ఊరియా రాజభవనం నుండి వెళ్లిపోయాడు. అతని వెనుక రాజు అతనికి కానుక పంపించాడు.

  21. 2 సమూయేలు 11:9సుమారు క్రీ.పూ. 1035

    అయితే ఊరియా తన ఇంటికి వెళ్లకుండా తన రాజు సేవకులందరితో కలిసి రాజభవన ద్వారం దగ్గరే నిద్రపోయాడు.

  22. 2 సమూయేలు 11:10సుమారు క్రీ.పూ. 1035

    ఊరియా ఇంటికి వెళ్లలేదని దావీదు విని ఊరియాను పిలిచి, “నీవు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చావు కదా! ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.

  23. 2 సమూయేలు 11:11సుమారు క్రీ.పూ. 1035

    అందుకు ఊరియా దావీదుతో, “మందసం, ఇశ్రాయేలీయులు, యూదా వారు గుడారాల్లోనే ఉంటున్నారు. నా దళాధిపతియైన యోవాబు, నా ప్రభువు యొక్క సైనికులు పొలిమేరల్లో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఇంటికి వెళ్లి తిని త్రాగి, నా భార్యతో ఎలా సంతోషించగలను? నీ జీవం తోడు, నేను అలా చేయను” అన్నాడు.

  24. 2 సమూయేలు 11:12సుమారు క్రీ.పూ. 1035

    అందుకు దావీదు, “సరే, ఈ రోజు కూడా ఇక్కడే ఉండు. రేపు నేను నిన్ను వెనుకకు పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. కాబట్టి ఊరియా ఆ రోజు, మరుసటిరోజు యెరూషలేములోనే ఉండిపోయాడు.

  25. 2 సమూయేలు 11:13సుమారు క్రీ.పూ. 1035

    దావీదు అతన్ని పిలిపించి, అతనితో కలిసి తిని త్రాగి అతనికి బాగా మత్తెక్కేలా త్రాగించాడు. అయినా సాయంకాలం అతడు ఇంటికి వెళ్లకుండా తన రాజు సేవకుల మధ్యలో తన పడక మీద పడుకున్నాడు.