కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 7:18సుమారు క్రీ.పూ. 1042

    అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి, యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “ప్రభువైన యెహోవా! మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది?

  2. 2 సమూయేలు 7:19సుమారు క్రీ.పూ. 1042

    ప్రభువైన యెహోవా! మీ దృష్టిలో ఇది చాలదన్నట్టు మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. ప్రభువైన యెహోవా! మామూలు మనుష్యుల పట్ల మీరు ఇంత కార్యం చేస్తారా?

  3. 2 సమూయేలు 7:20సుమారు క్రీ.పూ. 1042

    “దావీదు మీతో ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పగలడు? ప్రభువైన యెహోవా! మీ సేవకుని గురించి మీకు తెలుసు.

  4. 2 సమూయేలు 7:21సుమారు క్రీ.పూ. 1042

    మీ మాట కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి మీ సేవకునికి తెలియజేశారు.

  5. 2 సమూయేలు 7:22సుమారు క్రీ.పూ. 1042

    “ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.

  6. 2 సమూయేలు 7:23సుమారు క్రీ.పూ. 1042

    మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వారి దేవుళ్ళను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు.

  7. 2 సమూయేలు 7:24సుమారు క్రీ.పూ. 1042

    మీరు ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు.

  8. 2 సమూయేలు 7:25సుమారు క్రీ.పూ. 1042

    “ఇప్పుడు దేవా, యెహోవా! మీ సేవకునికి అతని కుటుంబానికి మీరు చేసిన వాగ్దానాన్ని ఎల్లకాలం స్థిరపరచండి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి;

  9. 2 సమూయేలు 7:26సుమారు క్రీ.పూ. 1042

    తద్వారా మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవాయే ఇశ్రాయేలీయుల దేవుడు’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.

  10. 2 సమూయేలు 7:27సుమారు క్రీ.పూ. 1042

    “సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు దేవా, ‘నేను నీకు రాజవంశాన్ని స్థాపిస్తాను’ అని మీరు ఈ విషయాన్ని మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ఈ ప్రార్థన ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది.

  11. 2 సమూయేలు 7:28సుమారు క్రీ.పూ. 1042

    ప్రభువైన యెహోవా, మీరే దేవుడు! మీ మాటలు నమ్మదగినవి. మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు.

  12. 2 సమూయేలు 7:29సుమారు క్రీ.పూ. 1042

    మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించండి; ప్రభువైన యెహోవా, మీరు చెప్పినట్లుగా మీ దీవెనలతో మీ సేవకుని కుటుంబం శాశ్వతంగా దీవించబడుతుంది.”

  13. 2 సమూయేలు 8:1సుమారు క్రీ.పూ. 1040

    కాలక్రమేణా దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరచుకున్నాడు, వారి ఆధీనంలో ఉన్న మెతెగ్ అమ్మాను స్వాధీనం చేసుకున్నాడు.

  14. 2 సమూయేలు 8:2సుమారు క్రీ.పూ. 1040

    అలాగే దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు. అతడు పట్టుకున్న వారిని నేలపై పడుకోబెట్టి త్రాడుతో వారిని కొలిపించాడు. అతడు వారిలో ప్రతి రెండు త్రాళ్ల పొడవున్న వారిని చంపి, మూడవ తాడు కొలతలో ఉన్నవారిని బ్రతకనిచ్చాడు. కాబట్టి మోయాబీయులు దావీదుకు లోబడి అతనికి కప్పం చెల్లించారు.

  15. 2 సమూయేలు 8:3సుమారు క్రీ.పూ. 1040

    రెహోబు కుమారుడు సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది దగ్గర తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.

  16. 2 సమూయేలు 8:4సుమారు క్రీ.పూ. 1040

    దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు.

  17. 2 సమూయేలు 8:5సుమారు క్రీ.పూ. 1040

    సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు.

  18. 2 సమూయేలు 8:6సుమారు క్రీ.పూ. 1040

    దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా, అరామీయులు అతనికి దాసులై కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు.

  19. 2 సమూయేలు 8:7సుమారు క్రీ.పూ. 1040

    దావీదు హదదెజెరు సైన్యాధిపతులకు చెందిన బంగారు డాళ్లను తీసుకుని వాటిని యెరూషలేముకు తెచ్చాడు.

  20. 2 సమూయేలు 8:8సుమారు క్రీ.పూ. 1040

    హదదెజెరుకు చెందిన తెబా బెరోతయి అనే పట్టణాల నుండి రాజైన దావీదు పెద్ద మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు.

  21. 2 సమూయేలు 8:9సుమారు క్రీ.పూ. 1040

    హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు,

  22. 2 సమూయేలు 8:10సుమారు క్రీ.పూ. 1040

    అతడు తన కుమారుడైన యోరామును రాజైన దావీదు దగ్గరకు అతని క్షేమం గురించి తెలుసుకుని అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి పంపాడు, ఎందుకంటే హదదెజెరుకు తోయుకు మధ్య విరోధం ఉంది. యోరాము బంగారం వెండి ఇత్తడితో చేసిన అన్ని రకాల వస్తువులను తెచ్చాడు.

  23. 2 సమూయేలు 8:11సుమారు క్రీ.పూ. 1040

    రాజైన దావీదు ఈ వస్తువులను తాను జయించిన అన్ని దేశాలు నుండి, అనగా ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అమాలేకీయుల దేశాల నుండి స్వాధీనం చేసుకున్న వెండి బంగారాలను ప్రతిష్ఠించిన విధంగానే యెహోవాకు ప్రతిష్ఠించాడు. అంతేకాక, రెహోబు కుమారుడు సోబా రాజైన హదదెజెరు నుండి స్వాధీనం చేసుకున్న వాటిని యెహోవాకు ప్రతిష్ఠించాడు.

  24. 2 సమూయేలు 8:12సుమారు క్రీ.పూ. 1040

    Of Syria, and of Moab, and of the children of Ammon, and of the Philistines, and of Amalek, and of the spoil of Hadadezer, son of Rehob, king of Zobah.

  25. 2 సమూయేలు 8:13సుమారు క్రీ.పూ. 1040

    దావీదు ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చిన తర్వాత అతడు చాలా పేరు గడించాడు.