- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 2 సమూయేలు 5:16సుమారు క్రీ.పూ. 1048
ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు.
- 2 సమూయేలు 5:17సుమారు క్రీ.పూ. 1048
ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని సురక్షిత స్థలానికి వెళ్లాడు.
- 2 సమూయేలు 5:18సుమారు క్రీ.పూ. 1048
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయను విస్తరించారు.
- 2 సమూయేలు 5:19సుమారు క్రీ.పూ. 1048
అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని యెహోవాను అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.
- 2 సమూయేలు 5:20సుమారు క్రీ.పూ. 1048
కాబట్టి దావీదు బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట ఉండకుండా నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టాడు.
- 2 సమూయేలు 5:21సుమారు క్రీ.పూ. 1048
ఫిలిష్తీయులు తమ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని మనుష్యులు వాటిని పట్టుకెళ్లారు.
- 2 సమూయేలు 5:22సుమారు క్రీ.పూ. 1048
మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు.
- 2 సమూయేలు 5:23సుమారు క్రీ.పూ. 1048
కాబట్టి దావీదు యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు యెహోవా, “నీవు తిన్నగా వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి.
- 2 సమూయేలు 5:24సుమారు క్రీ.పూ. 1048
కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే వేగంగా కదులు ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి యెహోవా నీకు ముందుగా వెళ్లారని దాని అర్థం” అని అతనికి జవాబిచ్చారు.
- 2 సమూయేలు 5:25సుమారు క్రీ.పూ. 1048
కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, అతడు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముతూ వారిని హతం చేశాడు.
- 2 సమూయేలు 6:1సుమారు క్రీ.పూ. 1042
దావీదు మరలా ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సామర్థ్యంగల యువకులను సమకూర్చుకున్నాడు.
- 2 సమూయేలు 6:2సుమారు క్రీ.పూ. 1042
కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యాల యెహోవా అని పిలువబడే దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, అతనితో ఉన్న మనుష్యులందరు యూదాలోని బయలాకు వెళ్లారు.
- 2 సమూయేలు 6:3సుమారు క్రీ.పూ. 1042
వారు కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటి నుండి దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలుతుండగా అహియో దాని ముందు నడిచాడు.
- 2 సమూయేలు 6:4సుమారు క్రీ.పూ. 1042
And they brought it out of the house of Abinadab which was at Gibeah, accompanying the ark of God: and Ahio went before the ark.
- 2 సమూయేలు 6:5సుమారు క్రీ.పూ. 1042
దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
- 2 సమూయేలు 6:6సుమారు క్రీ.పూ. 1042
వారు నాకోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు.
- 2 సమూయేలు 6:7సుమారు క్రీ.పూ. 1042
ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా కోపం అతని మీద రగులుకుని దేవుడు అతన్ని మొత్తగా అతడు దేవుని మందసం ప్రక్కనే పడి చనిపోయాడు.
- 2 సమూయేలు 6:8సుమారు క్రీ.పూ. 1042
యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.
- 2 సమూయేలు 6:9సుమారు క్రీ.పూ. 1042
ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి, “యెహోవా మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అనుకున్నాడు.
- 2 సమూయేలు 6:10సుమారు క్రీ.పూ. 1042
యెహోవా మందసాన్ని తనతో పాటు దావీదు పట్టణానికి తీసుకెళ్లడానికి అతడు ఇష్టపడలేదు, కాబట్టి దావీదు దానిని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు.
- 2 సమూయేలు 6:11సుమారు క్రీ.పూ. 1042
యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంట్లోనే మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటి వారినందరిని దీవించారు.
- 2 సమూయేలు 6:12సుమారు క్రీ.పూ. 1042
“దేవుని మందసం ఇంట్లో ఉండడం వల్ల ఓబేద్-ఎదోము కుటుంబమంతటిని అతనికి ఉన్న వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించారు” అని రాజైన దావీదుకు తెలిసింది. దేవుని మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి దావీదు పట్టణానికి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు వెళ్లాడు.
- 2 సమూయేలు 6:13సుమారు క్రీ.పూ. 1042
యెహోవా మందసాన్ని మోస్తున్న వ్యక్తులు నడిచేటప్పుడు దావీదు ప్రతి ఆరు అడుగులకు ఒక ఎద్దును, క్రొవ్విన దూడను బలిగా అర్పించాడు.
- 2 సమూయేలు 6:14సుమారు క్రీ.పూ. 1042
దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు.
- 2 సమూయేలు 6:15సుమారు క్రీ.పూ. 1042
ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.