కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 సమూయేలు 6:16సుమారు క్రీ.పూ. 1042

    యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో రాజైన దావీదు గంతులు వేస్తూ నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.

  2. 2 సమూయేలు 6:17సుమారు క్రీ.పూ. 1042

    వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచారు, దావీదు యెహోవా సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించాడు.

  3. 2 సమూయేలు 6:18సుమారు క్రీ.పూ. 1042

    అతడు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, దావీదు సైన్యాల యెహోవా పేరిట ప్రజలను దీవించాడు.

  4. 2 సమూయేలు 6:19సుమారు క్రీ.పూ. 1042

    అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి ప్రతి స్త్రీకి పురుషునికి ఒక రొట్టె, కొంత మాంసం, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు. తర్వాత ప్రజలంతా ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు.

  5. 2 సమూయేలు 6:20సుమారు క్రీ.పూ. 1042

    తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు సౌలు కుమార్తె మీకాలు ఎదురు వచ్చి అతనితో, “ఇశ్రాయేలు రాజు తన సేవకులైన బానిస అమ్మాయిలు చూస్తుండగా ఒక పిచ్చివాడు చేసినట్లుగా ఈ రోజు బట్టలు విప్పి అర్థనగ్నంగా ఎంత గొప్పగా కనబడ్డాడో!” అని హేళనగా మాట్లాడింది.

  6. 2 సమూయేలు 6:21సుమారు క్రీ.పూ. 1042

    అందుకు దావీదు మీకాలుతో, “నీ తండ్రిని నీ తండ్రి ఇంటివారిని కాదని నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన యెహోవా సన్నిధిలో నేను ఆనందిస్తూ నాట్యం చేశాను.

  7. 2 సమూయేలు 6:22సుమారు క్రీ.పూ. 1042

    నేను ఇంతకన్నా ఎక్కువ అవమానపడినా నా దృష్టికి నేను తక్కువ వాడినైనా ఫర్వాలేదు, కాని నీవు చెప్తున్న బానిస అమ్మాయిల దృష్టిలో గౌరవించబడతాను” అన్నాడు.

  8. 2 సమూయేలు 6:23సుమారు క్రీ.పూ. 1042

    సౌలు కుమార్తె మీకాలుకు ఆమె చనిపోయే వరకు పిల్లలు పుట్టలేదు.

  9. 2 సమూయేలు 7:1సుమారు క్రీ.పూ. 1042

    నాలుగు వైపులా ఉన్న అతని శత్రులమీద యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చి నెమ్మది కలిగించిన తర్వాత రాజు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత,

  10. 2 సమూయేలు 7:2సుమారు క్రీ.పూ. 1042

    రాజు నాతాను ప్రవక్తతో, “ఇదిగో దేవుని మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.

  11. 2 సమూయేలు 7:3సుమారు క్రీ.పూ. 1042

    అందుకు నాతాను రాజుతో, “యెహోవా నీకు తోడుగా ఉన్నారు కాబట్టి నీ మనస్సులో ఏముందో అది చేయి” అన్నాడు.

  12. 2 సమూయేలు 7:4సుమారు క్రీ.పూ. 1042

    అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది:

  13. 2 సమూయేలు 7:5సుమారు క్రీ.పూ. 1042

    “నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టించేది నీవా?

  14. 2 సమూయేలు 7:6సుమారు క్రీ.పూ. 1042

    ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. గుడారంలో నివసిస్తూ ఒకచోట నుండి మరో చోటికి తిరుగుతున్నాను.

  15. 2 సమూయేలు 7:7సుమారు క్రీ.పూ. 1042

    ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ఇశ్రాయేలు ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి పాలకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’

  16. 2 సమూయేలు 7:8సుమారు క్రీ.పూ. 1042

    “కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.

  17. 2 సమూయేలు 7:9సుమారు క్రీ.పూ. 1042

    నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.

  18. 2 సమూయేలు 7:10సుమారు క్రీ.పూ. 1042

    నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలాంటి తొందర లేకుండా వారి స్వస్థలంలో నివసించేలా వారిని అందులో నాటుతాను. గతంలో వారు చేసినట్లుగా దుర్మార్గులు వారిని ఇక బాధించరు,

  19. 2 సమూయేలు 7:11సుమారు క్రీ.పూ. 1042

    అంతేకాదు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుండి జరిగినట్టు దుర్మార్గులు ఇక వారిని బాధించరు. నీ శత్రువులందరి నుండి నీకు నెమ్మది కలుగజేస్తాను. “ ‘యెహోవా నీకు చెప్పేది ఏంటంటే, యెహోవాయే నీ వంశాన్ని స్థిరపరుస్తారు.

  20. 2 సమూయేలు 7:12సుమారు క్రీ.పూ. 1042

    నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.

  21. 2 సమూయేలు 7:13సుమారు క్రీ.పూ. 1042

    నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.

  22. 2 సమూయేలు 7:14సుమారు క్రీ.పూ. 1042

    నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.

  23. 2 సమూయేలు 7:15సుమారు క్రీ.పూ. 1042

    నీ ముందు నుండి నేను తొలగించిన సౌలుకు దూరం చేసినట్లుగా అతనికి నా ప్రేమను దూరం చేయను.

  24. 2 సమూయేలు 7:16సుమారు క్రీ.పూ. 1042

    నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”

  25. 2 సమూయేలు 7:17సుమారు క్రీ.పూ. 1042

    నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు.