- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
ఈ కాలపు వచనాలు
- విలాపవాక్యములు 4:16సుమారు క్రీ.పూ. 588
యెహోవా తానే వారిని చెదరగొట్టారు; ఆయన ఇకపై వారిని పట్టించుకోరు. యాజకుల పట్ల ఇక గౌరవం చూపించరు, పెద్దల పట్ల దయ చూపించరు.
- విలాపవాక్యములు 4:17సుమారు క్రీ.పూ. 588
పైగా, సహాయం కోసం వ్యర్థంగా, మేము మా గోపురాల నుండి; మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ మా కళ్లు క్షీణించిపోయాయి.
- విలాపవాక్యములు 4:18సుమారు క్రీ.పూ. 588
ప్రజలు అడుగడుగునా మమ్మల్ని పొంచి ఉన్నారు, మేము మా వీధుల్లో నడవలేకపోయాము. మా అంతం దగ్గరపడింది, మా రోజులు లెక్కించబడ్డాయి, మా అంతం వచ్చింది.
- విలాపవాక్యములు 4:19సుమారు క్రీ.పూ. 588
మమ్మల్ని వెంటాడుతున్నవారు ఆకాశంలో ఎగిరే గ్రద్ద కంటే వేగంగా ఉన్నారు; పర్వతాల మీదుగా మమల్ని వెంబడించి ఎడారిలో మాకోసం వేచి ఉన్నారు.
- విలాపవాక్యములు 4:20సుమారు క్రీ.పూ. 588
యెహోవా అభిషిక్తుడు, మన ప్రాణానికి ఊపిరి. వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆయన నీడలో మనం ప్రజలమధ్య జీవిస్తాం అని అనుకున్నాము.
- విలాపవాక్యములు 4:21సుమారు క్రీ.పూ. 588
ఎదోము కుమారీ, ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు. అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది; నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు.
- విలాపవాక్యములు 4:22సుమారు క్రీ.పూ. 588
సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; ఆయన మీ చెరను పొడిగించరు. కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు.
- విలాపవాక్యములు 5:1సుమారు క్రీ.పూ. 588
యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి; మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి.
- విలాపవాక్యములు 5:2సుమారు క్రీ.పూ. 588
మా వారసత్వం అపరిచితులకు, మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు.
- విలాపవాక్యములు 5:3సుమారు క్రీ.పూ. 588
మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు.
- విలాపవాక్యములు 5:4సుమారు క్రీ.పూ. 588
మేము త్రాగే నీటిని మేము కొనుక్కోవలసి వస్తుంది; మేము కట్టెలు ఎక్కువ వెలపెట్టి కొనుక్కోవలసి వస్తుంది.
- విలాపవాక్యములు 5:5సుమారు క్రీ.పూ. 588
మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు; మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు.
- విలాపవాక్యములు 5:6సుమారు క్రీ.పూ. 588
తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు మేము మా చేతులు చాపాము.
- విలాపవాక్యములు 5:7సుమారు క్రీ.పూ. 588
మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు, వారి శిక్షను మేము భరిస్తున్నాము.
- విలాపవాక్యములు 5:8సుమారు క్రీ.పూ. 588
బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు.
- విలాపవాక్యములు 5:9సుమారు క్రీ.పూ. 588
ఎడారిలో ఖడ్గం కారణంగా, ప్రాణాలను పణంగా పెట్టి ఆహారం తెచ్చుకుంటున్నాము.
- విలాపవాక్యములు 5:10సుమారు క్రీ.పూ. 588
ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది.
- విలాపవాక్యములు 5:11సుమారు క్రీ.పూ. 588
సీయోనులో స్త్రీలు, యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు.
- విలాపవాక్యములు 5:12సుమారు క్రీ.పూ. 588
అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు; పెద్దలకు గౌరవం లేదు.
- విలాపవాక్యములు 5:13సుమారు క్రీ.పూ. 588
యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు; బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు.
- విలాపవాక్యములు 5:14సుమారు క్రీ.పూ. 588
పెద్దలు నగర ద్వారం నుండి వెళ్లిపోయారు, యువకులు తమ సంగీతాన్ని ఆపివేశారు.
- విలాపవాక్యములు 5:15సుమారు క్రీ.పూ. 588
మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది, మా నాట్యం దుఃఖంగా మారింది.
- విలాపవాక్యములు 5:16సుమారు క్రీ.పూ. 588
మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, పాపం చేశాము, మాకు శ్రమ.
- విలాపవాక్యములు 5:17సుమారు క్రీ.పూ. 588
మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి
- విలాపవాక్యములు 5:18సుమారు క్రీ.పూ. 588
సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది, నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.