- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
ఈ కాలపు వచనాలు
- యెహోషువ 19:31సుమారు క్రీ.పూ. 1443
ఈ పట్టణాలు వాటి గ్రామాలు ఆషేరు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.
- యెహోషువ 19:32సుమారు క్రీ.పూ. 1443
ఆరో చీటి వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి వచ్చింది.
- యెహోషువ 19:33సుమారు క్రీ.పూ. 1443
వారి సరిహద్దు హెలెఫు జయనన్నీములోని సింధూర వృక్షం నుండి అదామి నెకెబు, జబ్నీలులను దాటి లక్కూముకు వెళ్లి యొర్దాను దగ్గర ముగిసింది.
- యెహోషువ 19:34సుమారు క్రీ.పూ. 1443
దాని సరిహద్దు పశ్చిమాన అస్నోత్-తాబోరు గుండా వెళ్లి హుక్కోకు దగ్గరకు వచ్చింది. అది దక్షిణాన జెబూలూను, పశ్చిమాన ఆషేరు, యూదా, తూర్పున యొర్దాను తాకింది.
- యెహోషువ 19:35సుమారు క్రీ.పూ. 1443
కోటగోడలు గలవారి పట్టణాలు: జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,
- యెహోషువ 19:36సుమారు క్రీ.పూ. 1443
అదామా, రామా, హాసోరు,
- యెహోషువ 19:37సుమారు క్రీ.పూ. 1443
కెదెషు, ఎద్రెయీ, ఎన్-హాసోరు,
- యెహోషువ 19:38సుమారు క్రీ.పూ. 1443
ఇరోను, మిగ్దల్-ఏలు, హొరేము, బేత్-అనాతు, బేత్-షెమెషు, పందొమ్మిది పట్టణాలు, వారి గ్రామాలు.
- యెహోషువ 19:39సుమారు క్రీ.పూ. 1443
వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు వాటి గ్రామాలు ఇవి.
- యెహోషువ 19:40సుమారు క్రీ.పూ. 1443
ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది.
- యెహోషువ 19:41సుమారు క్రీ.పూ. 1443
వారి వారసత్వం సరిహద్దు జోరహు, ఎష్తాయోలు ఈర్-షెమెషు,
- యెహోషువ 19:42సుమారు క్రీ.పూ. 1443
షయల్బీను, అయ్యాలోను, ఇత్లా,
- యెహోషువ 19:43సుమారు క్రీ.పూ. 1443
ఎలోను, తిమ్నా, ఎక్రోను,
- యెహోషువ 19:44సుమారు క్రీ.పూ. 1443
ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు,
- యెహోషువ 19:45సుమారు క్రీ.పూ. 1443
యెహూదు, బెనె-బెరకు, గాత్-రిమ్మోను,
- యెహోషువ 19:46సుమారు క్రీ.పూ. 1443
మే-యర్కోను, రక్కోను, యొప్ప ముందున్న ప్రాంతం.
- యెహోషువ 19:47సుమారు క్రీ.పూ. 1443
కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు.
- యెహోషువ 19:48సుమారు క్రీ.పూ. 1443
వారి వంశాల ప్రకారం దాను గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు, వాటి గ్రామాలు ఇవి.
- యెహోషువ 19:49సుమారు క్రీ.పూ. 1443
వారు సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని పంచి ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు వారసత్వాన్ని ఇచ్చారు.
- యెహోషువ 19:50సుమారు క్రీ.పూ. 1443
వారు యెహోవా ఆజ్ఞను అనుసరించి యెహోషువ అడిగిన ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని తిమ్నాత్ సెరహు అనే ఊరు అతనికిచ్చారు. అతడా ఊరిని కట్టించి అక్కడ నివసించాడు.
- యెహోషువ 19:51సుమారు క్రీ.పూ. 1443
యాజకుడైన ఎలియాజరు, నూను కమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వంశాల నాయకులు షిలోహులో యెహోవా ఎదుట సమావేశ గుడారం ద్వారం దగ్గర చీట్లు వేసి పంచి ఇచ్చిన వారసత్వ భూములివి. ఈ విధంగా వారు భూమిని పంచిపెట్టడం ముగించారు.
- యెహోషువ 20:1సుమారు క్రీ.పూ. 1443
అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు:
- యెహోషువ 20:2సుమారు క్రీ.పూ. 1443
“నేను మోషే ద్వారా మీకు సూచించినట్లు ఆశ్రయ పట్టణాలను నియమించమని ఇశ్రాయేలీయులకు చెప్పు,
- యెహోషువ 20:3సుమారు క్రీ.పూ. 1443
తద్వార, ఎవరైనా ఒక వ్యక్తిని తెలియక పొరపాటున చంపితే అక్కడికి పారిపోయి ఆ హత్యకు చేసే ప్రతీకారం నుండి ఆశ్రయం పొందవచ్చు.
- యెహోషువ 20:4సుమారు క్రీ.పూ. 1443
వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయినప్పుడు, వారు నగర ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దల ముందు తమ వాదనను తెలియజేయాలి. అప్పుడు పెద్దలు పారిపోయినవారిని తమ పట్టణంలోకి చేర్చి, వారి మధ్య నివసించడానికి ఒక స్థలాన్ని ఇవ్వాలి.