కంటెంట్‌కు వెళ్లండి

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. యెహోషువ 20:5సుమారు క్రీ.పూ. 1443

    హత్యకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వెంబడిస్తూ వస్తే ఆ పెద్దలు వానికి పారిపోయి వచ్చిన వ్యక్తిని అప్పగించకూడదు. ఎందుకంటే పారిపోయిన వ్యక్తి తన పొరుగువారిని అనుకోకుండ చంపాడు కాని పగతో కాదు.

  2. యెహోషువ 20:6సుమారు క్రీ.పూ. 1443

    వారు సమాజం ముందు విచారణ జరిగే వరకు, ఆ సమయంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆ పట్టణంలోనే ఉండాలి. తర్వాత వారు తాము పారిపోయి వచ్చిన పట్టణంలోని తమ సొంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చు.”

  3. యెహోషువ 20:7సుమారు క్రీ.పూ. 1443

    కాబట్టి వారు నఫ్తాలి కొండ సీమలోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిం కొండ సీమలోని షెకెమును, యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) ప్రత్యేకపరిచారు.

  4. యెహోషువ 20:8సుమారు క్రీ.పూ. 1443

    యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు.

  5. యెహోషువ 20:9సుమారు క్రీ.పూ. 1443

    ఇశ్రాయేలీయులలో ఎవరైనా లేదా వారిలో నివసించే విదేశీయులెవరైనా అనుకోకుండ ఎవరినైనా చంపితే వారు ఈ నిర్ణయించబడిన పట్టణాలకు పారిపోవచ్చు, సమాజం ముందు విచారణ జరిగే వరకు రక్తపు పగతో చంపబడరు.

  6. యెహోషువ 21:1సుమారు క్రీ.పూ. 1443

    తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి,

  7. యెహోషువ 21:2సుమారు క్రీ.పూ. 1443

    వారితో కనానులోని షిలోహులో వారితో, “మీరు మా పశువులకు పచ్చికబయళ్లతో పాటు మాకు నివసించడానికి పట్టణాలు ఇవ్వమని మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించారు” అన్నారు.

  8. యెహోషువ 21:3సుమారు క్రీ.పూ. 1443

    కాబట్టి, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు తమ సొంత వారసత్వంలో నుండి ఈ క్రింది పట్టణాలను, పచ్చికబయళ్లను లేవీయులకు ఇచ్చారు:

  9. యెహోషువ 21:4సుమారు క్రీ.పూ. 1443

    కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.

  10. యెహోషువ 21:5సుమారు క్రీ.పూ. 1443

    మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు.

  11. యెహోషువ 21:6సుమారు క్రీ.పూ. 1443

    గెర్షోను సంతతివారికి ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్థ గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.

  12. యెహోషువ 21:7సుమారు క్రీ.పూ. 1443

    మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం, రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించారు.

  13. యెహోషువ 21:8సుమారు క్రీ.పూ. 1443

    యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు లేవీయులకు చీట్ల ద్వారా ఈ పట్టణాలను, వాటి పచ్చికబయళ్లను కేటాయించారు.

  14. యెహోషువ 21:9సుమారు క్రీ.పూ. 1443

    వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు.

  15. యెహోషువ 21:10సుమారు క్రీ.పూ. 1443

    లేవీయులైన కహాతీయుల వంశాల్లోని అహరోను సంతతివారికి ఈ క్రింది పట్టణాలు కేటాయించారు, ఎందుకంటే మొదటి చీటి వారికి పడింది:

  16. యెహోషువ 21:11సుమారు క్రీ.పూ. 1443

    వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)

  17. యెహోషువ 21:12సుమారు క్రీ.పూ. 1443

    అయితే వారు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, గ్రామాలను స్వాస్థ్యంగా ఇచ్చారు.

  18. యెహోషువ 21:13సుమారు క్రీ.పూ. 1443

    కాబట్టి యాజకుడైన అహరోను సంతతివారికి హెబ్రోను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), లిబ్నా,

  19. యెహోషువ 21:14సుమారు క్రీ.పూ. 1443

    యత్తీరు, ఎష్తెమోవా,

  20. యెహోషువ 21:15సుమారు క్రీ.పూ. 1443

    హోలోను, దెబీరు,

  21. యెహోషువ 21:16సుమారు క్రీ.పూ. 1443

    ఆయిను, యుత్తా, బేత్-షెమెషు వాటి పచ్చికబయళ్లతో పాటు, ఈ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలిచ్చారు.

  22. యెహోషువ 21:17సుమారు క్రీ.పూ. 1443

    బెన్యామీను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: గిబియోను, గెబా,

  23. యెహోషువ 21:18సుమారు క్రీ.పూ. 1443

    అనాతోతు, అల్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.

  24. యెహోషువ 21:19సుమారు క్రీ.పూ. 1443

    అహరోను సంతతివారైన యాజకులకు పచ్చికబయళ్లతో పాటు ఇచ్చిన పట్టణాలు మొత్తం పదమూడు.

  25. యెహోషువ 21:20సుమారు క్రీ.పూ. 1443

    లేవీయులైన కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఎఫ్రాయిం గోత్రం నుండి కేటాయించిన పట్టణాలు: