కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 16:5సుమారు క్రీ.శ. 59

    నేను మాసిదోనియాకు వెళ్లాలని అనుకుంటున్నాను కాబట్టి మాసిదోనియాకు వెళ్లినప్పుడు మీ దగ్గరకు వస్తాను.

  2. 1 కొరింథీయులకు 16:6సుమారు క్రీ.శ. 59

    బహుశ మీతో కొంతకాలం గడుపుతాను లేదా చలికాలమంతా ఉంటాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నా ప్రయాణంలో మీరు నాకు సహాయం చేయగలరు.

  3. 1 కొరింథీయులకు 16:7సుమారు క్రీ.శ. 59

    మార్గమధ్యలో మిమ్మల్ని చూసి వెంటనే వెళ్లిపోవాలని నేను అనుకోవడం లేదు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను.

  4. 1 కొరింథీయులకు 16:8సుమారు క్రీ.శ. 59

    అయితే పెంతెకొస్తు దినం వరకు ఎఫెసులోనే ఉంటాను.

  5. 1 కొరింథీయులకు 16:9సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఫలవంతమైన పని చేయడానికి ఒక గొప్ప ద్వారం నాకు తెరవబడింది.

  6. 1 కొరింథీయులకు 16:10సుమారు క్రీ.శ. 59

    తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.

  7. 1 కొరింథీయులకు 16:11సుమారు క్రీ.శ. 59

    కాబట్టి ఎవరూ అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. అతడు నా దగ్గరకు తిరిగి వచ్చేలా అతన్ని సమాధానంతో పంపించండి. అతడు సహోదరులతో పాటు వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను.

  8. 1 కొరింథీయులకు 16:12సుమారు క్రీ.శ. 59

    మన సహోదరుడైన అపొల్లో విషయం ఏంటంటే, సహోదరులతో పాటు మీ దగ్గరకు వెళ్లమని అతన్ని నేను చాలా బ్రతిమాలాను. కాని ఇప్పుడే బయలుదేరడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే సరియైన అవకాశం లభించినపుడు అతడు వస్తాడు.

  9. 1 కొరింథీయులకు 16:13సుమారు క్రీ.శ. 59

    మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.

  10. 1 కొరింథీయులకు 16:14సుమారు క్రీ.శ. 59

    ప్రేమ పూర్వకంగా అన్ని పనులు చేయండి.

  11. 1 కొరింథీయులకు 16:15సుమారు క్రీ.శ. 59

    స్తెఫెను అతని ఇంటివారు అకాయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు పరిశుద్ధుల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను,

  12. 1 కొరింథీయులకు 16:16సుమారు క్రీ.శ. 59

    అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి.

  13. 1 కొరింథీయులకు 16:17సుమారు క్రీ.శ. 59

    స్తెఫెను, ఫొర్మూనాతు అకాయికు అనేవారు రావడం నాకు సంతోషం ఎందుకంటే మీరు లేని కొరత వారు నాకు తీర్చారు.

  14. 1 కొరింథీయులకు 16:18సుమారు క్రీ.శ. 59

    నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా వారు నూతన ఉత్తేజం కలిగించారు. అలాంటివారు గౌరవించదగినవారు.

  15. 1 కొరింథీయులకు 16:19సుమారు క్రీ.శ. 59

    ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు.

  16. 1 కొరింథీయులకు 16:20సుమారు క్రీ.శ. 59

    ఇక్కడి సహోదరీ సహోదరులందరు మీకు అభినందనలు పంపుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు అభినందనలు తెలుపుకోండి.

  17. 1 కొరింథీయులకు 16:21సుమారు క్రీ.శ. 59

    పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను.

  18. 1 కొరింథీయులకు 16:22సుమారు క్రీ.శ. 59

    ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!

  19. 1 కొరింథీయులకు 16:23సుమారు క్రీ.శ. 59

    ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.

  20. 1 కొరింథీయులకు 16:24సుమారు క్రీ.శ. 59

    క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.

  21. 2 కొరింథీయులకు 1:1సుమారు క్రీ.శ. 60

    దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సోదరుడు తిమోతి,

  22. 2 కొరింథీయులకు 1:2సుమారు క్రీ.శ. 60

    మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక.

  23. 2 కొరింథీయులకు 1:3సుమారు క్రీ.శ. 60

    మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవుడు.

  24. 2 కొరింథీయులకు 1:4సుమారు క్రీ.శ. 60

    దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నారో, అదే ఆదరణతో అలాంటి కష్టాల్లో ఉన్నవారిని ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నారు.

  25. 2 కొరింథీయులకు 1:5సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది.