కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 15:38సుమారు క్రీ.శ. 59

    అయితే దేవుడు తాను నిర్ణయించిన శరీరాన్ని దానికి ఇస్తారు. ఆయన ప్రతి ఒక్క గింజకు దాని సొంత శరీరాన్ని ఇస్తారు.

  2. 1 కొరింథీయులకు 15:39సుమారు క్రీ.శ. 59

    శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు.

  3. 1 కొరింథీయులకు 15:40సుమారు క్రీ.శ. 59

    అలాగే ఆకాశ శరీరాలు ఉన్నాయి, భూలోక శరీరాలు ఉన్నాయి; ఆకాశ శరీరాల మహిమ వేరు, భూశరీరాల మహిమ వేరు.

  4. 1 కొరింథీయులకు 15:41సుమారు క్రీ.శ. 59

    సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలో భేదం ఉంటుంది.

  5. 1 కొరింథీయులకు 15:42సుమారు క్రీ.శ. 59

    మృతుల పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నశించిపోయే శరీరం నాటబడి నాశనంలేనిదిగా లేపబడుతుంది.

  6. 1 కొరింథీయులకు 15:43సుమారు క్రీ.శ. 59

    ఘనహీనంగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి శక్తిగలదానిగా లేపబడుతుంది.

  7. 1 కొరింథీయులకు 15:44సుమారు క్రీ.శ. 59

    ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మీయ శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లే ఆత్మీయ శరీరం కూడ ఉంది.

  8. 1 కొరింథీయులకు 15:45సుమారు క్రీ.శ. 59

    కాబట్టి “మొదటి మనిషియైన ఆదాము జీవి అయ్యాడు” అని వ్రాయబడింది; చివరి ఆదాము జీవాన్నిచ్చే ఆత్మ అయ్యాడు.

  9. 1 కొరింథీయులకు 15:46సుమారు క్రీ.శ. 59

    ఆత్మ సంబంధమైనది మొదట రాలేదు, కాని ప్రకృతి సంబంధమైనది మొదట వచ్చింది, ఆ తర్వాతే ఆత్మ సంబంధమైనది వచ్చింది.

  10. 1 కొరింథీయులకు 15:47సుమారు క్రీ.శ. 59

    మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు.

  11. 1 కొరింథీయులకు 15:48సుమారు క్రీ.శ. 59

    భూమికి చెందిన మానవునిలా భూలోక సంబంధులు ఉంటారు. పరలోకానికి చెందిన వానిలా పరలోక సంబంధులు ఉంటారు.

  12. 1 కొరింథీయులకు 15:49సుమారు క్రీ.శ. 59

    మనం భూసంబంధియైన మనుష్యుని రూపాన్ని ధరించినట్లే పరలోకసంబంధమైన వాని రూపాన్ని ధరించుకుంటాము.

  13. 1 కొరింథీయులకు 15:50సుమారు క్రీ.శ. 59

    సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్య వారసత్వాన్ని పొందలేవు. నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు.

  14. 1 కొరింథీయులకు 15:51సుమారు క్రీ.శ. 59

    నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము.

  15. 1 కొరింథీయులకు 15:52సుమారు క్రీ.శ. 59

    ఒక క్షణంలోనే, రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము.

  16. 1 కొరింథీయులకు 15:53సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి.

  17. 1 కొరింథీయులకు 15:54సుమారు క్రీ.శ. 59

    నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది.

  18. 1 కొరింథీయులకు 15:55సుమారు క్రీ.శ. 59

    “ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?”

  19. 1 కొరింథీయులకు 15:56సుమారు క్రీ.శ. 59

    మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే.

  20. 1 కొరింథీయులకు 15:57సుమారు క్రీ.శ. 59

    అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.

  21. 1 కొరింథీయులకు 15:58సుమారు క్రీ.శ. 59

    కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.

  22. 1 కొరింథీయులకు 16:1సుమారు క్రీ.శ. 59

    ప్రభువు ప్రజల కోసం కానుక పోగుచేయడం గురించి గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి.

  23. 1 కొరింథీయులకు 16:2సుమారు క్రీ.శ. 59

    ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు.

  24. 1 కొరింథీయులకు 16:3సుమారు క్రీ.శ. 59

    నేను వచ్చిన తర్వాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను.

  25. 1 కొరింథీయులకు 16:4సుమారు క్రీ.శ. 59

    నేను కూడా వెళ్లడం అవసరం అయితే, వారు నా వెంట వస్తారు.