- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- ఫిలేమోను 1:1సుమారు క్రీ.శ. 64
క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి,
- ఫిలేమోను 1:2సుమారు క్రీ.శ. 64
మన సహోదరి అప్ఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది:
- ఫిలేమోను 1:3సుమారు క్రీ.శ. 64
మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక.
- ఫిలేమోను 1:4సుమారు క్రీ.శ. 64
ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
- ఫిలేమోను 1:5సుమారు క్రీ.శ. 64
Hearing of thy love and faith, which thou hast toward the Lord Jesus, and toward all saints;
- ఫిలేమోను 1:6సుమారు క్రీ.శ. 64
క్రీస్తు కోసం మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో పాలివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
- ఫిలేమోను 1:7సుమారు క్రీ.శ. 64
సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.
- ఫిలేమోను 1:8సుమారు క్రీ.శ. 64
అందువల్ల, నీవేమి చేయాలనే దాని గురించి, క్రీస్తులో నేను ధైర్యంగా నిన్ను ఆజ్ఞాపించగలిగినా,
- ఫిలేమోను 1:9సుమారు క్రీ.శ. 64
ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను.
- ఫిలేమోను 1:10సుమారు క్రీ.శ. 64
నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను.
- ఫిలేమోను 1:11సుమారు క్రీ.శ. 64
గతంలో అతడు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కాని ఇప్పుడు అతడు నీకు నాకు, ఇద్దరికి ఉపయోగపడే వానిగా అయ్యాడు.
- ఫిలేమోను 1:12సుమారు క్రీ.శ. 64
నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను.
- ఫిలేమోను 1:13సుమారు క్రీ.శ. 64
నేను సువార్త కోసం సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకుని ఉండేవాన్ని.
- ఫిలేమోను 1:14సుమారు క్రీ.శ. 64
కానీ, నీకు తెలియజేయకుండా నేను ఏమి చేయాలనుకోలేదు, ఎందుకంటే నీవు చేసే ఏ సహాయమైనా నీ ఇష్టపూర్వకంగానే చేయాలి కాని, బలవంతంగా కాదని నా అభిప్రాయం.
- ఫిలేమోను 1:15సుమారు క్రీ.శ. 64
ఇతడు కొంతకాలం నీ నుండి వేరుకావడానికి కారణం, అతడు ఒక బానిసగా కాకుండా, బానిస కంటే ప్రియమైన సహోదరునిగా ఎల్లప్పుడు నీతో పాటు ఉండడానికే కావచ్చును.
- ఫిలేమోను 1:16సుమారు క్రీ.శ. 64
ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు.
- ఫిలేమోను 1:17సుమారు క్రీ.శ. 64
కాబట్టి నీవు నన్ను ఒక జతపనివానిగా భావిస్తే, నన్ను ఆహ్వానించినట్లే అతన్ని కూడా ఆహ్వానించు.
- ఫిలేమోను 1:18సుమారు క్రీ.శ. 64
ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేసినా లేదా నీకు ఏదైనా బాకీ ఉన్నా, వాటిని నా లెక్కలో వేయి.
- ఫిలేమోను 1:19సుమారు క్రీ.శ. 64
పౌలు అనే నేను, నా స్వహస్తంతో దీనిని వ్రాస్తున్నాను. నేను ఆ లెక్క చెల్లిస్తాను. నిజానికి, స్వయాన నీవే నాకు బాకీగా ఉన్నావని చెప్పనవసరం లేదు.
- ఫిలేమోను 1:20సుమారు క్రీ.శ. 64
అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను కొంత లాభం పొందాలని ఆశిస్తున్నాను; క్రీస్తులో నా హృదయాన్ని ఉత్తేజపరచు.
- ఫిలేమోను 1:21సుమారు క్రీ.శ. 64
నేను అడిగిన దానికంటే ఎక్కువగా నీవు చేస్తావని తెలిసే, నీ విధేయత మీద నమ్మకంతో నేను నీకు వ్రాస్తున్నాను.
- ఫిలేమోను 1:22సుమారు క్రీ.శ. 64
మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి.
- ఫిలేమోను 1:23సుమారు క్రీ.శ. 64
యేసు క్రీస్తు నిమిత్తం నాతో పాటు ఖైదీగా ఉన్న, ఎపఫ్రా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు.
- ఫిలేమోను 1:24సుమారు క్రీ.శ. 64
అదే విధంగా మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా అనే నా జతపనివారు కూడా వందనాలు తెలియజేస్తున్నారు.
- ఫిలేమోను 1:25సుమారు క్రీ.శ. 64
ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.