కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఫిలిప్పీయులకు 1:1సుమారు క్రీ.శ. 64

    క్రీస్తు యేసు సేవకులైన పౌలు తిమోతి,

  2. ఫిలిప్పీయులకు 1:2సుమారు క్రీ.శ. 64

    మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.

  3. ఫిలిప్పీయులకు 1:3సుమారు క్రీ.శ. 64

    మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను.

  4. ఫిలిప్పీయులకు 1:4సుమారు క్రీ.శ. 64

    మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను.

  5. ఫిలిప్పీయులకు 1:5సుమారు క్రీ.శ. 64

    మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి,

  6. ఫిలిప్పీయులకు 1:6సుమారు క్రీ.శ. 64

    మీలో ఈ మంచి కార్యాన్ని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను.

  7. ఫిలిప్పీయులకు 1:7సుమారు క్రీ.శ. 64

    నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే.

  8. ఫిలిప్పీయులకు 1:8సుమారు క్రీ.శ. 64

    యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు.

  9. ఫిలిప్పీయులకు 1:9సుమారు క్రీ.శ. 64

    దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించ కలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండేలా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను.

  10. ఫిలిప్పీయులకు 1:10సుమారు క్రీ.శ. 64

    That ye may approve things that are excellent; that ye may be sincere and without offence till the day of Christ;

  11. ఫిలిప్పీయులకు 1:11సుమారు క్రీ.శ. 64

    Being filled with the fruits of righteousness, which are by Jesus Christ, unto the glory and praise of God.

  12. ఫిలిప్పీయులకు 1:12సుమారు క్రీ.శ. 64

    సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.

  13. ఫిలిప్పీయులకు 1:13సుమారు క్రీ.శ. 64

    దాని ఫలితంగా, క్రీస్తు కోసం నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలా కాసేవారందరికి, అందరికి స్పష్టంగా తెలిసింది.

  14. ఫిలిప్పీయులకు 1:14సుమారు క్రీ.శ. 64

    నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.

  15. ఫిలిప్పీయులకు 1:15సుమారు క్రీ.శ. 64

    కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు.

  16. ఫిలిప్పీయులకు 1:16సుమారు క్రీ.శ. 64

    నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు.

  17. ఫిలిప్పీయులకు 1:17సుమారు క్రీ.శ. 64

    గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు.

  18. ఫిలిప్పీయులకు 1:18సుమారు క్రీ.శ. 64

    అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా నేను సంతోషిస్తాను.

  19. ఫిలిప్పీయులకు 1:19సుమారు క్రీ.శ. 64

    ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు.

  20. ఫిలిప్పీయులకు 1:20సుమారు క్రీ.శ. 64

    నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను.

  21. ఫిలిప్పీయులకు 1:21సుమారు క్రీ.శ. 64

    నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము.

  22. ఫిలిప్పీయులకు 1:22సుమారు క్రీ.శ. 64

    ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు!

  23. ఫిలిప్పీయులకు 1:23సుమారు క్రీ.శ. 64

    ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది.

  24. ఫిలిప్పీయులకు 1:24సుమారు క్రీ.శ. 64

    అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము.

  25. ఫిలిప్పీయులకు 1:25సుమారు క్రీ.శ. 64

    మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు.