కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 థెస్సలొనీకయులకు 1:1సుమారు క్రీ.శ. 54

    తండ్రియైన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి,

  2. 1 థెస్సలొనీకయులకు 1:2సుమారు క్రీ.శ. 54

    మేము ప్రార్థించిన ప్రతిసారి మీ అందరి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.

  3. 1 థెస్సలొనీకయులకు 1:3సుమారు క్రీ.శ. 54

    దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసు క్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము.

  4. 1 థెస్సలొనీకయులకు 1:4సుమారు క్రీ.శ. 54

    దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు.

  5. 1 థెస్సలొనీకయులకు 1:5సుమారు క్రీ.శ. 54

    ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు.

  6. 1 థెస్సలొనీకయులకు 1:6సుమారు క్రీ.శ. 54

    మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుంటున్నారు.

  7. 1 థెస్సలొనీకయులకు 1:7సుమారు క్రీ.శ. 54

    కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు.

  8. 1 థెస్సలొనీకయులకు 1:8సుమారు క్రీ.శ. 54

    అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కాబట్టి దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు,

  9. 1 థెస్సలొనీకయులకు 1:9సుమారు క్రీ.శ. 54

    ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవున్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో,

  10. 1 థెస్సలొనీకయులకు 1:10సుమారు క్రీ.శ. 54

    మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.

  11. 1 థెస్సలొనీకయులకు 2:1సుమారు క్రీ.శ. 54

    సహోదరీ సహోదరులారా! మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు.

  12. 1 థెస్సలొనీకయులకు 2:2సుమారు క్రీ.శ. 54

    మీకు తెలిసినట్టే, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి దౌర్జన్యాన్ని అనుభవించాం కాని మన దేవుని సహాయంతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నా ధైర్యంగా ఆయన సువార్తను మీకు ప్రకటించాము.

  13. 1 థెస్సలొనీకయులకు 2:3సుమారు క్రీ.శ. 54

    సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమి తప్పుడు ఉద్దేశాలు లేవు, మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.

  14. 1 థెస్సలొనీకయులకు 2:4సుమారు క్రీ.శ. 54

    దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము.

  15. 1 థెస్సలొనీకయులకు 2:5సుమారు క్రీ.శ. 54

    మేము ఎన్నడు ముఖస్తుతి చేయలేదు, మేము అత్యాశను దాచిపెట్టే ముసుగును వేసుకోలేదని మీకు తెలుసు; దాని గురించి దేవుడే మాకు సాక్షి.

  16. 1 థెస్సలొనీకయులకు 2:6సుమారు క్రీ.శ. 54

    మేము క్రీస్తు అపొస్తలులుగా మా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నా ప్రజల నుండి గాని మీ నుండి గాని ఇతరుల నుండి గాని వచ్చే ఘనతను మేము ఆశించలేదు.

  17. 1 థెస్సలొనీకయులకు 2:7సుమారు క్రీ.శ. 54

    కాని, మీ మధ్యలో చిన్నబిడ్డల్లా మృదువుగా ఉన్నాము. పాలిచ్చు తల్లి తన పిల్లలను ఎలా చూసుకుంటుందో,

  18. 1 థెస్సలొనీకయులకు 2:8సుమారు క్రీ.శ. 54

    మేము మిమ్మల్ని శ్రద్ధగా చూసుకున్నాము. ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమించాం, కాబట్టి మేము మీతో దేవుని సువార్తను పంచుకోవడమే కాక మీ కోసం మా ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాము.

  19. 1 థెస్సలొనీకయులకు 2:9సుమారు క్రీ.శ. 54

    సహోదరీ సహోదరులారా! మేము పడ్డ మా ప్రయాసాన్ని మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మేము ఎవరికి భారంగా ఉండకూడదని దేవుని సువార్తను మీ మధ్య ప్రకటించినప్పుడు, మేము రాత్రింబవళ్ళు పని చేసి మమ్మల్ని మేము పోషించుకున్నాము.

  20. 1 థెస్సలొనీకయులకు 2:10సుమారు క్రీ.శ. 54

    విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.

  21. 1 థెస్సలొనీకయులకు 2:11సుమారు క్రీ.శ. 54

    తండ్రి తన సొంత పిల్లల పట్ల ఉన్నట్లు మేము మీ పట్ల నడుచుకొన్నామని,

  22. 1 థెస్సలొనీకయులకు 2:12సుమారు క్రీ.శ. 54

    మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.

  23. 1 థెస్సలొనీకయులకు 2:13సుమారు క్రీ.శ. 54

    అంతేకాక, మేము ప్రకటించిన దేవుని వాక్యాన్ని మీరు గ్రహించినందుకు, మీరు వాటిని మనుష్యుల మాటలుగా కాకుండా అవి నిజంగా దేవుని మాటలు అని, విశ్వసించినవారిలో అవి కార్యరూపం దాల్చుతాయని మీరు అంగీకరించినందుకు మేము దేవునికి మానక కృతఙ్ఞతలు తెలుపుచున్నాము.

  24. 1 థెస్సలొనీకయులకు 2:14సుమారు క్రీ.శ. 54

    సహోదరీ సహోదరులారా, మీరు క్రీస్తు యేసులో ఉన్న యూదయలోని దేవుని సంఘాల్లా నడుచుకోవడం మొదలుపెట్టారు: యూదుల వలన ఆ సంఘాలు శ్రమపడిన విధంగానే మీరు కూడా మీ సొంత ప్రజల నుండి శ్రమపడ్డారు.

  25. 1 థెస్సలొనీకయులకు 2:15సుమారు క్రీ.శ. 54

    వారే ప్రభువైన యేసు క్రీస్తును, ప్రవక్తలను చంపారు మనల్ని బయటకు తరిమేశారు. వారు దేవునికి కోపం కలిగిస్తారు, అందరితో విరోధంగా ఉంటారు.