కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 3 యోహాను 1:1సుమారు క్రీ.శ. 90

    పెద్దనైన నేను,

  2. 3 యోహాను 1:2సుమారు క్రీ.శ. 90

    ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.

  3. 3 యోహాను 1:3సుమారు క్రీ.శ. 90

    కొందరు విశ్వాసులు వచ్చి నీవు సత్యంలో ఎలా జీవిస్తున్నావో చెప్తూ, మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యమిచ్చినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది.

  4. 3 యోహాను 1:4సుమారు క్రీ.శ. 90

    నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.

  5. 3 యోహాను 1:5సుమారు క్రీ.శ. 90

    ప్రియ మిత్రుడా, నీకు పరిచయం లేని సహోదరి సహోదరుల కోసం నీవు చేస్తున్నదాంట్లో నమ్మకంగా ఉన్నావు.

  6. 3 యోహాను 1:6సుమారు క్రీ.శ. 90

    నీ ప్రేమ గురించి వారు సంఘానికి చెప్పారు. దయచేసి దేవుని ఘనపరచే విధంగా వారిని వారి మార్గంలో పంపు.

  7. 3 యోహాను 1:7సుమారు క్రీ.శ. 90

    దేవుని ఎరుగనివారి నుండి ఏమి తీసుకోకుండా ఆయన నామం నిమిత్తం వారు బయలుదేరారు.

  8. 3 యోహాను 1:8సుమారు క్రీ.శ. 90

    మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి.

  9. 3 యోహాను 1:9సుమారు క్రీ.శ. 90

    నేను సంఘానికి వ్రాశాను, కాని మొదటి స్థానాన్ని ఆశించే దియొత్రెఫే మమ్మల్ని చేర్చుకోవడంలేదు.

  10. 3 యోహాను 1:10సుమారు క్రీ.శ. 90

    కాబట్టి నేను వచ్చినపుడు అతడు చేస్తున్న వాటిని వివరిస్తాను. అతడు మా గురించి అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడు. దానితో తృప్తి చెందకుండా, ఇతర విశ్వాసులను చేర్చుకోవడానికి కూడా అంగీకరించడం లేదు. చేర్చుకోవాలనుకునే వారిని కూడ అతడు ఆపివేసి, వారిని సంఘం నుండి వెళ్లగొడుతున్నాడు.

  11. 3 యోహాను 1:11సుమారు క్రీ.శ. 90

    ప్రియ మిత్రుడా, చెడును కాక మంచిని మాత్రమే అనుసరించు. మంచి చేసేవారు దేవునికి చెందినవారు. చెడు చేసేవారు దేవుని చూడలేరు.

  12. 3 యోహాను 1:12సుమారు క్రీ.శ. 90

    దేమేత్రిని గురించి అందరు మంచిగా చెప్తున్నారు. సత్యం విషయంలో కూడ మంచి సాక్ష్యం ఉంది. మా సాక్ష్యం సత్యమని నీకు తెలుసు.

  13. 3 యోహాను 1:13సుమారు క్రీ.శ. 90

    నేను నీకు వ్రాయవలసినది ఎంతో ఉంది. కాని కలంతో సిరాతో వ్రాయాలని నాకు లేదు.

  14. 3 యోహాను 1:14సుమారు క్రీ.శ. 90

    త్వరలో నేను నీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా నీతో మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.