Works గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఎదుట మనం ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా అనుసరిస్తే అది మనకు నీతిగా పరిగణించబడుతుంది” అని చెప్పండి.
సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.
నా దేవా, ఈ ప్రజల కోసం నేను చేసినదంతా నన్ను దయతో గుర్తుంచుకోండి.
నా దేవా, వీటిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా దేవుని మందిరం కోసం దాని సేవల కోసం నేను నమ్మకంగా చేసిన వాటిని తుడిచివేయకండి.
ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ఏడవలేదా? పేదవారిని చూసి నా ప్రాణం దుఃఖపడలేదా?
యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.
ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.
వారు కుళ్లు చూడక, నిత్యం బ్రతకాలంటే వారి ప్రాణ విమోచన వెల చాలా ఎక్కువ అది ఎన్నటికి చెల్లించబడలేదు.
మన ప్రభువైన దేవుని దయ మనమీద ఉండును గాక; మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి, అవును, మా చేతి పనులను స్థిరపరచండి.
ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది.
అది అంతులేని తరాలకు అతనికి నీతిగా ఎంచబడింది.
సొలొమోను యాత్రకీర్తన. యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.
మీరు ప్రొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకొంటూ, కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.
సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే.
నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.
నీ నీతిని పనులను నేను బయటపెడతాను అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు.
మేమందరం అపవిత్రులమయ్యాము, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి; మేమందరం ఆకులా వాడిపోయాము, గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి.
“ఎక్కువగా దేవదారు కలిగి ఉండడం అతడు నీతిని న్యాయాన్ని చేసినప్పుడు, నీ తండ్రికి అన్నపానాలు లేవా? అతడు సరియైనది, న్యాయమైనది చేశాడు, అతనికి అంతా బాగానే జరిగింది కదా.
అతడు పేదలు, అవసరతలో ఉన్న వారి పక్షంగా వాదించాడు, కాబట్టి అంతా బాగానే జరిగింది. నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని రక్షించలేవు. వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు వాటివలన వారి ఆకలి తీరదు వారి కడుపు నిండదు.
ఆ దేశంలో నోవహు దానియేలు యోబు ఈ ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
నా జీవం తోడు నోవహు దానియేలు యోబు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలరని యెహోవా ప్రకటిస్తున్నారు.
“ఒక నీతిమంతుడు ఉంటే అతడు నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు.
అతడు పర్వత క్షేత్రాల మీద భోజనం చేయడు, ఇశ్రాయేలీయుల విగ్రహాలవైపు చూడడు, తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు, బహిష్టులో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవడు,
ఎవరిని బాధించడు, అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి దిగంబరికి బట్టలు ఇస్తాడు.