కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. గలతీయులకు 1:1సుమారు క్రీ.శ. 58

    పౌలు అనే నేను మనుష్యుల ద్వారా గాని ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.

  2. గలతీయులకు 1:2సుమారు క్రీ.శ. 58

    నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి,

  3. గలతీయులకు 1:3సుమారు క్రీ.శ. 58

    మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక.

  4. గలతీయులకు 1:4సుమారు క్రీ.శ. 58

    క్రీస్తు మన తండ్రియైన దేవుని చిత్తానికి లోబడి, దుష్టత్వం ఏలుబడి చేసే ప్రస్తుత యుగం నుండి మనల్ని విడిపించడానికి మన పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నారు.

  5. గలతీయులకు 1:5సుమారు క్రీ.శ. 58

    ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్.

  6. గలతీయులకు 1:6సుమారు క్రీ.శ. 58

    మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు.

  7. గలతీయులకు 1:7సుమారు క్రీ.శ. 58

    నిజానికి అది సువార్త కానే కాదు. అయితే కొందరు సువార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని గందరగోళంలోనికి నెడుతున్నారు.

  8. గలతీయులకు 1:8సుమారు క్రీ.శ. 58

    అయితే మేమే గాని పరలోకం నుండి వచ్చిన దేవదూతే గాని, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే, వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక!

  9. గలతీయులకు 1:9సుమారు క్రీ.శ. 58

    మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను: మీరు అంగీకరించిన సువార్త కాక ఎవరైనా వేరే సువార్త ప్రకటిస్తే వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక!

  10. గలతీయులకు 1:10సుమారు క్రీ.శ. 58

    నేను ఇప్పుడు మనుష్యుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేక దేవుని ఆమోదమా? నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ప్రజలను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను.

  11. గలతీయులకు 1:11సుమారు క్రీ.శ. 58

    సహోదరీ సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలి.

  12. గలతీయులకు 1:12సుమారు క్రీ.శ. 58

    నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను.

  13. గలతీయులకు 1:13సుమారు క్రీ.శ. 58

    నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు.

  14. గలతీయులకు 1:14సుమారు క్రీ.శ. 58

    నా స్వజనులలో నా వయస్సుగల అనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వికుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది.

  15. గలతీయులకు 1:15సుమారు క్రీ.శ. 58

    కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు,

  16. గలతీయులకు 1:16సుమారు క్రీ.శ. 58

    తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు. దానికి నేను వెంటనే మనుష్యులను సంప్రదించలేదు.

  17. గలతీయులకు 1:17సుమారు క్రీ.శ. 58

    అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను.

  18. గలతీయులకు 1:18సుమారు క్రీ.శ. 58

    మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను.

  19. గలతీయులకు 1:19సుమారు క్రీ.శ. 58

    ప్రభువు సోదరుడైన యాకోబును తప్ప ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు.

  20. గలతీయులకు 1:20సుమారు క్రీ.శ. 58

    నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను.

  21. గలతీయులకు 1:21సుమారు క్రీ.శ. 58

    ఆ తర్వాత నేను సిరియాకు, కిలికియకు వెళ్లాను.

  22. గలతీయులకు 1:22సుమారు క్రీ.శ. 58

    యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు.

  23. గలతీయులకు 1:23సుమారు క్రీ.శ. 58

    వారు, “ఇంతకుముందు మనల్ని హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని మాత్రమే విన్నారు.

  24. గలతీయులకు 1:24సుమారు క్రీ.శ. 58

    కాబట్టి వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.

  25. గలతీయులకు 2:1సుమారు క్రీ.శ. 52

    పద్నాలుగు సంవత్సరాల తర్వాత తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్లాను.