కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 యోహాను 1:1సుమారు క్రీ.శ. 90

    పెద్దనైన నేను,

  2. 2 యోహాను 1:2సుమారు క్రీ.శ. 90

    మనలో నివసిస్తున్న, నిత్యం మనతోనే ఉండే సత్యాన్ని బట్టి వారు ప్రేమిస్తున్నారు.

  3. 2 యోహాను 1:3సుమారు క్రీ.శ. 90

    సత్యంలోను ప్రేమలోను తండ్రియైన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు కృపా కనికరం సమాధానాలు మనతో ఉంటాయి.

  4. 2 యోహాను 1:4సుమారు క్రీ.శ. 90

    తండ్రి మనకు ఆజ్ఞాపించిన విధంగా నీ బిడ్డలలో కొందరు సత్యంలో జీవించడం చూసి ఎంతో సంతోషించాను.

  5. 2 యోహాను 1:5సుమారు క్రీ.శ. 90

    అమ్మా, నేను నీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞను బట్టి మనం ఒకరినొకరం ప్రేమించాలని అడుగుతున్నాను.

  6. 2 యోహాను 1:6సుమారు క్రీ.శ. 90

    ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ.

  7. 2 యోహాను 1:7సుమారు క్రీ.శ. 90

    ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మనుష్యునిగా వచ్చారని ఒప్పుకొనని మోసగాళ్లు చాలామంది లోకంలో బయలుదేరారు. వారు క్రీస్తు విరోధులు.

  8. 2 యోహాను 1:8సుమారు క్రీ.శ. 90

    మనం ఇంతవరకు దేనికోసం పని చేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానాన్ని సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.

  9. 2 యోహాను 1:9సుమారు క్రీ.శ. 90

    క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని విడిచి ముందుకు వెళ్లే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగి ఉంటారు.

  10. 2 యోహాను 1:10సుమారు క్రీ.శ. 90

    ఎవరైనా ఈ బోధను తీసుకురాకుండా మీ దగ్గరకు వస్తే, వారిని మీ ఇంట్లోకి తీసుకెళ్లవద్దు రమ్మనవద్దు.

  11. 2 యోహాను 1:11సుమారు క్రీ.శ. 90

    వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.

  12. 2 యోహాను 1:12సుమారు క్రీ.శ. 90

    మీకు చాలా సంగతులు వ్రాయవలసి ఉంది, కాని సిరాతో కాగితంతో వ్రాయడం ఇష్టం లేదు. మన సంతోషం సంపూర్ణం కావడానికి, నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.

  13. 2 యోహాను 1:13సుమారు క్రీ.శ. 90

    దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు.