కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 14:28సుమారు క్రీ.శ. 59

    అయితే అర్థాన్ని వివరించగలవారు ఎవరూ లేకపోతే, భాషలు మాట్లాడేవారు సంఘంలో మౌనంగా ఉండి, తనలో తాను దేవునితోను మాత్రమే మాట్లాడుకోవాలి.

  2. 1 కొరింథీయులకు 14:29సుమారు క్రీ.శ. 59

    ప్రవక్తల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి.

  3. 1 కొరింథీయులకు 14:30సుమారు క్రీ.శ. 59

    సమావేశంలో కూర్చున్నవారిలో ఎవరైనా దేవుని నుండి ప్రత్యక్షతను పొందితే, మాట్లాడుతున్నవారు తన మాటలు ఆపివేయాలి.

  4. 1 కొరింథీయులకు 14:31సుమారు క్రీ.శ. 59

    ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రోత్సహించబడేలా మీరందరు ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలి.

  5. 1 కొరింథీయులకు 14:32సుమారు క్రీ.శ. 59

    ప్రవక్తల ఆత్మ ప్రవక్తలకు లోబడి ఉండాలి.

  6. 1 కొరింథీయులకు 14:33సుమారు క్రీ.శ. 59

    అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు.

  7. 1 కొరింథీయులకు 14:34సుమారు క్రీ.శ. 59

    స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి. వారు మాట్లాడడానికి అనుమతి లేదు కాని ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా వారు వినయం కలిగి ఉండాలి.

  8. 1 కొరింథీయులకు 14:35సుమారు క్రీ.శ. 59

    వారు ఏదైనా తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర తమ భర్తలను అడగాలి; సంఘంలో మాట్లాడడం స్త్రీకి అవమానకరం.

  9. 1 కొరింథీయులకు 14:36సుమారు క్రీ.శ. 59

    దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా?

  10. 1 కొరింథీయులకు 14:37సుమారు క్రీ.శ. 59

    ఎవరైనా తాము దేవుని ప్రవక్తలమని లేదా ఆత్మ వరాలు గల వారమని తలిస్తే, నేను మీకు వ్రాసేది ప్రభువు ఆజ్ఞ అని వారు గ్రహించాలి.

  11. 1 కొరింథీయులకు 14:38సుమారు క్రీ.శ. 59

    కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు.

  12. 1 కొరింథీయులకు 14:39సుమారు క్రీ.శ. 59

    కాబట్టి నా సహోదరీ సహోదరులారా, ప్రవచించడాన్ని ఆసక్తితో కోరుకోండి, భాషలతో మాట్లాడడాన్ని ఆటంకపరచకండి.

  13. 1 కొరింథీయులకు 14:40సుమారు క్రీ.శ. 59

    అయితే సమస్తం మర్యాదగా క్రమంగా జరుగనివ్వండి.

  14. 1 కొరింథీయులకు 15:1సుమారు క్రీ.శ. 59

    సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.

  15. 1 కొరింథీయులకు 15:2సుమారు క్రీ.శ. 59

    నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు నమ్మడం వ్యర్థమే.

  16. 1 కొరింథీయులకు 15:3సుమారు క్రీ.శ. 59

    నేను పొందిన దానిని మొదట మీకు ప్రకటించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించారు.

  17. 1 కొరింథీయులకు 15:4సుమారు క్రీ.శ. 59

    లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, మూడవ దినాన సజీవునిగా లేచారు.

  18. 1 కొరింథీయులకు 15:5సుమారు క్రీ.శ. 59

    ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు.

  19. 1 కొరింథీయులకు 15:6సుమారు క్రీ.శ. 59

    దాని తర్వాత ఆయన ఒకేసారి అయిదువందల మందికి పైగా సహోదర సహోదరీలకు కనబడ్డారు. వారిలో కొందరు మరణించినా చాలామంది ఇంకా జీవించే ఉన్నారు.

  20. 1 కొరింథీయులకు 15:7సుమారు క్రీ.శ. 59

    ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు.

  21. 1 కొరింథీయులకు 15:8సుమారు క్రీ.శ. 59

    అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు.

  22. 1 కొరింథీయులకు 15:9సుమారు క్రీ.శ. 59

    అపొస్తలులందరిలో నేను అల్పమైనవాన్ని. నేను దేవుని సంఘాన్ని హింసించిన కారణంగా అపొస్తలుడని పిలువబడడానికి యోగ్యున్ని కాను.

  23. 1 కొరింథీయులకు 15:10సుమారు క్రీ.శ. 59

    అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే.

  24. 1 కొరింథీయులకు 15:11సుమారు క్రీ.శ. 59

    కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు.

  25. 1 కొరింథీయులకు 15:12సుమారు క్రీ.శ. 59

    మృతులలో నుండి క్రీస్తు సజీవంగా లేపబడ్డారని మేము ప్రకటిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు?