కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 15:13సుమారు క్రీ.శ. 59

    మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా.

  2. 1 కొరింథీయులకు 15:14సుమారు క్రీ.శ. 59

    అంతేకాదు క్రీస్తు లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే.

  3. 1 కొరింథీయులకు 15:15సుమారు క్రీ.శ. 59

    అంతేకాక, దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని దేవుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము అబద్ధ సాక్షులంగా కనబడుతున్నాము. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా.

  4. 1 కొరింథీయులకు 15:16సుమారు క్రీ.శ. 59

    మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు.

  5. 1 కొరింథీయులకు 15:17సుమారు క్రీ.శ. 59

    క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు.

  6. 1 కొరింథీయులకు 15:18సుమారు క్రీ.శ. 59

    అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే.

  7. 1 కొరింథీయులకు 15:19సుమారు క్రీ.శ. 59

    కేవలం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయంగా ఉంటాము.

  8. 1 కొరింథీయులకు 15:20సుమారు క్రీ.శ. 59

    ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు.

  9. 1 కొరింథీయులకు 15:21సుమారు క్రీ.శ. 59

    ఒక్క మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మృతుల పునరుత్థానం కూడ ఒక్క మనుష్యుని ద్వారానే వస్తుంది.

  10. 1 కొరింథీయులకు 15:22సుమారు క్రీ.శ. 59

    ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.

  11. 1 కొరింథీయులకు 15:23సుమారు క్రీ.శ. 59

    అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమ ఫలము. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు.

  12. 1 కొరింథీయులకు 15:24సుమారు క్రీ.శ. 59

    క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని అధికారాన్ని బలాన్ని నాశనం చేసి తండ్రియైన దేవునికి రాజ్యానికి అప్పగిస్తారు. అప్పుడు అంతం వస్తుంది.

  13. 1 కొరింథీయులకు 15:25సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు.

  14. 1 కొరింథీయులకు 15:26సుమారు క్రీ.శ. 59

    చివరిగా నశించే శత్రువు మరణం.

  15. 1 కొరింథీయులకు 15:27సుమారు క్రీ.శ. 59

    “దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు” అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా మిగిలిన వాటన్నిటిని ఆయన క్రింద ఉంచారని అర్థం.

  16. 1 కొరింథీయులకు 15:28సుమారు క్రీ.శ. 59

    ఆయన ఇది చేసినప్పుడు, దేవుడే అన్నిటిలో సర్వమై ఉండేలా, కుమారుడు తనకు సమస్తాన్ని లోబరచిన దేవునికి తానే లోబడతారు.

  17. 1 కొరింథీయులకు 15:29సుమారు క్రీ.శ. 59

    ఇప్పుడు పునరుత్థానం లేకపోతే, మరి మృతుల కోసం బాప్తిస్మం పొందినవారు ఏం చేస్తారు? మరణించినవారు ఎన్నటికి లేపబడకపోతే, ప్రజలు వారి కోసం ఎందుకు బాప్తిస్మం పొందుతున్నారు?

  18. 1 కొరింథీయులకు 15:30సుమారు క్రీ.శ. 59

    మరి అనుక్షణం మేము ఎందుకు ప్రాణభయంతో ఉండాలి?

  19. 1 కొరింథీయులకు 15:31సుమారు క్రీ.శ. 59

    సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసు క్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి రోజూ చస్తూనే ఉన్నాను.

  20. 1 కొరింథీయులకు 15:32సుమారు క్రీ.శ. 59

    కాని, కేవలం మానవరీతిగా ఎఫెసులోని మృగాలతో నేను పోరాడితే నాకు లాభమేంటి? ఒకవేళ మరణించినవారు లేపబడకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి, మనం తిని త్రాగుదాం.”

  21. 1 కొరింథీయులకు 15:33సుమారు క్రీ.శ. 59

    మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.”

  22. 1 కొరింథీయులకు 15:34సుమారు క్రీ.శ. 59

    మీరు నీతిప్రవర్తన కలిగి పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గురించి తెలియదు కాబట్టి, మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను.

  23. 1 కొరింథీయులకు 15:35సుమారు క్రీ.శ. 59

    “చనిపోయినవారు ఎలా లేపబడతారు? వారికి ఎలాంటి శరీరం ఉంటుంది?” అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

  24. 1 కొరింథీయులకు 15:36సుమారు క్రీ.శ. 59

    మూర్ఖుడా! నీవు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది చనిపోతేనే తప్ప మొలకెత్తదు.

  25. 1 కొరింథీయులకు 15:37సుమారు క్రీ.శ. 59

    గోధుమ గింజనైన, మరొక దానినైన నీవు భూమిలో నాటినప్పుడు విత్తనం మాత్రమే నాటావు గాని పెరిగిన మొక్క కాదు.