- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 2 కొరింథీయులకు 2:7సుమారు క్రీ.శ. 60
కాబట్టి మీరిక అతన్ని శిక్షించకుండా క్షమించి, ఓదార్చడం మంచిది, లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.
- 2 కొరింథీయులకు 2:8సుమారు క్రీ.శ. 60
అందుకే, మీరు అతని పట్ల మీ ప్రేమను మళ్ళీ రూఢిపరచుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
- 2 కొరింథీయులకు 2:9సుమారు క్రీ.శ. 60
మిమ్మల్ని పరీక్షించి, అన్ని విషయాల్లో మీరు విధేయత చూపుతారో లేదో తెలుసుకోవడానికి నేను అలా వ్రాశాను.
- 2 కొరింథీయులకు 2:10సుమారు క్రీ.శ. 60
మీరు క్షమించేవారిని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కోసమే క్రీస్తును బట్టి క్షమిస్తాను.
- 2 కొరింథీయులకు 2:11సుమారు క్రీ.శ. 60
సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.
- 2 కొరింథీయులకు 2:12సుమారు క్రీ.శ. 60
క్రీస్తు సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పని కోసం అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను.
- 2 కొరింథీయులకు 2:13సుమారు క్రీ.శ. 60
కాని నా సోదరుడు తీతును అక్కడ నాకు కనిపించకపోవడంతో నా మనస్సుకు నెమ్మది లేదు. కాబట్టి అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్లాను.
- 2 కొరింథీయులకు 2:14సుమారు క్రీ.శ. 60
కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.
- 2 కొరింథీయులకు 2:15సుమారు క్రీ.శ. 60
ఎందుకంటే, రక్షించబడుతున్నవారి మధ్య, నశించేవారి మధ్య మేము దేవునికి ఇష్టమైన క్రీస్తు పరిమళంగా ఉన్నాము.
- 2 కొరింథీయులకు 2:16సుమారు క్రీ.శ. 60
ఒకరికి మరణం తెచ్చే వాసనగా, మరొకరికి జీవం తెచ్చే వాసనగా ఉన్నాము. కాబట్టి, అలాంటి కార్యానికి యోగ్యులు ఎవరు?
- 2 కొరింథీయులకు 2:17సుమారు క్రీ.శ. 60
మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.
- 2 కొరింథీయులకు 3:1సుమారు క్రీ.శ. 60
మమ్మల్ని మేమే మరల మెచ్చుకోవడం ప్రారంభించామా? లేదా ఇతరుల్లా మీకు గాని మీ దగ్గరి నుండి గాని మాకు సిఫారసు పత్రికలు అవసరమా?
- 2 కొరింథీయులకు 3:2సుమారు క్రీ.శ. 60
మా హృదయాల మీద వ్రాయబడి, మనుష్యులందరు తెలుసుకుని చదవాల్సిన మా పత్రిక మీరే.
- 2 కొరింథీయులకు 3:3సుమారు క్రీ.శ. 60
రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయక మానవ హృదయాలు అనే పలకల మీద జీవంగల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరేనని, మా పరిచర్య ఫలితం మీరేనని మీరు తెలియపరుస్తున్నారు.
- 2 కొరింథీయులకు 3:4సుమారు క్రీ.శ. 60
ఇలాంటి నమ్మకం క్రీస్తు ద్వారా దేవునిపై మాకుంది.
- 2 కొరింథీయులకు 3:5సుమారు క్రీ.శ. 60
మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది.
- 2 కొరింథీయులకు 3:6సుమారు క్రీ.శ. 60
వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.
- 2 కొరింథీయులకు 3:7సుమారు క్రీ.శ. 60
మరణాన్ని తెచ్చే పరిచర్య రాళ్లమీద అక్షరాలలో చెక్కబడినా, అది మహిమతో వచ్చింది. మోషే ముఖంపై ప్రకాశించిన మహిమ శాశ్వతమైనది కాకపోయినా ఇశ్రాయేలీయులు దాన్ని నేరుగా చూడలేకపోయారు.
- 2 కొరింథీయులకు 3:8సుమారు క్రీ.శ. 60
అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమకరంగా ఉంటుంది?
- 2 కొరింథీయులకు 3:9సుమారు క్రీ.శ. 60
శిక్షను తెచ్చే పరిచర్య మహిమ కలిగి ఉంటే, నీతిమంతులుగా చేసే పరిచర్య ఇంకా ఎంత అధిక మహిమ కలిగి ఉంటుందో!
- 2 కొరింథీయులకు 3:10సుమారు క్రీ.శ. 60
అందుకే, ఇప్పటి అత్యున్నతమైన మహిమతో పోల్చినప్పుడు ఇప్పటివరకు మహిమకరంగా ఉన్నవేవి మహిమగా ఉండవు.
- 2 కొరింథీయులకు 3:11సుమారు క్రీ.శ. 60
ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా!
- 2 కొరింథీయులకు 3:12సుమారు క్రీ.శ. 60
కాబట్టి, మాకు ఇలాంటి నిరీక్షణ ఉంది, అందుకే మేము ఇంత ధైర్యంతో ఉన్నాము.
- 2 కొరింథీయులకు 3:13సుమారు క్రీ.శ. 60
మేము మోషేలాంటి వారం కాదు, తరిగిపోతున్న దాని అంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడకుండ మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.
- 2 కొరింథీయులకు 3:14సుమారు క్రీ.శ. 60
నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికీ వారి మనస్సులకు ఆ ముసుగు అలాగే ఉంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది.