కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 కొరింథీయులకు 3:15సుమారు క్రీ.శ. 60

    నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి హృదయాల మీద ముసుగు ఉంది.

  2. 2 కొరింథీయులకు 3:16సుమారు క్రీ.శ. 60

    కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది.

  3. 2 కొరింథీయులకు 3:17సుమారు క్రీ.శ. 60

    ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది.

  4. 2 కొరింథీయులకు 3:18సుమారు క్రీ.శ. 60

    కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.

  5. 2 కొరింథీయులకు 4:1సుమారు క్రీ.శ. 60

    దేవుని కనికరాన్ని బట్టి ఈ పరిచర్యను మేము కలిగి ఉన్నాము, కాబట్టి మేము ధైర్యాన్ని కోల్పోము.

  6. 2 కొరింథీయులకు 4:2సుమారు క్రీ.శ. 60

    అయితే సిగ్గుపడాల్సిన రహస్యమైన పనులను విడిచిపెట్టాం; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వంకరగా బోధించకుండా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము.

  7. 2 కొరింథీయులకు 4:3సుమారు క్రీ.శ. 60

    ఒకవేళ మేము బోధించే సువార్త ఎవరికైనా మురుగు చేయబడి ఉంటే అది నశించేవారికి మాత్రమే.

  8. 2 కొరింథీయులకు 4:4సుమారు క్రీ.శ. 60

    దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండ ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది.

  9. 2 కొరింథీయులకు 4:5సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే మా గురించి మేము ప్రకటించడం లేదు కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ సేవకులమని ప్రకటిస్తున్నాము.

  10. 2 కొరింథీయులకు 4:6సుమారు క్రీ.శ. 60

    “చీకటి నుండి వెలుగు ప్రకాశించును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింపజేశారు.

  11. 2 కొరింథీయులకు 4:7సుమారు క్రీ.శ. 60

    అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవునిదే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగి ఉన్నాము.

  12. 2 కొరింథీయులకు 4:8సుమారు క్రీ.శ. 60

    మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు;

  13. 2 కొరింథీయులకు 4:9సుమారు క్రీ.శ. 60

    హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు.

  14. 2 కొరింథీయులకు 4:10సుమారు క్రీ.శ. 60

    మా శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని ఆయన మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు మోస్తునే ఉన్నాము.

  15. 2 కొరింథీయులకు 4:11సుమారు క్రీ.శ. 60

    మా క్షయమైన శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాము.

  16. 2 కొరింథీయులకు 4:12సుమారు క్రీ.శ. 60

    కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది.

  17. 2 కొరింథీయులకు 4:13సుమారు క్రీ.శ. 60

    “నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడాను” అని వ్రాయబడి ఉంది. అదే విశ్వాసపు ఆత్మ మాలో కూడా ఉంది, కాబట్టి మేము కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాము.

  18. 2 కొరింథీయులకు 4:14సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే, ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్మల్ని కూడా లేవనెత్తి మీతో పాటు తన ఎదుట నిలబెడతారని మాకు తెలుసు.

  19. 2 కొరింథీయులకు 4:15సుమారు క్రీ.శ. 60

    ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.

  20. 2 కొరింథీయులకు 4:16సుమారు క్రీ.శ. 60

    కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.

  21. 2 కొరింథీయులకు 4:17సుమారు క్రీ.శ. 60

    మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.

  22. 2 కొరింథీయులకు 4:18సుమారు క్రీ.శ. 60

    కాబట్టి కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.

  23. 2 కొరింథీయులకు 5:1సుమారు క్రీ.శ. 60

    మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.

  24. 2 కొరింథీయులకు 5:2సుమారు క్రీ.శ. 60

    ఈలోగా పరలోకం నుండి వచ్చే మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ మనం మూలుగుతున్నాము.

  25. 2 కొరింథీయులకు 5:3సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము.