కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 కొరింథీయులకు 6:8సుమారు క్రీ.శ. 60

    ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;

  2. 2 కొరింథీయులకు 6:9సుమారు క్రీ.శ. 60

    తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు;

  3. 2 కొరింథీయులకు 6:10సుమారు క్రీ.శ. 60

    దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాము.

  4. 2 కొరింథీయులకు 6:11సుమారు క్రీ.శ. 60

    కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం.

  5. 2 కొరింథీయులకు 6:12సుమారు క్రీ.శ. 60

    మా అభిమానాన్ని మీ నుండి మేము తగ్గించడం లేదు, కానీ మా నుండి మిమ్మల్ని మీరే దూరం ఉంచుతున్నారు.

  6. 2 కొరింథీయులకు 6:13సుమారు క్రీ.శ. 60

    నా బిడ్డలుగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను, మాలా మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరవండి.

  7. 2 కొరింథీయులకు 6:14సుమారు క్రీ.శ. 60

    అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి?

  8. 2 కొరింథీయులకు 6:15సుమారు క్రీ.శ. 60

    క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి?

  9. 2 కొరింథీయులకు 6:16సుమారు క్రీ.శ. 60

    దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు: “నేను వారితో నివసిస్తాను వారి మధ్య నడుస్తాను, నేను వారి దేవునిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”

  10. 2 కొరింథీయులకు 6:17సుమారు క్రీ.శ. 60

    కాబట్టి, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన దానిని తాకకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.

  11. 2 కొరింథీయులకు 6:18సుమారు క్రీ.శ. 60

    ఇంకా, “నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు, అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”

  12. 2 కొరింథీయులకు 7:1సుమారు క్రీ.శ. 60

    ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.

  13. 2 కొరింథీయులకు 7:2సుమారు క్రీ.శ. 60

    మీ హృదయంలో మాకు చోటియ్యండి. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని పాడుచేయలేదు, ఎవరినీ మోసగించలేదు

  14. 2 కొరింథీయులకు 7:3సుమారు క్రీ.శ. 60

    మిమ్మల్ని గద్దించాలనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం లేదు; ఎందుకంటే, జీవించినా మరణించినా మేము మీతో ఉండేలా మా హృదయాల్లో మీకు ప్రత్యేక స్థానం ఉందని నేను ముందే చెప్పాను.

  15. 2 కొరింథీయులకు 7:4సుమారు క్రీ.శ. 60

    ఎంతో నిష్కపటంగా నేను మీకు చెప్పాను; మీ గురించి నేను చాలా గర్వపడతాను. ఎంతో ధైర్యపరచబడతాను; మా శ్రమలన్నింటిలో నా ఆనందానికి హద్దులు లేవు.

  16. 2 కొరింథీయులకు 7:5సుమారు క్రీ.శ. 60

    మాసిదోనియాకు చేరిన తర్వాత కూడా మాకు విశ్రాంతి లేదు, అయితే ఎక్కడకు వెళ్లినా తీవ్రమైన ఆందోళనలు, బయట కలహాలు లోపల భయాలు.

  17. 2 కొరింథీయులకు 7:6సుమారు క్రీ.శ. 60

    కానీ, బలహీన హృదయులను ధైర్యపరచే దేవుడే తీతు రాక ద్వారా మమ్మల్ని ఓదార్చాడు.

  18. 2 కొరింథీయులకు 7:7సుమారు క్రీ.శ. 60

    అతని రాక వల్లనే కాదు కాని, మీరు అతనికిచ్చిన ఆదరణ వల్ల కూడా. నన్ను చూడాలనే మీ కోరిక గురించి, మీ లోతైన దుఃఖం గురించి, నా పట్ల మీకున్న అభిమానం గురించి అతడు మాకు చెప్పాడు. అందుకు నేను ఎంతో ఎక్కువగా ఆనందించాను.

  19. 2 కొరింథీయులకు 7:8సుమారు క్రీ.శ. 60

    నేను వ్రాసిన పత్రిక మీకు బాధ కలిగించినా, దానికి నేను బాధపడను. ఆ పత్రిక మీకు బాధ కలిగించిందని తెలిసి నేను చింతించినా, అది కొంతకాలం వరకే.

  20. 2 కొరింథీయులకు 7:9సుమారు క్రీ.శ. 60

    మీకు దుఃఖం కలిగించినందుకు కాదు, మీ విచారం మీ పశ్చాత్తాపానికి దారితీసినందుకు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే, మా వలన మీరు ఏ విధంగా కూడా నష్టపోకూడదని ఉండడానికి దేవుని చిత్తప్రకారం మీరు విచారించారు.

  21. 2 కొరింథీయులకు 7:10సుమారు క్రీ.శ. 60

    దైవికమైన విచారం, రక్షణ కలిగించే పశ్చాత్తాపానికి దారి తీస్తుంది ఏ చింత ఉండదు, కాని లోకసంబంధమైన విచారం మరణాన్ని తెస్తుంది.

  22. 2 కొరింథీయులకు 7:11సుమారు క్రీ.శ. 60

    దైవికమైన విచారం మీలో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఎలాంటి ఆతురతను, ఆసక్తిని, ఆగ్రహాన్ని, భయాన్ని, అభిలాషను, శ్రద్ధను, న్యాయం జరిగించడానికి ఎలాంటి సంసిద్ధతను పుట్టిస్తుందో చూడండి. ప్రతిసారి ఈ విషయంలో మీరు నిర్దోషులని మీకు మీరే నిరూపించుకున్నారు.

  23. 2 కొరింథీయులకు 7:12సుమారు క్రీ.శ. 60

    కాబట్టి నేను మీకు పత్రిక వ్రాసినప్పటికి, తప్పు చేసిన వారి గురించి గాని బాధించబడినవారి గురించి గాని వ్రాయలేదు. అయితే మీరు మా పట్ల ఎలా శ్రద్ధ చూపించారో దాన్ని దేవుని ముందు మీరు చూడాలని వ్రాశాను.

  24. 2 కొరింథీయులకు 7:13సుమారు క్రీ.శ. 60

    వీటన్నిటిని బట్టి మేము ధైర్యపరచబడ్డాము. మాకు ఈ ఆదరణ కలిగినపుడు, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన నెమ్మది పొందినందుకు అతడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసి మరి ఎక్కువగా సంతోషించాము.

  25. 2 కొరింథీయులకు 7:14సుమారు క్రీ.శ. 60

    మిమ్మల్ని అతని ముందు చాలా పొగిడాను, మీరు నన్ను సిగ్గుపరచలేదు, మీకు ఎప్పుడు నిజమే చెప్పాము. అలాగే తీతు ముందు మేము చేసిన పొగడ్తలు వాస్తవమైనవే అని నిరూపించబడ్డాయి.