కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 కొరింథీయులకు 7:15సుమారు క్రీ.శ. 60

    కాబట్టి మీరందరు విధేయత చూపించి, భయంతో వణుకుతో అతన్ని మీరు ఎలా చేర్చుకున్నారో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీమీద అతనికున్న అభిమానం అధికమవుతుంది.

  2. 2 కొరింథీయులకు 7:16సుమారు క్రీ.శ. 60

    ప్రతి విషయంలో మీలో నాకు పూర్తి నమ్మకం ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను.

  3. 2 కొరింథీయులకు 8:1సుమారు క్రీ.శ. 60

    సహోదరీ సహోదరులారా, మాసిదోనియా ప్రాంతంలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము.

  4. 2 కొరింథీయులకు 8:2సుమారు క్రీ.శ. 60

    చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు.

  5. 2 కొరింథీయులకు 8:3సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను.

  6. 2 కొరింథీయులకు 8:4సుమారు క్రీ.శ. 60

    ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు.

  7. 2 కొరింథీయులకు 8:5సుమారు క్రీ.శ. 60

    వారు మా అంచనాలను అధిగమించారు: మొదటిగా తమను తాము ప్రభువుకు అర్పించుకున్నారు, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మాకు కూడ తమను అర్పించుకున్నారు.

  8. 2 కొరింథీయులకు 8:6సుమారు క్రీ.శ. 60

    కాబట్టి తీతు ఈ దాతృత్వ పనిని గతంలో ప్రారంభించినట్లే మీ వైపు నుండి కూడా దానిని పూర్తి చేయమని అతన్ని వేడుకున్నాము.

  9. 2 కొరింథీయులకు 8:7సుమారు క్రీ.శ. 60

    అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో ఎలా వృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా వృద్ధిచెందేలా చూసుకోండి.

  10. 2 కొరింథీయులకు 8:8సుమారు క్రీ.శ. 60

    ఆజ్ఞాపించి మీకు చెప్పడం లేదు, కాని సహాయం చేయడంలో ఇతరుల ఆసక్తితో పోల్చి మీ ప్రేమ ఎంత నిజమైనదో పరీక్షించాలనుకుంటున్నాను.

  11. 2 కొరింథీయులకు 8:9సుమారు క్రీ.శ. 60

    మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.

  12. 2 కొరింథీయులకు 8:10సుమారు క్రీ.శ. 60

    ఈ విషయంలో మీకు ఏది మంచిదో నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. గత ఏడాది మీరు ఇవ్వడంలోనే కాదు అలా చేయాలనే ఆసక్తిలో కూడా మొదటివారిగా ఉన్నారు.

  13. 2 కొరింథీయులకు 8:11సుమారు క్రీ.శ. 60

    కాబట్టి ఆ పనిని ముగించండి, అప్పుడు చేయాలనే మీ ఆసక్తిని, మీ సామర్థ్యాన్ని బట్టి దాన్ని పూర్తి చేయడం ద్వారా సరిపోల్చవచ్చు.

  14. 2 కొరింథీయులకు 8:12సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే, ఇవ్వాలనే ఆసక్తి మీకు ఉంటే, మీ సామర్థ్యాన్ని మించి కాకుండా మీకు ఉన్నదానిలో ఇచ్చే మీ కానుక అంగీకరించదగింది.

  15. 2 కొరింథీయులకు 8:13సుమారు క్రీ.శ. 60

    మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక.

  16. 2 కొరింథీయులకు 8:14సుమారు క్రీ.శ. 60

    ప్రస్తుత సమయంలో మీ సమృద్ధి వారికవసరమైనది సరఫరా చేస్తుంది, అలాగే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధి మీకు అవసరమైనది సరఫరా చేస్తుంది. సమానత్వమే లక్ష్యం,

  17. 2 కొరింథీయులకు 8:15సుమారు క్రీ.శ. 60

    ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు” అని వ్రాయబడి ఉంది.

  18. 2 కొరింథీయులకు 8:16సుమారు క్రీ.శ. 60

    మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు.

  19. 2 కొరింథీయులకు 8:17సుమారు క్రీ.శ. 60

    తీతు మా మనవిని అంగీకరించడమే కాకుండా, అతడు ఎంతో ఉత్సాహంతో తన ఇష్టంతో మీ దగ్గరకు వస్తున్నాడు.

  20. 2 కొరింథీయులకు 8:18సుమారు క్రీ.శ. 60

    సువార్త పరిచర్య చేయడంలో సంఘాలన్నింటిలో ప్రసిద్ధి చెందిన సోదరుని కూడా అతనితో పంపుతున్నాను.

  21. 2 కొరింథీయులకు 8:19సుమారు క్రీ.శ. 60

    అంతేకాక, కేవలం ప్రభువును మహిమపరచడానికి, సహాయం చేయడంలో మాకున్న ఆసక్తిని చూపించడానికి మేము చేస్తున్న దానిలో భాగంగా కానుకలను తీసుకెళ్తున్నప్పుడు మాతో పాటు ఉండడానికి సంఘాలు అతన్ని ఏర్పరచుకున్నారు.

  22. 2 కొరింథీయులకు 8:20సుమారు క్రీ.శ. 60

    దాతృత్వంతో ఇచ్చిన కానుకలను మేము ఉపయోగించే విధానం గురించి ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతున్నాము.

  23. 2 కొరింథీయులకు 8:21సుమారు క్రీ.శ. 60

    కేవలం ప్రభువు దృష్టిలో మాత్రమే గాక, మనుష్యుల దృష్టికి కూడా మంచిది అనిపించిందే చేయాలని మేము బాధలు అనుభవిస్తున్నాము.

  24. 2 కొరింథీయులకు 8:22సుమారు క్రీ.శ. 60

    అంతేకాక, మా సహోదరున్ని వారితో కూడా పంపుతున్నాము. అతడు ఆసక్తి కలిగినవాడని మాకు అనేకసార్లు రుజువుచేసి చూపించాడు. మీపై అతనికున్న నమ్మకాన్ని బట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆసక్తిగా ఉన్నాడు.

  25. 2 కొరింథీయులకు 8:23సుమారు క్రీ.శ. 60

    ఇక తీతు అయితే నా జతపనివాడు మీ మధ్యలో తోటి పనివాడు; మా సహోదరులైతే సంఘాలకు ప్రతినిధులు క్రీస్తుకు ఘనత తెచ్చేవారు.