కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 కొరింథీయులకు 10:10సుమారు క్రీ.శ. 60

    “ఇతని పత్రికలు గొప్పగా శక్తివంతంగా ఉంటాయి కాని వ్యక్తిగా అతడు బలహీనుడు అతని మాటలు విలువలేనివి” అని కొందరు అన్నారు.

  2. 2 కొరింథీయులకు 10:11సుమారు క్రీ.శ. 60

    మేము లేనప్పుడు పత్రికల్లో ఏమి వ్రాసామో మేము అక్కడ ఉన్నప్పుడు మేము అదే చేస్తామని అలాంటివారు గ్రహించాలి.

  3. 2 కొరింథీయులకు 10:12సుమారు క్రీ.శ. 60

    తమను తామే పొగడుకునే వారితో జత చేరడానికి గాని పోల్చుకోడానికి గాని మాకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వారు తమను తామే బేరీజు వేసుకుంటూ తమలో తామే పోల్చుకుంటారో వారు తెలివిలేనివారని అర్థము.

  4. 2 కొరింథీయులకు 10:13సుమారు క్రీ.శ. 60

    మేమైతే పరిమితికి మించి పొగడుకోం, అయినా, దేవుడు మాకు కొలిచి ఇచ్చిన హద్దుల్లోనే ఉన్నాము, ఆ హద్దులో మీరు కూడా ఉన్నారు.

  5. 2 కొరింథీయులకు 10:14సుమారు క్రీ.శ. 60

    క్రీస్తు సువార్తతో మేము మీ దగ్గరకు వచ్చాం కాబట్టి మీ దగ్గరకు మేము రానట్లుగానే మేము పొగడుకోవడంలో మా హద్దులు మీరడం లేదు.

  6. 2 కొరింథీయులకు 10:15సుమారు క్రీ.శ. 60

    ఇతరులు చేసిన పనుల గురించి మా హద్దులు దాటి మేము గొప్పలు చెప్పము. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతూ, మీ మధ్యలో మేము పని చేయాల్సిన ప్రాంతం విస్తరించాలని మా నిరీక్షణ.

  7. 2 కొరింథీయులకు 10:16సుమారు క్రీ.శ. 60

    అప్పుడు మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా మేము ఈ సువార్తను బోధించగలము. కాబట్టి వేరొకరి ప్రాంతంలో ఇంతకుముందే జరిగిన పని గురించి మేము పొగడుకోవాలని కోరడంలేదు.

  8. 2 కొరింథీయులకు 10:17సుమారు క్రీ.శ. 60

    అయితే, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి.”

  9. 2 కొరింథీయులకు 10:18సుమారు క్రీ.శ. 60

    తనను తానే మెచ్చుకొనేవారు యోగ్యులు కారు గాని, ప్రభువు మెచ్చుకొనేవారే యోగ్యులు.

  10. 2 కొరింథీయులకు 11:1సుమారు క్రీ.శ. 60

    నేను కొంత అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలని ఆశిస్తున్నాను. అవును, దయచేసి నన్ను సహించండి!

  11. 2 కొరింథీయులకు 11:2సుమారు క్రీ.శ. 60

    దైవికమైన ఆసక్తిని మీ పట్ల నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే, మిమ్మల్ని నేను క్రీస్తు అనే ఏకైక భర్తకు ప్రధానం చేశాను, కాబట్టి పవిత్రమైన కన్యగా మిమ్మల్ని ఆయనకు అప్పగించాలి.

  12. 2 కొరింథీయులకు 11:3సుమారు క్రీ.శ. 60

    అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను.

  13. 2 కొరింథీయులకు 11:4సుమారు క్రీ.శ. 60

    ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ప్రకటించిన యేసును గాక వేరొక యేసును ప్రకటించినా, లేదా మీరు పొందిన ఆత్మకు విరుద్ధమైన వేరొక ఆత్మను మీరు పొందినా, లేదా మీరు అంగీకరించింది కాకుండా వేరొక సువార్తను అంగీకరించినా మీరు సుళువుగానే సహిస్తున్నారు.

  14. 2 కొరింథీయులకు 11:5సుమారు క్రీ.శ. 60

    “ఈ గొప్ప అపొస్తలుల” కంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను.

  15. 2 కొరింథీయులకు 11:6సుమారు క్రీ.శ. 60

    మాట్లాడడంలో నాకు నేర్పు లేకపోవచ్చు కాని జ్ఞానంలో కాదు. అన్ని విధాలుగా మేము దీన్ని మీకు పూర్తిగా స్పష్టం చేశాము.

  16. 2 కొరింథీయులకు 11:7సుమారు క్రీ.శ. 60

    దేవుని సువార్తను మీకు ఉచితంగా బోధించి, మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి నన్ను నేను తగ్గించుకొని పాపం చేశానా?

  17. 2 కొరింథీయులకు 11:8సుమారు క్రీ.శ. 60

    మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను.

  18. 2 కొరింథీయులకు 11:9సుమారు క్రీ.శ. 60

    అంతేకాక నేను మీతో ఉన్నప్పుడు నాకు సహాయం అవసరమైతే నేను ఎవరికి భారంగా లేను, ఎందుకంటే, మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులే నాకు అవసరమైనవన్నీ అందించారు. నేను మీకు భారం కాకుండా ఎలా ఉన్నానో ఇకముందు కూడా అలాగే ఉంటాను.

  19. 2 కొరింథీయులకు 11:10సుమారు క్రీ.శ. 60

    నాలో క్రీస్తు సత్యం ఉన్నందుకు, అకాయ ప్రాంతాల్లో నేనిలా గర్వపడకుండ ఎవరు ఆపలేరు.

  20. 2 కొరింథీయులకు 11:11సుమారు క్రీ.శ. 60

    ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు!

  21. 2 కొరింథీయులకు 11:12సుమారు క్రీ.శ. 60

    గర్వించడానికి కారణం వెదికేవారు తాము గర్వించే వాటిలో మాతో సమానంగా ఉన్నామని వారు ఎంచుకోవడానికి అవకాశం లేకుండా చేయడానికి ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానో అదే చేయడం కొనసాగిస్తాను.

  22. 2 కొరింథీయులకు 11:13సుమారు క్రీ.శ. 60

    అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు.

  23. 2 కొరింథీయులకు 11:14సుమారు క్రీ.శ. 60

    ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు.

  24. 2 కొరింథీయులకు 11:15సుమారు క్రీ.శ. 60

    కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.

  25. 2 కొరింథీయులకు 11:16సుమారు క్రీ.శ. 60

    నేను అవివేకినని ఎవరు అనుకోవద్దని మరల చెప్తున్నాను; ఒకవేళ మీరు అలా భావిస్తే అవివేకంగానైనా మీరు నన్ను చేర్చుకోండి అప్పుడు నేను కొంచెం గొప్ప చెప్పుకుంటాను.