circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 2 కొరింథీయులకు 12:9సుమారు క్రీ.శ. 60
అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.
- 2 కొరింథీయులకు 12:10సుమారు క్రీ.శ. 60
అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.
- 2 కొరింథీయులకు 12:11సుమారు క్రీ.శ. 60
నన్ను నేనే బుద్ధిహీనునిగా చేసుకున్నాను, కాని మీరే నన్ను బలవంతం చేశారు. నిజానికి మీరు నన్ను మెచ్చుకోవల్సింది, ఎందుకంటే, నేను వ్యర్థుడనే అయినా మీ “శ్రేష్ఠమైన అపొస్తలుల” కంటే ఏ విషయంలో తక్కువ వాడను కాను.
- 2 కొరింథీయులకు 12:12సుమారు క్రీ.శ. 60
అపొస్తలుల సూచకక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు పూర్తి సహనంతో నా వల్ల మీ మధ్య జరిగాయి.
- 2 కొరింథీయులకు 12:13సుమారు క్రీ.శ. 60
నేనెప్పుడు మీకు భారంగా లేను అనేది తప్ప ఇతర సంఘాల కంటే మీరు ఎలా తక్కువ అవుతారు? ఈ తప్పును బట్టి నన్ను క్షమించండి!
- 2 కొరింథీయులకు 12:14సుమారు క్రీ.శ. 60
నేను మూడవసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీరే తప్ప మీ ధనం కాదు. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు తల్లిదండ్రులే పిల్లల కోసం పొదుపు చేసి ఉంచాలి.
- 2 కొరింథీయులకు 12:15సుమారు క్రీ.శ. 60
కాబట్టి నాకు కలిగినదంత మీ ఆత్మల కోసం చాలా సంతోషంగా ఖర్చుచేస్తాను, అంతేకాదు నన్ను నేను కూడా మీ కోసం ఖర్చు చేసుకుంటాను; నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా?
- 2 కొరింథీయులకు 12:16సుమారు క్రీ.శ. 60
అదలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తిగా మాయ చేసి మిమ్మల్ని పట్టుకున్నాను అని అంటారేమో!
- 2 కొరింథీయులకు 12:17సుమారు క్రీ.శ. 60
నేను మీ దగ్గరకు పంపినవారి ద్వారా మిమ్మల్ని మోసం చేసి ఏమైనా సంపాదించుకున్నానా?
- 2 కొరింథీయులకు 12:18సుమారు క్రీ.శ. 60
తీతును మీ దగ్గరకు వెళ్లమని వేడుకున్నాను. అతనితో పాటు మా సహోదరున్ని కూడ పంపాను. తీతు మిమ్మల్ని దోచుకోలేదు కదా? మేము ఒకే ఆత్మను కలిగి ఒకే అడుగుజాడల్లో నడువలేదా?
- 2 కొరింథీయులకు 12:19సుమారు క్రీ.శ. 60
ఇంతవరకు మేము మీతో మా పక్షంగా వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టికి క్రీస్తులో ఉన్న వారిలా మేము మాట్లాడుతున్నాము; మిత్రులారా! మేము చేసే ప్రతిదీ మిమ్మల్ని బలపరచడానికే.
- 2 కొరింథీయులకు 12:20సుమారు క్రీ.శ. 60
ఎందుకంటే నేను వచ్చినపుడు నేను కోరుకున్నట్లుగా మీరు ఉండకపోవచ్చు, అలాగే మీరు కోరుకున్నట్లుగా నేను ఉండకపోవచ్చు. అక్కడ కలహాలు, అసూయలు, క్రోధాలు, కక్షలు, వదంతులు, గుసగుసలు, గర్వం, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాను.
- 2 కొరింథీయులకు 12:21సుమారు క్రీ.శ. 60
మరల నేను వచ్చినప్పుడు దేవుడు మీ ముందు నన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తాడేమోనని భయపడుతున్నాను, అంతేగాక గతంలో పాపం చేసి జరిగించిన అపవిత్రత, లైంగిక పాపం, పోకిరి చేష్టల గురించి పశ్చాత్తాపం చెందని వారి గురించి కూడ నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను.
- 2 కొరింథీయులకు 13:1సుమారు క్రీ.శ. 60
నేను మీ దగ్గరకు రావడం ఇది మూడవసారి. “ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద ప్రతి విషయం నిర్ధారించబడాలి.”
- 2 కొరింథీయులకు 13:2సుమారు క్రీ.శ. 60
నేను రెండవసారి మీ దగ్గర ఉన్నపుడే మిమ్మల్ని హెచ్చరించాను, ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా మళ్ళీ చెప్పేదేమంటే నేను మళ్ళీ వచ్చినపుడు గతంలో పాపం చేసిన వారిని ఇతరులను ఎవరిని విడిచిపెట్టను.
- 2 కొరింథీయులకు 13:3సుమారు క్రీ.శ. 60
క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నారని మీరు రుజువులు అడిగారు. ఆయన మీ వ్యవహారంలో బలహీనుడు కాడు, మీలో ఆయన బలవంతుడు.
- 2 కొరింథీయులకు 13:4సుమారు క్రీ.శ. 60
బలం లేనివానిగా ఆయన సిలువ వేయబడ్డారు కాని, దేవుని శక్తినిబట్టి ఆయన జీవిస్తున్నారు. అలాగే మేము ఆయనలో బలహీనులం, అయినా మేము మీతో వ్యవహరించే విషయంలో దేవుని శక్తినిబట్టి ఆయనతో కూడ జీవిస్తున్నాము.
- 2 కొరింథీయులకు 13:5సుమారు క్రీ.శ. 60
మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి; మీరు పరీక్షలో ఓడిపోకపోతే తప్ప యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలియదా?
- 2 కొరింథీయులకు 13:6సుమారు క్రీ.శ. 60
కాని మేము పరీక్షలో ఓడిపోలేదని మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను.
- 2 కొరింథీయులకు 13:7సుమారు క్రీ.శ. 60
మీరు ఏ తప్పులు చేయకూడదని, మేము పరీక్షలో నిలబడినట్లు ప్రజలు చూడాలని కాదు గాని, మేము ఓడిపోయినట్లుగా కనిపించినా మీరు మాత్రం సరియైన దానినే చేయాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము.
- 2 కొరింథీయులకు 13:8సుమారు క్రీ.శ. 60
కాబట్టి మేము సత్యానికి విరోధంగా ఏమి చేయలేము, సత్యం కోసం మాత్రమే చేస్తాము.
- 2 కొరింథీయులకు 13:9సుమారు క్రీ.శ. 60
మేము బలహీనంగా ఉన్నా మీరు బలంగా ఉంటేనే మాకు సంతోషం. మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థిస్తున్నాము.
- 2 కొరింథీయులకు 13:10సుమారు క్రీ.శ. 60
కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ పట్ల నేను కఠినంగా ఉండాల్సిన అవసరం లేకుండ ఇప్పుడే ఇవన్నీ మీకు వ్రాస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని పడద్రోయడానికి కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు నాకు అధికారాన్ని ఇచ్చారు.
- 2 కొరింథీయులకు 13:11సుమారు క్రీ.శ. 60
చివరిగా సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. సమాధానం కలిగి జీవించండి. ప్రేమ సమాధానాలకు కర్తయైన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.
- 2 కొరింథీయులకు 13:12సుమారు క్రీ.శ. 60
ఒకరిని ఒకరు పవిత్రమైన ముద్దుతో శుభాలు చెప్పుకోండి.