circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 2 కొరింథీయులకు 11:17సుమారు క్రీ.శ. 60
ఆత్మవిశ్వాసం బట్టి గొప్ప చెప్పడంలో నేను ప్రభువులా మాట్లాడడం లేదు కాని అవివేకిగానే మాట్లాడుతున్నాను.
- 2 కొరింథీయులకు 11:18సుమారు క్రీ.శ. 60
ఈ లోకరీతిగా అనేకమంది గొప్ప చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా గొప్ప చెప్పుకుంటాను.
- 2 కొరింథీయులకు 11:19సుమారు క్రీ.శ. 60
మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు.
- 2 కొరింథీయులకు 11:20సుమారు క్రీ.శ. 60
నిజానికి, మిమ్మల్ని ఎవరైనా బానిసలుగా చేసినా, మోసం చేసినా, లేదా మిమ్మల్ని చిక్కుల్లో ఇరికించినా, మిమ్మల్ని ముఖంపై కొట్టినా మీరు సహిస్తారు.
- 2 కొరింథీయులకు 11:21సుమారు క్రీ.శ. 60
ఆ విషయంలో మేమెంతో బలహీనులమని నేను సిగ్గుతో ఒప్పుకుంటున్నాను. అయితే ఎవరైనా దేని గురించైనా గొప్పలు చెప్పుకోడానికి ధైర్యం చేస్తే దాని గురించి నేను కూడా గొప్పలు చెప్పుకోడానికి ధైర్యం చేస్తాను, నేను అవివేకిగా మాట్లాడుతున్నాను.
- 2 కొరింథీయులకు 11:22సుమారు క్రీ.శ. 60
వారు హెబ్రీయులా? నేను కూడా. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా. వారు అబ్రాహాము సంతతి వారా? నేను కూడా.
- 2 కొరింథీయులకు 11:23సుమారు క్రీ.శ. 60
వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారికంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను. ఎక్కువసార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.
- 2 కొరింథీయులకు 11:24సుమారు క్రీ.శ. 60
యూదులచేత అయిదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాను.
- 2 కొరింథీయులకు 11:25సుమారు క్రీ.శ. 60
మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, మూడుసార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను.
- 2 కొరింథీయులకు 11:26సుమారు క్రీ.శ. 60
తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, తోటి యూదుల వల్ల ఆపదలు, యూదేతరుల వల్ల ఆపదలు, పట్టణాల్లో, అడవుల్లో, సముద్రాల మీద ఆపదల్లో పడ్డాను; ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను.
- 2 కొరింథీయులకు 11:27సుమారు క్రీ.శ. 60
నేను ప్రయాసపడ్డాను కష్టపడ్డాను, తరచూ నిద్ర లేకుండా ఉండేవాన్ని; ఆకలి దాహం నాకు తెలుసు, అనేకసార్లు ఆహారం లేకుండా ఉన్నాను; చలితో, వస్త్రాలు లేకుండా ఉన్నాను.
- 2 కొరింథీయులకు 11:28సుమారు క్రీ.శ. 60
అన్నిటికంటే మించి సంఘాలన్నిటి గురించిన చింత అనుదినం నాకు కలుగుతుంది.
- 2 కొరింథీయులకు 11:29సుమారు క్రీ.శ. 60
ఎవరైనా బలహీనంగా ఉంటే, నేను బలహీనంగా ఉండనా? ఎవరైనా పాపంలో నడిస్తే, నా హృదయం మండదా?
- 2 కొరింథీయులకు 11:30సుమారు క్రీ.శ. 60
ఒకవేళ నేను గర్వించాలంటే, నా బలహీనతలను చూపించే వాటిలోనే గర్విస్తాను.
- 2 కొరింథీయులకు 11:31సుమారు క్రీ.శ. 60
ఎల్లప్పుడు స్తుతించబడే యేసు ప్రభువుకు తండ్రియైన దేవునికి నేను అబద్ధమాడనని తెలుసు.
- 2 కొరింథీయులకు 11:32సుమారు క్రీ.శ. 60
దమస్కులో అరెత అనే రాజు క్రింది అధిపతి నన్ను బంధించడానికి పట్టణం చుట్టూ కాపలా ఉంచాడు.
- 2 కొరింథీయులకు 11:33సుమారు క్రీ.శ. 60
కాని నేను కిటికీ గుండా గోడ పైనుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకున్నాను.
- 2 కొరింథీయులకు 12:1సుమారు క్రీ.శ. 60
నేను గర్వపడవచ్చు కాని, దాని వలన నాకు ప్రయోజనం లేదు. ప్రభువు దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్తాను.
- 2 కొరింథీయులకు 12:2సుమారు క్రీ.శ. 60
క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడా లేక శరీరం లేకుండా కొనిపోబడ్డాడా అనేది నాకు తెలియదు; అది దేవునికే తెలుసు.
- 2 కొరింథీయులకు 12:3సుమారు క్రీ.శ. 60
అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు అది శరీరంతోనా లేదా శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నాకు తెలియదు. అది దేవునికే తెలుసు.
- 2 కొరింథీయులకు 12:4సుమారు క్రీ.శ. 60
అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు.
- 2 కొరింథీయులకు 12:5సుమారు క్రీ.శ. 60
కాబట్టి అలాంటి వాని గురించి గర్విస్తాను, కాని నా గురించి అయితే నా బలహీనత గురించి తప్ప వేరు విధంగా గర్వించను.
- 2 కొరింథీయులకు 12:6సుమారు క్రీ.శ. 60
ఒకవేళ నేను గర్వించాలనుకున్నా సత్యమే చెప్తాను కాబట్టి అవివేకిని కాను. కాని నేను చేసిన దానికి లేదా చెప్పిన దానికి మించి ఎవరూ నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా నేను వాటికి దూరంగా ఉన్నాను.
- 2 కొరింథీయులకు 12:7సుమారు క్రీ.శ. 60
నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది.
- 2 కొరింథీయులకు 12:8సుమారు క్రీ.శ. 60
దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను.