కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 31:16సుమారు క్రీ.పూ. 1452

    “వీరు బిలాము సలహా ప్రకారం పెయోరు సంఘటనలో ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉండడానికి పురికొల్పినవారు, వీరి మూలంగా యెహోవా ప్రజలు తెగులు ద్వారా మొత్తబడ్డారు.

  2. సంఖ్యాకాండము 31:17సుమారు క్రీ.పూ. 1452

    ఇప్పుడు అబ్బాయిలందరిని చంపండి. స్త్రీలలో పురుషులతో లైంగిక సంబంధం కలిగినవారిని చంపండి,

  3. సంఖ్యాకాండము 31:18సుమారు క్రీ.పూ. 1452

    కానీ కన్యగా ఉన్న ప్రతి అమ్మాయిని మీ కోసం బ్రతకనివ్వండి.

  4. సంఖ్యాకాండము 31:19సుమారు క్రీ.పూ. 1452

    “ఎవరైనా ఎవరినైన చంపినా, లేదా చంపబడిన వారిని తాకినా, తాకినవారు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడవ రోజున ఏడవ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ బందీలను కూడా శుద్ధి చేయాలి.

  5. సంఖ్యాకాండము 31:20సుమారు క్రీ.పూ. 1452

    మీ బట్టలను తోలుతో, మేక వెంట్రుకలతో, చెక్కతో చేయబడిన ప్రతీ వస్తువును శుద్ధి చేసుకోవాలి.”

  6. సంఖ్యాకాండము 31:21సుమారు క్రీ.పూ. 1452

    అప్పుడు యాజకుడైన ఎలియాజరు యుద్ధానికి వెళ్లిన సైనికులతో, “యెహోవా మోషేకు ఇచ్చిన నియమం ఇది:

  7. సంఖ్యాకాండము 31:22సుమారు క్రీ.పూ. 1452

    బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం,

  8. సంఖ్యాకాండము 31:23సుమారు క్రీ.పూ. 1452

    అగ్నిని తట్టుకోగలిగిన దేనినైనా అగ్నిలో వేయాలి, ఆపై అది శుద్ధి అవుతుంది. కానీ అది కూడా శుద్ధి జలంతో శుద్ధి చేయబడాలి. అలాగే అగ్నిని తట్టుకోలేని దానిని ఆ నీటిలో వేయాలి.

  9. సంఖ్యాకాండము 31:24సుమారు క్రీ.పూ. 1452

    ఏడవ రోజు మీరు బట్టలు ఉతుక్కోండి, మీరు శుద్ధులవుతారు. ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు.”

  10. సంఖ్యాకాండము 31:25సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా మోషేతో ఇలా చెప్పారు,

  11. సంఖ్యాకాండము 31:26సుమారు క్రీ.పూ. 1452

    “నీవూ, యాజకుడైన ఎలియాజరు, సమాజం యొక్క కుటంబ యజమానులు, చెరపట్టబడిన మనుష్యులందరిని, జంతువులన్నిటిని లెక్కబెట్టాలి.

  12. సంఖ్యాకాండము 31:27సుమారు క్రీ.పూ. 1452

    ఆ కొల్లగొట్టిన వాటిని యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మిగితా సమాజానికి సమానంగా పంచాలి.

  13. సంఖ్యాకాండము 31:28సుమారు క్రీ.పూ. 1452

    యుద్ధంలో పోరాడిన సైనికుల భాగం నుండి, ప్రతి అయిదువందల నుండి అనగా మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా లేదా గొర్రెలైనా సరే ఒకరిని, ఒకదాన్ని యెహోవాకు పన్నుగా వేరు చేయాలి.

  14. సంఖ్యాకాండము 31:29సుమారు క్రీ.పూ. 1452

    ఈ పన్ను వారి భాగం నుండి తీసుకుని యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇవ్వాలి.

  15. సంఖ్యాకాండము 31:30సుమారు క్రీ.పూ. 1452

    ఇశ్రాయేలీయుల మిగతా సగం వాటా నుండి, మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా, గొర్రెలైనా, వీటిలో ఏవైనా సరే, ప్రతి 50 నుండి ఒకటి తీసుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇవ్వాలి.”

  16. సంఖ్యాకాండము 31:31సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి మోషే యాజకుడైన ఎలియాజరు యెహోవాకు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

  17. సంఖ్యాకాండము 31:32సుమారు క్రీ.పూ. 1452

    సైనికులు తీసుకున్న కొల్లగొట్టిన వాటిలో మిగిలి ఉన్న దోపుడుసొమ్ము 6,75,000 గొర్రెలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 మంది పురుషులతో పడుకొనని కన్యలు.

  18. సంఖ్యాకాండము 31:33సుమారు క్రీ.పూ. 1452

    And threescore and twelve thousand beeves,

  19. సంఖ్యాకాండము 31:34సుమారు క్రీ.పూ. 1452

    And threescore and one thousand asses,

  20. సంఖ్యాకాండము 31:35సుమారు క్రీ.పూ. 1452

    And thirty and two thousand persons in all, of women that had not known man by lying with him.

  21. సంఖ్యాకాండము 31:36సుమారు క్రీ.పూ. 1452

    ఇది యుద్ధంలో పోరాడిన వారి సగం వాటా: 3,37,500 గొర్రెలు

  22. సంఖ్యాకాండము 31:37సుమారు క్రీ.పూ. 1452

    వీటిలో యెహోవాకు ఇచ్చినవి 675;

  23. సంఖ్యాకాండము 31:38సుమారు క్రీ.పూ. 1452

    36,000 పశువులు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 72;

  24. సంఖ్యాకాండము 31:39సుమారు క్రీ.పూ. 1452

    30,500 గాడిదలు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 61;

  25. సంఖ్యాకాండము 31:40సుమారు క్రీ.పూ. 1452

    16,000 మంది మనుష్యులు, వీరిలో యెహోవాకు ప్రత్యేకింపబడినవారు 32.