కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 30:7సుమారు క్రీ.పూ. 1452

    ఆమె భర్తకు ఈ సంగతి తెలుసుకుని అతడు మౌనంగా ఉంటే ఆమె మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు నిలుస్తాయి.

  2. సంఖ్యాకాండము 30:8సుమారు క్రీ.పూ. 1452

    కానీ ఆమె భర్త ఈ సంగతి తెలుసుకుని, అతడు ఆ మ్రొక్కుబడిని లేదా ఆమె అవివేకంగా చేసిన ప్రమాణాన్ని కానీ ఒప్పుకోక రద్దు చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తారు.

  3. సంఖ్యాకాండము 30:9సుమారు క్రీ.పూ. 1452

    “విధవరాలు లేదా విడాకులు తీసుకున్న స్త్రీ చేసే మ్రొక్కుబడి కానీ ప్రమాణం తప్పనిసరిగా చెల్లించాలి.

  4. సంఖ్యాకాండము 30:10సుమారు క్రీ.పూ. 1452

    “ఒక స్త్రీ తన భర్తతో నివసిస్తూ మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ చేస్తే,

  5. సంఖ్యాకాండము 30:11సుమారు క్రీ.పూ. 1452

    తన భర్త దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది.

  6. సంఖ్యాకాండము 30:12సుమారు క్రీ.పూ. 1452

    కానీ ఆమె భర్త వాటి గురించి విన్నప్పుడు వాటిని రద్దు చేస్తే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా తన పెదవులతో చేసిన ప్రమాణాలు ఏవి కూడా నిలువవు, యెహోవా ఆమెను క్షమిస్తారు.

  7. సంఖ్యాకాండము 30:13సుమారు క్రీ.పూ. 1452

    స్త్రీ తాను ఉపవాసం ఉంటానని చేసుకున్న మ్రొక్కుబడి లేదా ప్రతిజ్ఞను ఆమె భర్త ఒప్పుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

  8. సంఖ్యాకాండము 30:14సుమారు క్రీ.పూ. 1452

    కానీ ఆమె భర్త కొన్ని రోజుల వరకు కూడా ఏమి అనకుండా ఉంటే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఒప్పుకుంటున్నాడు. వాటి గురించి విన్నప్పుడు మౌనంగా ఉండడం ద్వారా అతడు వాటిని అంగీకరించాడు.

  9. సంఖ్యాకాండము 30:15సుమారు క్రీ.పూ. 1452

    అయితే అతడు వినిన కొద్ది కాలం తర్వాత వాటిని రద్దు చేస్తే అతడు చేసిన తప్పుకు ప్రతిఫలం భరించాలి.”

  10. సంఖ్యాకాండము 30:16సుమారు క్రీ.పూ. 1452

    ఇవి భార్యా భర్తల సంబంధం, యవ్వన కుమార్తె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి తనకు మధ్య ఉండవలసిన సంబంధం గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమాలు.

  11. సంఖ్యాకాండము 31:1సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా మోషేతో మాట్లాడుతూ,

  12. సంఖ్యాకాండము 31:2సుమారు క్రీ.పూ. 1452

    “ఇశ్రాయేలీయుల కోసం మిద్యానీయుల మీద నీవు ప్రతీకారం తీర్చుకో. ఆ తర్వాత నీవు నీ స్వజనుల దగ్గరకు చేరతావు.”

  13. సంఖ్యాకాండము 31:3సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి మోషే ప్రజలతో, “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి వెళ్లి యెహోవా వారి మీద తీర్చుకోవాలనుకున్న ప్రతీకారాన్ని తీర్చుకోండి.

  14. సంఖ్యాకాండము 31:4సుమారు క్రీ.పూ. 1452

    ఇశ్రాయేలు యొక్క ప్రతి గోత్రం నుండి వేయిమంది పురుషులను యుద్ధానికి పంపండి” అని చెప్పాడు.

  15. సంఖ్యాకాండము 31:5సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి ఇశ్రాయేలు వంశాల నుండి పన్నెండువేలమంది పురుషులు ఆయుధాలతో యుద్ధం కోసం సిద్ధపడ్డారు.

  16. సంఖ్యాకాండము 31:6సుమారు క్రీ.పూ. 1452

    మోషే వారిని యుద్ధానికి పంపాడు, ప్రతి గోత్రం నుండి వేయిమందిని పంపాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, తనతో పాటు పరిశుద్ధాలయం నుండి పరికరాలు సంకేతం ఇవ్వడానికి బూరలు తీసుకున్నాడు.

  17. సంఖ్యాకాండము 31:7సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మిద్యానుతో వారు పోరాడారు, ప్రతి మగవాన్ని హతం చేశారు.

  18. సంఖ్యాకాండము 31:8సుమారు క్రీ.పూ. 1452

    చచ్చినవారిలో అయిదుగురు మిద్యాను రాజులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ. వారు బెయోరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు.

  19. సంఖ్యాకాండము 31:9సుమారు క్రీ.పూ. 1452

    ఇశ్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీలను, పిల్లలను బందీగా తీసుకుని వారి పశువులను, మందలను, వారి ఆస్తిని దోచుకున్నారు.

  20. సంఖ్యాకాండము 31:10సుమారు క్రీ.పూ. 1452

    వారు మిద్యానీయులు నివసించే పట్టణాలన్ని, వారి శిబిరాలతో, తగలబెట్టారు.

  21. సంఖ్యాకాండము 31:11సుమారు క్రీ.పూ. 1452

    వారు తీసుకున్న దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన వాటిని, మనుష్యులు, పశువులతో సహా,

  22. సంఖ్యాకాండము 31:12సుమారు క్రీ.పూ. 1452

    బందీలను, కొల్లగొట్టిన వాటిని, దోపుడుసొమ్మును తీసుకువచ్చారు యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో ఉన్న మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలు సమాజం దగ్గరకు తీసుకువచ్చారు.

  23. సంఖ్యాకాండము 31:13సుమారు క్రీ.పూ. 1452

    మోషే, యాజకుడైన ఎలియాజరు సమాజ నాయకులు వారిని కలుసుకోడానికి శిబిరం బయటకు వచ్చారు.

  24. సంఖ్యాకాండము 31:14సుమారు క్రీ.పూ. 1452

    మోషే సైన్య అధికారులు అనగా, యుద్ధం నుండి తిరిగివచ్చిన సహస్రాధిపతులు శతాధిపతులపై కోప్పడ్డాడు.

  25. సంఖ్యాకాండము 31:15సుమారు క్రీ.పూ. 1452

    “స్త్రీలందరిని మీరు బ్రతకనిచ్చారా?” అని మోషే వారిని అడిగాడు.