కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 31:41సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇచ్చాడు.

  2. సంఖ్యాకాండము 31:42సుమారు క్రీ.పూ. 1452

    సైనికుల భాగం నుండి ఇశ్రాయేలు సమాజం కోసం మోషే వేరుగా ఉంచిన సగభాగం ఇది: 3,37,500 గొర్రెలు, 36,000 పశువులు, 30,500 గాడిదలు, 16,000 మంది మనుష్యులు.

  3. సంఖ్యాకాండము 31:43సుమారు క్రీ.పూ. 1452

    (Now the half that pertained unto the congregation was three hundred thousand and thirty thousand and seven thousand and five hundred sheep,

  4. సంఖ్యాకాండము 31:44సుమారు క్రీ.పూ. 1452

    And thirty and six thousand beeves,

  5. సంఖ్యాకాండము 31:45సుమారు క్రీ.పూ. 1452

    And thirty thousand asses and five hundred,

  6. సంఖ్యాకాండము 31:46సుమారు క్రీ.పూ. 1452

    And sixteen thousand persons;)

  7. సంఖ్యాకాండము 31:47సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఇశ్రాయేలీయుల సగభాగంలో నుండి, ప్రతి యాభైమంది మనుష్యుల్లో నుండి ఒకరిని, జంతువుల్లో నుండి ఒకదాన్ని ఎంచుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇచ్చాడు.

  8. సంఖ్యాకాండము 31:48సుమారు క్రీ.పూ. 1452

    తర్వాత సైన్యానికి అధికారులుగా ఉన్న సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే దగ్గరకు వచ్చి,

  9. సంఖ్యాకాండము 31:49సుమారు క్రీ.పూ. 1452

    మోషేతో, “మేము సైనికుల లెక్క చూశాము. మాలో ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు.

  10. సంఖ్యాకాండము 31:50సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి యెహోవా సన్నిధిలో మాకు ప్రాయశ్చిత్తం కలగాలని మేము భుజ కడియాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, మెడ హారాలు యెహోవాకు అర్పణగా తెచ్చాము” అని చెప్పారు.

  11. సంఖ్యాకాండము 31:51సుమారు క్రీ.పూ. 1452

    మోషే, యాజకుడైన ఎలియాజరు వారి నుండి బంగారు ఆభరణాలు తీసుకున్నారు.

  12. సంఖ్యాకాండము 31:52సుమారు క్రీ.పూ. 1452

    సహస్రాధిపతుల నుండి, శతాధిపతుల నుండి వారు తీసుకుని, యెహోవాకు అర్పణగా అర్పించిన బంగారం మొత్తం 16,750 షెకెళ్ళు.

  13. సంఖ్యాకాండము 31:53సుమారు క్రీ.పూ. 1452

    ప్రతి సైనికుడు తన కోసం తాను దోపుడుసొమ్మును తీసుకున్నాడు.

  14. సంఖ్యాకాండము 31:54సుమారు క్రీ.పూ. 1452

    సహస్రాధిపతుల శతాధిపతుల దగ్గర నుండి మోషే, యాజకుడైన ఎలియాజరు ఆ బంగారం తీసుకుని ఇశ్రాయేలీయులకు యెహోవా ఎదుట జ్ఞాపకార్థంగా సమావేశ గుడారంలో ఉంచారు.

  15. సంఖ్యాకాండము 32:1సుమారు క్రీ.పూ. 1452

    చాలా ఎక్కువ పశువుల మందలు కలిగిన రూబేనీయులు, గాదీయులు తమ పశువులకు యాజెరు, గిలాదు ప్రాంతాలు తగిన స్థలాలని చూశారు.

  16. సంఖ్యాకాండము 32:2సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి వారు మోషే, యాజకుడైన ఎలియాజరు, సమాజ నాయకుల దగ్గరకు వచ్చి,

  17. సంఖ్యాకాండము 32:3సుమారు క్రీ.పూ. 1452

    “అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎల్యాలెహు, షెబాము, నెబో, బెయోను ప్రాంతాలు,

  18. సంఖ్యాకాండము 32:4సుమారు క్రీ.పూ. 1452

    ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన స్థలం పశువులకు తగిన స్థలాలు, మీ సేవకులమైన మాకు పశువులు ఉన్నాయి.

  19. సంఖ్యాకాండము 32:5సుమారు క్రీ.పూ. 1452

    మీరు మా పట్ల దయ చూపిస్తే ఈ స్థలం మీ సేవకులమైన మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి. మమ్మల్ని యొర్దాను అవతలికి దాటించకండి” అని అన్నారు.

  20. సంఖ్యాకాండము 32:6సుమారు క్రీ.పూ. 1452

    మోషే రూబేనీయులతో, గాదీయులతో, “మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ తోటి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగాడు.

  21. సంఖ్యాకాండము 32:7సుమారు క్రీ.పూ. 1452

    “యెహోవా ఇచ్చిన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను ఎందుకు నిరాశపరుస్తారు?

  22. సంఖ్యాకాండము 32:8సుమారు క్రీ.పూ. 1452

    మీ తండ్రులను కాదేషు బర్నియాకు స్థలాన్ని చూసి రమ్మని పంపితే వారు ఇలాగే చేశారు.

  23. సంఖ్యాకాండము 32:9సుమారు క్రీ.పూ. 1452

    వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి తిరిగివచ్చి, యెహోవా వారికిచ్చిన వాగ్దాన భూమికి ప్రవేశించకుండా ఇశ్రాయేలీయులను నిరాశ పరిచారు.

  24. సంఖ్యాకాండము 32:10సుమారు క్రీ.పూ. 1452

    ఆ రోజు యెహోవా కోపం వారిపై రగులుకొని, ఆయన ఇలా ప్రమాణం చేశారు:

  25. సంఖ్యాకాండము 32:11సుమారు క్రీ.పూ. 1452

    ‘వారు హృదయమంతటితో నన్ను వెంబడించలేదు కాబట్టి, ఈజిప్టు నుండి వచ్చిన వారిలో ఇరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు ఉన్నవారు ఎవ్వరూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఈ దేశాన్ని చూడరు.