కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 32:37సుమారు క్రీ.పూ. 1452

    రూబేనీయులు నిర్మించిన పట్టణాలు హెష్బోను, ఎల్యాలెహు, కిర్యతాయిము,

  2. సంఖ్యాకాండము 32:38సుమారు క్రీ.పూ. 1452

    అలాగే నెబో, బయల్-మెయోను (ఈ పేర్లు మార్చబడ్డాయి) షిబ్మా అనే పట్టణాలను నిర్మించుకున్నారు. వారు తిరిగి కట్టుకున్న పట్టణాలకు వారు పేర్లు పెట్టుకున్నారు.

  3. సంఖ్యాకాండము 32:39సుమారు క్రీ.పూ. 1452

    మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులు గిలాదుకు వెళ్లి, దాన్ని జయించి, అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు.

  4. సంఖ్యాకాండము 32:40సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు.

  5. సంఖ్యాకాండము 32:41సుమారు క్రీ.పూ. 1452

    మనష్షే వంశస్థుడైన యాయీరు వారి స్థావరాలను స్వాధీనం చేసుకుని వాటికి హవ్వోత్ యాయీరు అని పేరు పెట్టాడు.

  6. సంఖ్యాకాండము 32:42సుమారు క్రీ.పూ. 1452

    నోబహు అనేవాడు వెళ్లి కెనాతు దాని స్థావరాలను జయించి ఆ ప్రాంతానికి నోబహు అని తన పేరు పెట్టుకున్నాడు.

  7. ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు.

  8. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారి ప్రయాణాల దశలను నమోదు చేశాడు. ఇవి వారి ప్రయాణాల దశలు:

  9. ఇశ్రాయేలీయులు మొదటి నెల పదిహేనవ రోజు అంటే పస్కా తర్వాత రోజున, రామెసేసు నుండి ప్రయాణమయ్యారు. యెహోవా హతం చేసిన తమ జ్యేష్ఠులందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూ ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉండగా జయోత్సాహంతో బయలుదేరారు; ఎందుకంటే యెహోవా వారి దేవుళ్ళ మీద తీర్పు తీర్చారు.

  10. For the Egyptians buried all their firstborn, which the LORD had smitten among them: upon their gods also the LORD executed judgments.

  11. ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు.

  12. వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు.

  13. వారు ఏతాము నుండి వెనుకకు తిరిగి బయల్-సెఫోను ఎదురుగా పీ హహీరోతు వైపుకు వెళ్లి మిగ్దోలు ఎదుట దిగారు.

  14. పీ హహీరోతు నుండి బయలుదేరి సముద్రం గుండా దాటుతూ ఎడారిలోకి చేరారు, వారు మూడు రోజులు ఏతాము ఎడారిలో ప్రయాణం చేసి మారాలో దిగారు.

  15. మారా నుండి బయలుదేరి ఎలీముకు వెళ్లారు, ఎలీములో పన్నెండు నీటి ఊటలు, డెబ్బయి ఈతచెట్లు ఉన్నాయి, వారక్కడ ఉన్నారు.

  16. ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు.

  17. ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.

  18. సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు.

  19. దోపకా నుండి బయలుదేరి ఆలూషుకు వచ్చారు.

  20. ఆలూషు నుండి బయలుదేరి రెఫీదీముకు వచ్చారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.

  21. రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చారు.

  22. సీనాయి ఎడారి నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.

  23. కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు.

  24. హజేరోతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు.

  25. రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను పెరెజుకు వచ్చారు.