కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 11:31సుమారు క్రీ.శ. 59

    కాబట్టి మనల్ని మనమే విమర్శించుకుంటే మన మీదికి తీర్పు రాదు.

  2. 1 కొరింథీయులకు 11:32సుమారు క్రీ.శ. 59

    ప్రభువు ద్వారా మనం తీర్పు పొందినప్పుడు, అంతంలో ఈ లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ఉండడానికి మనం క్రమపరచబడుతున్నాము.

  3. 1 కొరింథీయులకు 11:33సుమారు క్రీ.శ. 59

    కాబట్టి, సహోదరీ సహోదరులారా! మీరు భోజనం చేయడానికి చేరినప్పుడు మీరందరు కలిసి భోజనం చేయండి.

  4. 1 కొరింథీయులకు 11:34సుమారు క్రీ.శ. 59

    ఒకవేళ, మీరు ఒకచోట సమావేశమైనప్పుడు మీరు దేవుని తీర్పుకు గురి కాకుండా ఎవరికైనా ఆకలిగా ఉంటే వారు ఇంటి దగ్గరే ఏదైనా తినాలి. నేను అక్కడికి వచ్చినపుడు మరిన్ని సూచనలు ఇస్తాను.

  5. 1 కొరింథీయులకు 12:1సుమారు క్రీ.శ. 59

    సహోదరీ సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరాల గురించి మీరు తెలియనివారిగా ఉండడం నాకు ఇష్టం లేదు.

  6. 1 కొరింథీయులకు 12:2సుమారు క్రీ.శ. 59

    మీరు దేవుని ఎరుగనివారిగా ఉన్నప్పుడు, ఏదో ఒకలా ప్రభావితం చెంది మూగ విగ్రహాల దగ్గరకు తప్పుగా నడిపించబడ్డారని మీకు తెలుసు.

  7. 1 కొరింథీయులకు 12:3సుమారు క్రీ.శ. 59

    అందువల్ల దేవుని ఆత్మచేత మాట్లాడేవారెవరూ “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ “యేసే ప్రభువు” అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.

  8. 1 కొరింథీయులకు 12:4సుమారు క్రీ.శ. 59

    అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే.

  9. 1 కొరింథీయులకు 12:5సుమారు క్రీ.శ. 59

    అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే.

  10. 1 కొరింథీయులకు 12:6సుమారు క్రీ.శ. 59

    అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే.

  11. 1 కొరింథీయులకు 12:7సుమారు క్రీ.శ. 59

    అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది.

  12. 1 కొరింథీయులకు 12:8సుమారు క్రీ.శ. 59

    ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని,

  13. 1 కొరింథీయులకు 12:9సుమారు క్రీ.శ. 59

    ఆ ఆత్మయే ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు.

  14. 1 కొరింథీయులకు 12:10సుమారు క్రీ.శ. 59

    ఆత్మ ఒకరికి అద్భుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు.

  15. 1 కొరింథీయులకు 12:11సుమారు క్రీ.శ. 59

    ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.

  16. 1 కొరింథీయులకు 12:12సుమారు క్రీ.శ. 59

    ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు.

  17. 1 కొరింథీయులకు 12:13సుమారు క్రీ.శ. 59

    అలాగే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదేతరులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమందరం ఒకే శరీరంగా ఉండడానికి ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందాం, మనందరికి త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడ్డాడు.

  18. 1 కొరింథీయులకు 12:14సుమారు క్రీ.శ. 59

    శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది.

  19. 1 కొరింథీయులకు 12:15సుమారు క్రీ.శ. 59

    “నేను చేయి కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని పాదం చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు.

  20. 1 కొరింథీయులకు 12:16సుమారు క్రీ.శ. 59

    “నేను కన్ను కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని చెవి చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు.

  21. 1 కొరింథీయులకు 12:17సుమారు క్రీ.శ. 59

    శరీరమంతా ఒక్క కన్నే అయితే అది ఎలా వినగలదు? శరీరమంతా ఒక్క చెవే అయితే అది ఎలా వాసన తెలుసుకోగలదు?

  22. 1 కొరింథీయులకు 12:18సుమారు క్రీ.శ. 59

    అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదాన్ని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచారు.

  23. 1 కొరింథీయులకు 12:19సుమారు క్రీ.శ. 59

    అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ?

  24. 1 కొరింథీయులకు 12:20సుమారు క్రీ.శ. 59

    కాబట్టి అనేక అవయవాలు ఉన్నాయి కాని, శరీరం ఒక్కటే.

  25. 1 కొరింథీయులకు 12:21సుమారు క్రీ.శ. 59

    కాబట్టి, “నీతో నాకు అవసరం లేదు!” అని కన్ను చేతితో చెప్పకూడదు. “మీతో నాకు పనిలేదు!” అని శిరస్సు పాదాలతో చెప్పకూడదు.