కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 కొరింథీయులకు 11:6సుమారు క్రీ.శ. 59

    స్త్రీ తన తలపై ముసుగు వేసుకోకపోతే, తన వెంట్రుకలను కత్తిరించుకోవాలి. అయితే వెంట్రుకలు కత్తిరించుకోవడం గాని లేదా తల క్షౌరం చేయించుకోవడం స్త్రీకి అవమానంగా అనిపిస్తే ఆమె తలపై ముసుగు వేసుకోవాలి.

  2. 1 కొరింథీయులకు 11:7సుమారు క్రీ.శ. 59

    పురుషుడు దేవుని పోలికగా మహిమగా ఉన్నాడు కాబట్టి అతడు తన తలపై ముసుగు వేసుకోకూడదు; కాని స్త్రీ పురుషునికి మహిమగా ఉంది.

  3. 1 కొరింథీయులకు 11:8సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది.

  4. 1 కొరింథీయులకు 11:9సుమారు క్రీ.శ. 59

    పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది.

  5. 1 కొరింథీయులకు 11:10సుమారు క్రీ.శ. 59

    ఈ కారణంగా, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలపై ఉండాలి.

  6. 1 కొరింథీయులకు 11:11సుమారు క్రీ.శ. 59

    అయితే, ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.

  7. 1 కొరింథీయులకు 11:12సుమారు క్రీ.శ. 59

    పురుషుని నుండి స్త్రీ ఎలా కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ నుండి జన్మిస్తున్నాడు. అయితే సమస్తం దేవుని నుండి వచ్చాయి.

  8. 1 కొరింథీయులకు 11:13సుమారు క్రీ.శ. 59

    మీకు మీరే ఆలోచించుకోండి; స్త్రీ తలపై ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరియైనదేనా?

  9. 1 కొరింథీయులకు 11:14సుమారు క్రీ.శ. 59

    పురుషునికి పొడవైన వెంట్రుకలు ఉండడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపిస్తుంది కదా?

  10. 1 కొరింథీయులకు 11:15సుమారు క్రీ.శ. 59

    అయితే స్త్రీకి పొడవైన జుట్టు ఆమె తలను కప్పుకోడానికి పైటచెంగుగా ఇవ్వబడింది కాబట్టి పొడవైన జుట్టు కలిగి ఉండడం ఆమెకు గౌరవం కాదా?

  11. 1 కొరింథీయులకు 11:16సుమారు క్రీ.శ. 59

    కాని, ఎవరైనా దీని గురించి వాదించాలనుకుంటే, మనలో గాని దేవుని సంఘంలో గాని మరి ఏ ఇతర ఆచారం లేదని గ్రహించాలి.

  12. 1 కొరింథీయులకు 11:17సుమారు క్రీ.శ. 59

    ఈ ఆజ్ఞలు ఇస్తూ నేను మిమ్మల్ని మెచ్చుకోను, ఎందుకంటే మీ సమావేశాలు మంచి కంటే చెడునే ఎక్కువగా చేస్తున్నాయి.

  13. 1 కొరింథీయులకు 11:18సుమారు క్రీ.శ. 59

    మొదటి విషయం, మీరు దేవుని సంఘంగా ఒకచోట చేరినప్పుడు మీలో విభేదాలు ఉన్నాయని నేను విన్నాను. ఇది కొంతవరకు నిజమని నేను నమ్ముతున్నాను.

  14. 1 కొరింథీయులకు 11:19సుమారు క్రీ.శ. 59

    మీలో ఎవరు దేవుని ఆమోదం పొందారో తెలియడానికి మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండవలసిందే.

  15. 1 కొరింథీయులకు 11:20సుమారు క్రీ.శ. 59

    అయితే మీరు సమావేశమైనప్పుడు మీరు తినేది ప్రభువు రాత్రి భోజనం కాదు.

  16. 1 కొరింథీయులకు 11:21సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే, మీరు తింటున్నప్పుడు, మీలో కొందరు తమ భోజనాన్ని ముందుగానే చేసేస్తున్నారు. దాని ఫలితంగా ఒకరు ఆకలితో ఉండగా మరొకరు మత్తులై పోతున్నారు.

  17. 1 కొరింథీయులకు 11:22సుమారు క్రీ.శ. 59

    తినడానికి, త్రాగడానికి మీకు ఇల్లు లేవా? లేదా ఏమి లేనివారిని అవమానించడం ద్వారా మీరు దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? నేను మీకు ఏమి చెప్పాలి? మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోలేను.

  18. 1 కొరింథీయులకు 11:23సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు నుండి పొందాను. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను తీసుకుని,

  19. 1 కొరింథీయులకు 11:24సుమారు క్రీ.శ. 59

    కృతజ్ఞతలు చెల్లించి, దాన్ని విరిచి ఇలా అన్నారు, “ఇది మీ కోసం ఇవ్వబడిన నా శరీరం; నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి.”

  20. 1 కొరింథీయులకు 11:25సుమారు క్రీ.శ. 59

    అలాగే భోజనమైన తర్వాత ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర నా రక్తంతో కూడిన క్రొత్త నిబంధన, దీన్ని మీరు త్రాగిన ప్రతిసారి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.

  21. 1 కొరింథీయులకు 11:26సుమారు క్రీ.శ. 59

    కాబట్టి మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగిన ప్రతిసారి ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు.

  22. 1 కొరింథీయులకు 11:27సుమారు క్రీ.శ. 59

    కాబట్టి, ఎవరైతే అయోగ్యంగా ప్రభువు రొట్టెను తిని, ఆయన పాత్రలోనిది త్రాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం గురించి అపరాధులవుతారు.

  23. 1 కొరింథీయులకు 11:28సుమారు క్రీ.శ. 59

    కాబట్టి, ప్రతి ఒక్కరు ఆ రొట్టెను తినడానికి ఆ పాత్రలోనిది త్రాగడానికి ముందు తనను తాను పరీక్షించుకోవాలి.

  24. 1 కొరింథీయులకు 11:29సుమారు క్రీ.శ. 59

    ఎందుకంటే, ఎవరైనా ప్రభువు శరీరమని వివేచించకుండా ఆ రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగితే వారు తమపైకి తామే తీర్పు తెచ్చుకోవడానికే తిని త్రాగుతున్నారు.

  25. 1 కొరింథీయులకు 11:30సుమారు క్రీ.శ. 59

    ఈ కారణంగానే, మీలో చాలామంది వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉన్నారు, చాలామంది మరణిస్తున్నారు.