- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- 1 కొరింథీయులకు 9:16సుమారు క్రీ.శ. 59
సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ!
- 1 కొరింథీయులకు 9:17సుమారు క్రీ.శ. 59
నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను.
- 1 కొరింథీయులకు 9:18సుమారు క్రీ.శ. 59
అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానము.
- 1 కొరింథీయులకు 9:19సుమారు క్రీ.శ. 59
నేను స్వతంత్రునిగా ఎవరికీ చెందినవాడిగా ఉన్నప్పటికీ, సాధ్యమైనంత వరకు ఎక్కువమందిని దేవుని కోసం సంపాదించడానికి నన్ను నేను అందరికి దాసునిగా చేసుకున్నాను.
- 1 కొరింథీయులకు 9:20సుమారు క్రీ.శ. 59
యూదులను సంపాదించడానికి యూదునిలా ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాన్ని కాకపోయినా ధర్మశాస్త్రానికి లోబడిన వానిలా అయ్యాను.
- 1 కొరింథీయులకు 9:21సుమారు క్రీ.శ. 59
ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రం లేనివారిలో ఒక్కడిని అయ్యాను. దేవుని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందకపోయినా నేను క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాను.
- 1 కొరింథీయులకు 9:22సుమారు క్రీ.శ. 59
బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. అన్ని విధాలుగా కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధాలుగా ఉన్నాను.
- 1 కొరింథీయులకు 9:23సుమారు క్రీ.శ. 59
సువార్త వల్ల కలిగే ఆశీర్వాదాలలో నేను భాగస్థునిగా ఉండాలని నేను సువార్త కోసమే వీటన్నిటిని చేశాను.
- 1 కొరింథీయులకు 9:24సుమారు క్రీ.శ. 59
పరుగు పందెంలో పాల్గొనే వారందరు పరుగెడతారు కాని, ఒక్కరే బహుమానం పొందుకుంటారని మీకు తెలియదా? అలాగే మీరు బహుమానాన్ని పొందాలని పరుగెత్తండి.
- 1 కొరింథీయులకు 9:25సుమారు క్రీ.శ. 59
ఆటలలో పాల్గొనే ప్రతివారు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. వారు నిత్యం ఉండని కిరీటాన్ని పొందడానికి అంత కష్టపడతారు, కానీ మనమైతే నిత్యం నిలిచే కిరీటం పొందడం కోసం కష్టపడతాం.
- 1 కొరింథీయులకు 9:26సుమారు క్రీ.శ. 59
కాబట్టి, గమ్యంలేని వానిలా నేను పరుగెత్తడం లేదు; గాలిని కొట్టువానిలా నేను పోరాడడంలేదు.
- 1 కొరింథీయులకు 9:27సుమారు క్రీ.శ. 59
అయితే, ఇతరులకు సువార్త ప్రకటించిన తర్వాత బహుమానం పొందే అర్హత నేను కోల్పోకుండా ఉండడానికి నా శరీరాన్ని నలగ్గొట్టి, దాన్ని లోబరచుకొంటున్నాను.
- 1 కొరింథీయులకు 10:1సుమారు క్రీ.శ. 59
సహోదరీ సహోదరులారా, మీరు సత్యం తెలియనివారిగా ఉండాలని నేను కోరడంలేదు. మన పూర్వికులందరూ మేఘం క్రింద ఉన్నారు. సముద్రం గుండా ప్రయాణించారు.
- 1 కొరింథీయులకు 10:2సుమారు క్రీ.శ. 59
వారందరు మేఘంలో సముద్రంలో మోషే బట్టి బాప్తిస్మం పొందారు.
- 1 కొరింథీయులకు 10:3సుమారు క్రీ.శ. 59
వారందరు ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు.
- 1 కొరింథీయులకు 10:4సుమారు క్రీ.శ. 59
అందరు ఒకే ఆత్మీయ నీటిని త్రాగారు. ఎందుకంటే తమతో కూడా ఉన్న ఆత్మీయ బండ నుండి వారు త్రాగారు, ఆ బండ క్రీస్తు.
- 1 కొరింథీయులకు 10:5సుమారు క్రీ.శ. 59
అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.
- 1 కొరింథీయులకు 10:6సుమారు క్రీ.శ. 59
వారిలా మన హృదయాలను చెడ్డ విషయాలపై నిలుపకుండా ఈ సంగతులు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి.
- 1 కొరింథీయులకు 10:7సుమారు క్రీ.శ. 59
వారిలో కొందరిలా మీరు విగ్రహారాధికులుగా ఉండకండి: “ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు,” అని వారి గురించి వ్రాయబడింది.
- 1 కొరింథీయులకు 10:8సుమారు క్రీ.శ. 59
వారిలా మనం లైంగిక దుర్నీతికి పాల్పడకూడదు. వారిలో కొందరు అలా చేయడం వలన ఒక్క రోజులోనే ఇరవై మూడువేలమంది చనిపోయారు.
- 1 కొరింథీయులకు 10:9సుమారు క్రీ.శ. 59
వారిలో కొందరు శోధించినట్లుగా మనం క్రీస్తును శోధించకూడదు, అలా శోధించినవారు సర్పాల వల్ల చనిపోయారు.
- 1 కొరింథీయులకు 10:10సుమారు క్రీ.శ. 59
వారిలా మనం సణుగకూడదు, వారిలో కొందరు సణిగి నాశనం చేసే దూత వలన చనిపోయారు.
- 1 కొరింథీయులకు 10:11సుమారు క్రీ.శ. 59
మనకు ఉదాహరణలుగా ఉండడానికి ఈ సంగతులు వారికి సంభవించి, రాబోయే యుగాంతంలో మనకు హెచ్చరికగా ఉండడానికి వ్రాయబడ్డాయి.
- 1 కొరింథీయులకు 10:12సుమారు క్రీ.శ. 59
కాబట్టి, తాము దృఢంగా నిలిచి ఉన్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
- 1 కొరింథీయులకు 10:13సుమారు క్రీ.శ. 59
సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.